మల్కాజిగిరి: కుమారుడు ఆత్మహత్య చేసుకోవడం..అదే గదిలో అతని తల్లి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంఘటన మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలి్పన వివరాల మేరకు..మౌలాలి ఈస్ట్ ప్రగతినగర్‌కు చెందిన మెరుగు విజయ (73) భర్త చనిపోవడంతో కుమారుడు శ్రీధర్ గౌడ్(47)తో కలిసి ఉంటుంది. శ్రీధర్ గౌడ్‌కు భార్య శైలజతో మనస్పర్థలు రావడంతో విడాకులకు దరఖాస్తు చేసుకున్నారు. ఆమె వేరే ఇంట్లో ఉంటోంది. కాగా శ్రీధర్ గౌడ్ ప్రస్తుతం జవహర్‌నగర్‌లో ఉన్న వాటర్ ప్లాంట్ నిర్వహణ చూసుకుంటున్నాడు.
వారి సంతానంలో కుమారుడు, కూతురు ఇతని వద్ద ఉంటుండగా..మరో కుమారుడితో కలిసి శైలజ కాప్రాలో ఉంటున్నది. బుధవారం ఉదయం శ్రీధర్ కుమార్తె నిద్రలేచి చూసేసరికి తండ్రి బెడ్‌రూమ్‌లో ఉరివేసుకొని ఉండగా, అదే రూములో ఆమె నానమ్మ విజయ కిందపడి చనిపోయిఉండడం గమనించింది. వెంటనే బయటకు వచ్చి కేకలు వేయడంతో స్ధానికులు వచి్చ..పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్ధలానికి చేరుకున్న ఇన్‌స్పెక్టర్ సత్యనారాయణ, ఎస్‌ఐ మల్లయ్యలు వారిద్దరి మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం గాంధీ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. శ్రీధర్ భార్య శైలజ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని వారు తెలిపారు.
కుటుంబ సమస్యలే కారణమా?
భిక్షపతి, విజయలకు నలుగురు సంతానం. ఇద్దరు ఆడపిల్లలు, ఇద్దరు మగపిల్లలు. ఆర్థికంగా బాగానే ఉన్న కుటుంబం. శ్రీధర్‌కు అతని భార్య శైలజకు విభేదాలు ఏర్పడ్డాయి. గతంలో మల్కాజిగిరి పోలీస్‌స్టేషన్‌లో శ్రీధర్‌పై వరకట్నం వేధింపుల కేసు నమోదైంది. విడాకుల కోసం కోర్టును ఆశ్రయించగా..వాదనలు పూర్తయి వచ్చే నెలలో తీర్పు రానున్నట్లు సమాచారం. పోలీసులు శ్రీధర్ ఇంట్లో ఉన్న సీసీ కెమెరా ఫుటేజీని ప రిశీలించగా..మంగళవారం రాత్రి సుమారు 9 గంటల సమయంలో శ్రీధర్ బయట నుంచి ఇంటికి వచ్చాడు. ఆ తర్వాత పాలు పోసే వ్యక్తి రావడంతో విజయ పాలు పోయించుకున్నట్లు రికార్డు అయింది.
విజయ నేల మీద పడి వుండడం, తల వెనుక రక్తం ఉండడాన్ని పోలీసులు గమనించారు. కొడుకు ఆత్మహత్య చేసుకోవడంతో షాక్‌కు గురైన ఆమె కింద పడిపోయి చనిపోయిందా లేదా ఇతర కారణాలు ఏమైనా ఉన్నా యా అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వచ్చే నెలలో విడాకులకు సంబంధించి తీర్పు రానున్నడంతో శ్రీధర్ ఒత్తిడికి గురై ఆత్మహత్యకు పాల్పడివుండవచ్చునని భావిస్తు న్నారు. గత కొంత కాలంగా ఆస్తి పంపకాలపై కూడా గొడవలు జరుగుతున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment