
సాక్షి, గుంటూరు: జిల్లాలోని పిడుగురాళ్లలో శనివారం భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. రెండు సెకన్లపాటు భూమి కంపించడంతో స్థానికులు భయాందోళనకు లోనయ్యారు. ఒక్కసారిగా భూప్రకంపనలు సంభవించడంతో బెంబేలెత్తిపోయిన ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. కొన్ని సెకన్లపాటు ఏం జరుగుతుందో స్థానికులకు అర్థం కాలేదు. స్వల్పంగా భూమి కంపించిన విషయాన్ని తెలుసుకున్న ప్రజలు కాసేపు భయంతో బిక్కుబిక్కుమంటూ గడిపారు.