strangulates
-
బాయ్‌ఫ్రెండ్‌తో చాటింగ్: తమ్ముడిని చంపి, స్టోర్‌రూంలో
సాక్షి, లక్నో: ఉత్తర ప్రదేశ్‌లో దారుణం చోటు చేసుకుంది. బాయ్ ఫ్రెండ్‌తో చాట్ చేయొద్దని వారించిన తమ్ముడిని అక్క(మైనర్ బాలిక )అమానుషంగా హత్య చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రాయ్ బరేలి జిల్లాలో ఈ ఘటన గత గురువారం చోటు చేసుకుంది. పోలీసులు అందించిన సమాచారం ప్రకారం 15 ఏళ్ల బాలిక తన సోదరుడు (9)ని ఇయర్‌ఫోన్ కేబుల్ గొంతుకు బిగించి చంపేసింది. తల్లిదండ్రులు ఇంట్లోలేని సమయంలో బాయ్ ఫ్రెండ్‌తో అక్క ఫోన్లో చాట్ చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేసేవాడు. గంటలు గంటలు ఫోన్ ఎందుకు మాట్లాడతావంటూ గతంలో చాలాసార్లు అక్కను ప్రశ్నించాడు. ఇదే విషయాన్ని అమ్మానాన్నకు కూడా ఫిర్యాదు చేశాడు. దీంతోవారు బాలికను మందలించారు. అయితే తాజాగా అదే తరహాలో ఫోన్లోమాట్లాడటం గుర్తించి వారించాడు. దీంతో ఇద్దరి మధ్యా గొడవ జరిగింది. ఈ క్రమంలో ఆగ్రహంతో అక్కపై దాడి చేశాడు. దీంతో ఆవేశంతో ఊగిపోయిన బాలిక ఇయర్ ఫోన్స్ కేబుల్‌ను అతడి మెడకు బిగించడంతో ఊపరాడక చనిపోయాడు. ఆ తరువాత మృతదేహాన్ని గుట్టుగా స్టోర్ రూంలో దాచి పెట్టి, ఏమీ తెలియనట్టుగా నటించింది. అయితే పిల్లవాడు కనిపించకపోవడంతో తల్లిదండ్రులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బాధితుడి తండ్రి పొరుగువారిపై అనుమానం వ్యక్తం చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు కుటుంబ సభ్యులను కూడా ఆరా తీయాలని భావించారు. మరుసటి రోజు, దుర్వాసన రావడంతో స్టోర్ రూం తెరిచి కొడుకు మృతదేహాన్ని చూసిన తల్లిదండ్రులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. చివరికి పోలీసుల విచారణలో బాలిక తన నేరాన్ని అంగీకరించింది. అయితే తనపై అమ్మా నాన్నకు పదే పదే ఫిర్యాదు చేయడంతో కోపం వచ్చిందని, కానీ తమ్ముడిని చంపాలని అనుకోలేదని పోలీసులతో వాపోయింది. సోమవారం సాయంత్రం ఈ ఉదంతం వెలుగులోకి వచ్చిందని రాయ్ బరేలి పోలీస్ సూపరింటెండెంట్ శ్లోక్ కుమార్ తెలిపారు. కేసు నమోదు చేసి నిందితురాలిని జువైనల్ హోంకు తరలించినట్టు చెప్పారు. -
20 ఏళ్ల వ్యత్యాసం.. ప్రియుడితో కలిసి భర్తను
ఢిల్లీ : ప్రియుడి సహాయంతో భర్తను హత్య చేసిన మహిళను పోలీసులు గురువారం అరెస్టు చేశారు. మొదట ఆత్మహత్యగా చిత్రీకరించాలని ప్రయత్నించినా పోలీసుల విచారణలో ఆమె నిజం ఒప్పేసుకుంది. వివరాల ప్రకారం..ఢిల్లీకి చెందిన ప్రియాంక (30) అనే మహిళ వివాహేతర సంబంధం నడుపుతూ కట్టుకున్న భర్తనే కడతేర్చి ఏమీ ఎరగనట్లు హాస్పిటల్లో ఆత్మహత్య కథ అల్లేయాలనుకుంది. కానీ డాక్టర్లకు అనుమానం వచ్చి విషయాన్ని పోలీసులకు తెలియజేయడంతో ఆమె రట్టు బయటపడింది. ప్రియాంకకు ఆమె భర్తకు మధ్య 20 సంవత్సరాల వ్యత్యాసం ఉండటంతో తాను సంతోషంగా లేనని, ఇప్పటివరకు తమకు పిల్లలు పుట్టలేదని తెలిపింది. తన వివాహం పట్ల ఏమాత్రం సంతోషంగా లేనని, అందుకే ప్రియుడు వీరు బుర్మా, అతని సోదరుడు కరణ్‌లతో కలిసి పథకం ప్రకారం భర్తను హత్య చేశానని పోలీసులకు తెలిపింది. ఆస్తి కూడా లాగేసుకోవాలని ప్లాన్ ప్రియాంక గతకాలంగా బర్మా అనే వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తుంది. వీరిద్దరూ త్వరలోనే పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. దీంతో ఎలాగైనా భర్తను హత్య చేయాలని పథకం రచించారు. ఆగస్టు 18న విషం కలిపిన ఆహారం ఇవ్వడంతో ప్రియాంక భర్త స్పృహ కోల్పోయాడు. దీంతో కరణ్, బర్మాల సహాయంతో భర్త గొంతు నులిపి చంపేసింది. ఆ తర్వాత ఏమీ ఎరగనట్లు స్థానిక బుద్ విహార్ లోని బ్రహ్మశక్తి ఆసుపత్రికి తరలించారు. ఆరోగ్య సమస్యలు ఉండటంతో ఆత్మహత్య చేసుకున్నాడని మొసలి కన్నీళ్లు పెట్టుకుంది. అయితే బాధితుడి గొంతుపై గుర్తులు ఉండటంతో అనుమానం వచ్చిన వైద్యులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. విచారణలో ప్రియాంక గుట్టు బయటపడటంతో వెంటనే ఆమెను, కరణ్‌లను అరెస్టు చేయగా, ఆమె ప్రియుడు బర్మా ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. ప్రియాంక భర్త ఢిల్లీలోని మాయపురి ఇండస్ట్రియల్ ఏరియాలో పనిచేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించి ఆస్తిని కూడా తనపై బదిలీ చేయుంచుకోవాలని చూసినట్లు విచారణలో ప్రియంక అంగీకరించింది. ఆమె తరుచూ భర్తతో గొడవపడుతూ ఉండేదని కానీ ఇంత ఘాతుకానికి పాల్పడుతుందని ఊహించలేదని ప్రియాంక అత్తమామలు వాపోయారు. -
ఫీజులకు డబ్బివ్వలేదని.. కన్నతల్లినే!
సాక్షి, తిరువనంతపురం : కన్నతల్లిని గొంతు నులిమి హత్యచేసి, ఆపై మృతదేహాన్ని కిరోసిన్ పోసి తగలబెట్టిన ఘటనలో తిరువనంతపురం పోలీసులు 22 ఏళ్ల ఇంజనీరింగ్ విద్యార్థిని అరెస్ట్ చేశారు. క్రిస్మస్ పండగ రోజే కన్నతల్లిని అక్షయ్ దారుణంగా హత్య చేశాడని పోలీసులు వెల్లడించారు. సగం కాలిన మృతదేహాన్ని ఇంటి ఆవరణలోనే పాతిపెట్టడం పోలీసులను నెవ్వరపరిచింది. కన్నతల్లిని హత్య చేసిన కేసులో ఇంజనీరింగ్ విద్యార్థి అక్షయ్‌ని గురువారం అదుపులోకి తీసుకున్నట్లు జిల్లా పోలీస్ అధికారి ఎస్ ప్రకాష్ తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం.. దీపా అశోకన్ కుమారుడు అక్షయ్ ఇంజనీరింగ్ చదువుతున్నాడు. గత కొంతకాలం నుంచి తల్లి మరో వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నట్లు అక్షయ్ గుర్తించాడు. పద్ధతి మార్చుకోవాలని పలుమార్లు తల్లికి దీపను హెచ్చరించాడు అక్షయ్. కానీ, తల్లి తన వైఖరి మార్చుకోవపోవడంతో పాటుగా, కాలేజీ ఫీజులు, ఇతర అవసరాల కోసం డబ్బులు ఇవ్వక పోవడంతో పగ పెంచుకున్నాడు. తన అవసరాలకు డబ్బులు ఇవ్వని తల్లి వివాహేతర సంబంధాలు కొనసాగిస్తోన్న వ్యక్తికి ఇస్తుండటం ఆగ్రహం తెప్పించిందని, దీంతో తల్లి దీపను గొంతు నులిమి బీటెక్ విద్యార్థి అక్షయ్ హత్య చేశాడు. ఆపై మృతదేహాన్ని కిరోసిన్ పోసి తగలబెట్టి.. ఇంటి ఆవరణలోనే పూడ్చిపెట్టాడు. డీఎన్ఏ పరీక్షలో సగం కాలిన ఆ మృతదేహం దీపా అశోకన్‌దేనని నిర్ధారించినట్లు పోలీసులు తెలిపారు. ఇదిలావుండగా.. 50 ఏళ్ల దీపా అశోకన్ తిరువనంతపురంలో ఎల్ఐసీ ఏజెంట్‌గా పనిచేస్తున్నారు. ఆమె భర్త మస్కట్‌లో ఉద్యోగం చేస్తుండగా.. కుమార్తె విదేశాల్లో ఉద్యోగం చేస్తోంది. -
పరువు కోసం కూతుర్ని కడతేర్చాడు
జైపూర్: రాజస్థాన్ లోని జైపూర్ లో అమానుషం చోటు చేసుకుంది. కన్నకూతుర్ని తండ్రి హత్య చేసిన ఘటన కలకలం రేపింది. శ్రీగంగా నగర్ జిల్లాలోని లాఖా హాకం గ్రామానికి చెందిన రైతు నారాయణ జాట్(45) కూతురు (21)ని కిరాతకంగా హత్య చేశాడు. డిగ్రీ చదువుతున్న యువతి, తన సహవిద్యార్థి, అదే గ్రామానికి చెందిన యువకుడితో ప్రేమలో పడింది. అతడినే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది. ఈ విషయంలో తల్లిదండ్రులను ఒప్పించేందుకు ప్రయత్నించింది. అయితే ఇద్దరి వేర్వేరు కులాలు కాడంతో కూతురి పెళ్లిని తండ్రి తీవ్రంగా వ్యతిరేకించాడు. ఆ కుర్రాడితో తెగతెంపులు చేసుకోవాలని నారాయణ్ రామ్ చాలాసార్లు కూతుర్ని హెచ్చరించాడు. బయటకు వెళ్లేందుకు వీల్లేదని ఆంక్షలు పెట్టాడు. ఈ క్రమంలో ఆగ్రహానికి గురైన తండ్రి ఆమెను గొంతు నులిమి చంపేశాడు. భార్య, కొడుకు చూస్తుండగానే ఈ కిరాతకానికి ఒడిగట్టాడు. అనంతరం పోలీస్ స్టేషనుకు వెళ్లి లొంగిపోయాడు. పరువు కోసమే ఈ హత్య చేసి ఉంటాడని అనుమానిస్తున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలు పెట్టారు.