
సాక్షి, పల్నాడు: పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. అతి వేగంలో ఉన్న కారు అదుపు తప్పి చెట్టును ఢీకొన్న ఘటనలో నలుగురు మృతిచెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడినట్టు సమాచారం.
వివరాల ప్రకారం.. పల్నాడు జిల్లాలోని పిడుగురాళ్ల మండలం తుమ్మలచెరువు సమీపంలోని గీతిక స్కూల్ వద్ద ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. అతివేగంలో ఉన్న కారు అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే నలుగురు మృతి చెందగా.. మరో నలుగురు గాయపడ్డారు. దీంతో, వారిని స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించారు. అయితే, వీరంతా హైదరాబాద్ నుంచి కావలి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment