సినిమా రేంజ్‌లో బైక్‌ చోరీ.. హీరో అనిపించుకున్న సెక్యూరిటీ గార్డ్‌! | Bike Thieves Caught At Delhi Colony Gate Video Viral | Sakshi

ఏం గురూ నా ముందే ఆటలా.. దొంగల పనిపట్టిన సెక్యూరిటీ గార్డ్‌.. సూపర్‌ వీడియో

Sep 27 2022 6:58 PM | Updated on Sep 27 2022 6:59 PM

Bike Thieves Caught At Delhi Colony Gate Video Viral - Sakshi

ఇద్దరు దొంగలు సినిమా రేంజ్‌కు బైక్‌ దొంగతనానికి పాల్పడ్డారు. కానీ, ఇంతలో గేట్‌ వద్ద కాపలాగా ఉన్న సెక్యూరిటీ గార్డ్‌ సమయస్పూర్తితో వారికి ఊహించిన షాక్‌ తగిలింది. దెబ్బకు పట్టపగలే దొంగలకు చుక్కలు కనిపించాయి. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకోగా.. వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

వివరాల ప్రకారం.. సౌత్‌ఢిల్లీలోని ఎవరెస్ట్‌ అపార్ట్‌మెంట్‌లోకి తాము మున్సిపల్‌ అధికారులమని చెప్పుకుంటూ ఇద్దరు వ్యక్తులు వెళ్లారు. తర్వాత వారి కదలికలు అనుమానంగా ఉండటంతో సెక్యూరిటీ గార్డ్‌ గమనిస్తూనే ఉన్నాడు. కాగా, మధ్యాహ్నం సమయంలో అపార్ట్‌మెంట్‌లోపలికి బైక్‌పై ఓ కొరియర్‌ డెలివరీ బాయ్‌ వచ్చాడు. అయితే, ఓ డెలివ‌రీ ఏజెంట్ త‌న బైక్ తాళాల‌ను ఆ వాహ‌నానికే ఉంచి వెళ్లాడు. 

బైక్‌ను గమనించిన ఇద్ద‌రు వ్య‌క్తులు బైక్‌ను తీసుకొని పారిపోయేందుకు య‌త్నించారు. బైక్‌ను స్టార్ట్‌ చేయడం గమనించిన డెలివరీ బాయ్‌.. గ‌ట్టిగా కేక‌లు వేయ‌డంతో గేట్ వ‌ద్ద కాప‌లాగా ఉన్న సెక్యూరిటీ గార్డ్ అల‌ర్ట్ అయ్యాడు. ఫాస్ట్‌గా దూసుకొస్తున్న బైక్‌ను ఆపేందుకు సూపర్‌ ప్లాన్‌ చేశాడు. ఒక్కసారిగా గేటు మూసివేయడంతో బైక్ ఆ గేటు మ‌ధ్య‌లో ఇరుక్కుపోయింది. దీంతో, వారిద్దరూ గేటు వద్దే పడిపోయారు. అనంతరం, స్థానికులు వారిని పట్టుకునే ప్రయత్నం చేయగా ఒకరు పారిపోయారు. మరొకరిని పట్టుకొని పోలీసుల‌కు అప్ప‌గించారు. ఈ ఘటనపై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. కాగా, దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement