హైదరాబాద్ (కాచిగూడ) : మత్తుకు బానిసై బైక్‌లను దొంగతనం చేస్తూ తప్పించుకు తిరుగుతున్న ముగ్గురు బైక్ దొంగలను శుక్రవారం కాచిగూడ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. బైక్ దొంగల నుంచి దాదాపు రూ.3 లక్షల విలువ చేసే 7 ద్విచక్ర వాహనాలను రికవరీ చేశారు. ఈ సందర్భంగా కాచిగూడ పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాచిగూడ ఏసీపి చేబ్రోలు లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. ముంబాయికి చెందిన కల్పత్రో ఆకాష్ (23), మోసిన్ మహ్మద్ షఫి షేక్ (20)లు క్యాటరింగ్ చేస్తూ ముషీరాబాద్ జెమినికాలనీ ఫిష్ మార్కెట్ ప్రాంతంలో ఉంటున్నారు. యాకుత్‌పుర ప్రాంతానికి చెందిన మహ్మద్ తోఫిక్ (21) ఆటో డ్రైవర్. వీరు ముగ్గురు ఒక ముఠాగా ఏర్పడి నగరంలోని వివిధ ప్రాంతాల్లో పార్క్ చేసిన ద్విచక్ర వాహనాలను దొంగిలిస్తున్నారు.
కాచిగూడ లింగంపల్లి చౌరస్తాలో వాహనాల తనిఖీల్లో భాగంగా వీరిని అదుపులోకి తీసుకుని విచారించగా బైక్‌లను దొంగిలించినట్లు ఒప్పుకున్నారని తెలిపారు. నల్లకుంట పోలీస్‌స్టేషన్ పరిధిలో 2, ఓయు పోలీస్‌స్టేషన్ పరిధిలో 1, ముషీరాబాద్ పోలీస్‌స్టేషన్ పరధిలో 1, కాచిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో 3 బైక్‌లను దొంగిలించారు. హోండా షైన్ వాహనాలు 2, హీరో హోండా వాహనాలు 2, టీవీఎస్, బజాజ్ పల్సర్, హీరో ఫ్యాషన్ ప్రో ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ముగ్గురు బైక్ దొంగలను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. బైక్‌దొంగలను పట్టుకున్నందులకు డిఎస్‌ఐ కౌశిక్‌తో పాటు టీమ్‌ను ఏసీపీ అభినందించారు.
ద్విచక్రవాహనాల ముఠా అరెస్టు
Published Fri, Jun 26 2015 4:32 PM | Last Updated on Tue, Sep 4 2018 5:16 PM
Advertisement
Advertisement