గురజాల నియోజకవర్గంలో రౌడీయిజం రాజ్యమేలుతోందని ప్రతిపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస్ రావు మైనింగ్ మాఫియా సృష్టించారని, ఈ దోపిడీని అరికట్టాల్సిన సీఎం చంద్రబాబు నాయుడు ఆయన కొడుకు నారా లోకేష్ యరపతినేనితో బాగాలు పంచుకుంటున్నారని ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం గుంటూరు జిల్లా, గురజాల నియోజవకవర్గం పిడుగురాళ్లలో జరిగిన బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి ఆయన ప్రసంగించారు.