కాళ్లు చేతులు కట్టేసి.. ప్రేమిస్తే.. అగ్గి పెట్టేస్తారు | Engineering Student Gets Kidnapped In Karnataka | Sakshi
Sakshi News home page

కాళ్లు చేతులు కట్టేసి.. ప్రేమిస్తే.. అగ్గి పెట్టేస్తారు

Published Mon, Jul 17 2023 8:00 AM | Last Updated on Mon, Jul 17 2023 8:00 AM

Engineering Student Gets Kidnapped In Karnataka - Sakshi

యశవంతపుర: తమ అమ్మాయిని ప్రేమిస్తున్నాడనే కోపంతో ఆమె తరఫు వ్యక్తులు ఇంజనీరింగ్‌ విద్యార్థిని కిడ్నాప్‌ చేసి నిప్పుపెట్టారు. ఈ సంఘటన సిలికాన్‌ సిటీలోనే చోటుచేసుకుంది. వివరాలు.. బెంగళూరు ఆర్‌ఆర్‌ నగరకు చెందిన రంగనాథ, సత్యప్రేమ దంపతుల కుమారుడు శశాంక్‌ (18) బాధితుడు. అతడు నగరంలోని ఒక కాలేజీలో ఫస్ట్‌ ఇయర్‌ కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజినీరింగ్‌ చదువుతున్నాడు. సమీప బంధువు కూతురిని ప్రేమిస్తున్నాడు. యువతి తల్లిదండ్రులు ఈ ప్రేమను వ్యతిరేకిస్తున్నారు.  

ఇన్నోవాలో వచ్చి, కాళ్లు చేతులు కట్టేసి  
శనివారం ఉదయం ఏసీఎస్‌ కాలేజీకి వచ్చాడు, తరగతులు లేవని చెప్పడంతో బయట నడిచి వెళుతుండగా శశాంక్‌ను ఇన్నోవా కారులో వచ్చిన దుండగులు కిడ్నాప్‌ చేశారు. ఆరుమంది దుండగులు అతనిని నోరు, కాళ్లు చేతులను బట్టతో కట్టేశారు. బెంగళూరు– మైసూరు రహదారిలో కణమిణికె టోల్‌ గేట్‌ సమీపంలో నిర్మానుష్య ప్రదేశంలోకి తీసుకెళ్లి పెట్రోల్‌ పోసి నిప్పుపెట్టారు. అతికష్టంపై అగ్గిని ఆర్పుకొని శశాంక్‌ స్నేహితులకు ఫోన్‌ చేసి చెప్పడంతో వారు వచ్చి అతన్ని ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స జరుగుతోంది.  

ఇటీవలే గొడవ 
యువతిది చామరాజనగర జిల్లా హరదనహళ్లి. యువతి బెంగళూరుకు రాగా శశాంక్‌ ఇంటికి తీసుకెళ్లి మర్యాదలు చేశాడు. ఇది తెలిసి యువతి తల్లిదండ్రులు శశాంక్‌ ఇంటికి వచ్చి గలాటా చేయగా, మీ అమ్మాయికి దూరంగా ఉంటానని శశాంక్‌ హామీనిచ్చాడు. ఇంతలోనే కిడ్నాప్‌ చేసి హత్యాయత్నం జరిగింది. కుంబళగోడు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. హరదనహళ్లిలో యువతి కుటుంబం తాళం వేసుకొని పరారైనట్లు పోలీసులు తెలిపారు. కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలని హోంమంత్రి పరమేశ్వర్‌ ఆదేశించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement