నీళ్లలో చేలు.. కళ్లలో నీళ్లు
ఇంతకుముందు ఎటు చూసినా పచ్చటి పంటపొలాలు ఉండేవి. కానీ ఇప్పుడు ఎటు చూసినా నీళ్లే కనిపిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కురిసన భారీ వర్షాలకు పల్నాడు ప్రాంతం మునిగిపోయింది. చేల నిండా నీళ్లు నిండిపోవడంతో.. రైతుల కళ్లలో నీళ్లు సుడులు తిరుగుతున్నాయి. ఆపదలో ఉన్న అన్నదాతకు కనీసం భరోసా కల్పించే దిక్కు కూడా లేకుండా పోయింది. ఇలాంటి తరుణంలో ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వాళ్లకు అండగా తానుంటానంటూ వెళ్లారు.
వర్షాలతో తీవ్రంగా నష్టపోయిన గుంటూరు జిల్లా రైతులను పలకరించేందుకు రెండు రోజులు పర్యటన చేస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా మంగళవారం ఉదయం పిడుగురాళ్ల అంజిరెడ్డి ఆస్పత్రి సెంటర్‌లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. మరికాసేపట్లో పాయన అనుపాలెం చేరుకోనున్నారు. అక్కడ నీట మునిగిన పంటపొలాలను వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరిశీలిస్తారు. రైతులను పలకరిస్తారు.