పిడుగురాళ్ల (గుంటూరు జిల్లా) : పిడుగురాళ్ల ఫైర్ ఆఫీసులో ఓ వ్యక్తి నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ ఫైర్ ఆఫీసర్ శివశంకర్ ఏసీబీ అధికారులకు చిక్కాడు. పిడుగురాళ్లలో ఇటీవల ఓ అగ్ని ప్రమాదంలో నరేంద్ర అనే వ్యక్తికి చెందిన దుకాణం తగలబడిపోయింది. దీనికి సంబంధించిన ఇన్సూరెన్స్ కోసం ఫైర్ ఆఫీసర్ దగ్గరకు వెళితే ఆయన రూ.30 వేలు లంచం డిమాండ్ చేశాడు. దీంతో నరేంద్ర ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఫైర్ ఆఫీసర్ శివశంకర్ బాధితుడి నుంచి రూ.20 వేలు తీసుకుంటుండగా పథకం ప్రకారం గురువారం పట్టుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.