గుంటూరు టీడీపీలో ఘర్షణ.. ఐదుగురికి గాయాలు | tdp leaders fighting in piduguralla five injured | Sakshi
Sakshi News home page

గుంటూరు టీడీపీలో ఘర్షణ.. ఐదుగురికి గాయాలు

Published Sat, Sep 10 2016 1:51 PM | Last Updated on Fri, Aug 10 2018 9:46 PM

tdp leaders fighting in piduguralla five injured

పిడుగురాళ్ల : గుంటూరు జిల్లాలో టీడీపీ నాయకుల మధ్య అంతర్గత కుమ్ములాటలు భగ్గుమన్నాయి. పిడుగురాళ్లలో రెండు వర్గాలకు చెందిన టీడీపీ నాయకులు ఒకరిపై మరొకరు రాళ్లు రువ్వుకున్న సంఘటనలో ఐదుగురికి గాయాలయ్యాయి. ఈ సంఘటన పిడుగురాళ్ల మండలం అగ్రహారంలో శనివారం చోటుచేసుకుంది. 

స్థానిక ఎంపీటీసీ రాంరెడ్డి సైదమ్మ(టీడీపీ) వైఎస్సార్సీపీకి అనుకూలంగా వ్యవహరిస్తోందనే నెపంతో కొందరు టీడీపీ కార్యకర్తలు ఆమె పై రాళ్లతో దాడి చేశారు. దీంతో ఎంపీటీసీ వర్గీయులు కూడా రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో ఐదుగురికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement