
మల్లాపూర్: చిన్న వయసులోనే జల్సాలకు అలవాటు పడి చోరీలకు పాల్పడుతున్న నలుగురు యువకులను మల్కాజిగిరి సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. గురువారం రాచకొండ క్రైం డీసీపీ నాగరాజు వివరాలు వెల్లడించారు. బాలానగర్ ఫిష్ మార్కెట్ ప్రాంతానికి చెందిన షేక్ జునీత్‌గౌస్,, సంతోష్‌నగర్ ప్రాంతానికి మహ్మద్ ఫరాఆహ్మద్ తరచూ పార్కు చేసిన బైక్‌లను దొంగిలించేవారు. వచ్చిన డబ్బుతో బైక్ రేసింగ్‌లకు పాల్పడుతూ జల్సా చేసేవారు. గురువారం నాచారం పోలీసులు అనుమానాస్పదంగా తిరుగుతున్న వీరిని అదుపులోకి తీసుకొని విచారించగా నేరాలు అంగీకరించారు. వీరి నుంచి ఐదు బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు.
సెల్‌ఫోన్ దొంగలు అరెస్టు
హయత్‌నగర్‌కు చెందిన వేముల గోపీ, భాగ్యనగర్ కాలనీకి చెందిన గణేష్ బస్టాప్, మార్కెట్‌లలో ఒంటరిగా ఫోన్ మాట్లాడుతున్న వారి వద్ద నుండి సెల్‌ఫోన్లు లాక్కెళ్లేవారు. ఇప్పటివరకు రాచకొండ కమిషనరేట్ పరిధిలో 20 స్మార్ట్ ఫోన్‌లను దొంగిలించారు. మరో ఇద్దరితో కలిసి బైక్‌ల చోరీలకు కూడా పాల్పడేవారు. పోలీసులు వీరిని అదుపులోకి తీసుకుని 20 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. సమావేశంలో అడిషనల్ డీసీపీ ఎస్‌కే.సలీమా, సీసీఎస్ మల్కాజిగిరి ఇన్‌స్పెక్టర్ లింగయ్య తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment