బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
నిజామాబాద్ : బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిజామాబాద్ జిల్లా కామారెడ్డిలో మంగళవారం ఈ సంఘటన జరిగింది. వివరాలు...కామారెడ్డి పట్టణంలోని బతుకమ్మ కుంటకు చెందిన దుండగులు నరేష్, బెల్లుల్ల రాజులు రెండు బైక్‌లను దొంగలించారు. మంగళవారం పోలీసులు చేపట్టిన తనిఖీల్లో వారిద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. వారి నుచి రెండు బైకులను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీపులు దర్యాప్తు ప్రారంభించారు.
(కామారెడ్డి)