సాక్షి, తిరువనంతపురం : కన్నతల్లిని గొంతు నులిమి హత్యచేసి, ఆపై మృతదేహాన్ని కిరోసిన్ పోసి తగలబెట్టిన ఘటనలో తిరువనంతపురం పోలీసులు 22 ఏళ్ల ఇంజనీరింగ్ విద్యార్థిని అరెస్ట్ చేశారు. క్రిస్మస్ పండగ రోజే కన్నతల్లిని అక్షయ్ దారుణంగా హత్య చేశాడని పోలీసులు వెల్లడించారు. సగం కాలిన మృతదేహాన్ని ఇంటి ఆవరణలోనే పాతిపెట్టడం పోలీసులను నెవ్వరపరిచింది. కన్నతల్లిని హత్య చేసిన కేసులో ఇంజనీరింగ్ విద్యార్థి అక్షయ్‌ని గురువారం అదుపులోకి తీసుకున్నట్లు జిల్లా పోలీస్ అధికారి ఎస్ ప్రకాష్ తెలిపారు.
పోలీసుల కథనం ప్రకారం.. దీపా అశోకన్ కుమారుడు అక్షయ్ ఇంజనీరింగ్ చదువుతున్నాడు. గత కొంతకాలం నుంచి తల్లి మరో వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నట్లు అక్షయ్ గుర్తించాడు. పద్ధతి మార్చుకోవాలని పలుమార్లు తల్లికి దీపను హెచ్చరించాడు అక్షయ్. కానీ, తల్లి తన వైఖరి మార్చుకోవపోవడంతో పాటుగా, కాలేజీ ఫీజులు, ఇతర అవసరాల కోసం డబ్బులు ఇవ్వక పోవడంతో పగ పెంచుకున్నాడు. తన అవసరాలకు డబ్బులు ఇవ్వని తల్లి వివాహేతర సంబంధాలు కొనసాగిస్తోన్న వ్యక్తికి ఇస్తుండటం ఆగ్రహం తెప్పించిందని, దీంతో తల్లి దీపను గొంతు నులిమి బీటెక్ విద్యార్థి అక్షయ్ హత్య చేశాడు. ఆపై మృతదేహాన్ని కిరోసిన్ పోసి తగలబెట్టి.. ఇంటి ఆవరణలోనే పూడ్చిపెట్టాడు. డీఎన్‌ఏ పరీక్షలో సగం కాలిన ఆ మృతదేహం దీపా అశోకన్‌దేనని నిర్ధారించినట్లు పోలీసులు తెలిపారు.
ఇదిలావుండగా.. 50 ఏళ్ల దీపా అశోకన్ తిరువనంతపురంలో ఎల్‌ఐసీ ఏజెంట్‌గా పనిచేస్తున్నారు. ఆమె భర్త మస్కట్‌లో ఉద్యోగం చేస్తుండగా.. కుమార్తె విదేశాల్లో ఉద్యోగం చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment