పిడుగురాళ్ల (గుంటూరు జిల్లా): పిడుగురాళ్ల మండలం బ్రాహ్మణపల్లిలో వృద్ధ దంపతులు దారుణహత్యకు గురయ్యారు. గ్రామానికి చెందిన వెంకటప్పయ్య(75), వెంకట రామమ్మ(65) అనే దంపతులను ముఖంపై దిండు ఉంచి ఊపిరాడకుండా చేసి చంపారు. ఘటన అనంతరం వారి ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు.
ఈ సంఘటన సోమవారం రాత్రి జరిగి ఉండవచ్చునని అనుమానిస్తున్నారు. ఆలస్యంగా మంగళవారం సాయంత్రం వెలుగులోకి వచ్చింది. గ్రామస్తుల సమాచారంతో సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
వృద్ధ దంపతుల దారుణహత్య
Published Tue, Jan 5 2016 6:10 PM | Last Updated on Sun, Sep 3 2017 3:08 PM
Advertisement
Advertisement