సిమెంట్ లారీ, కారు ఢీకొన్న ఘటనలో త్రుటిలో ప్రాణాపాయం తప్పింది. ఈ ఘటన గుంటూరు జిల్లా పిడుగురాళ్ల సమీపంలో శనివారం సాయంత్రం చోటుచేసుకుంది.
పిడుగురాళ్ల రూరల్ (గుంటూరు) : సిమెంట్ లారీ, కారు ఢీకొన్న ఘటనలో త్రుటిలో ప్రాణాపాయం తప్పింది. ఈ ఘటన గుంటూరు జిల్లా పిడుగురాళ్ల సమీపంలో శనివారం సాయంత్రం చోటుచేసుకుంది. హైదరాబాద్ నుంచి చీరాలకు వెళ్తున్న కారు..పిడుగురాళ్ల వద్ద ఎదురుగా వస్తున్న ఆటోను తప్పించే క్రమంలో వేగం తగ్గింది.
అదే సమయంలో నల్లగొండ జిల్లా హుజూర్‌నగర్ నుంచి సిమెంట్ లోడుతో వస్తున్న లారీ కారును ఢీకొట్టింది. అయితే డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించటంతో త్రుటిలో ప్రమాదం తప్పింది. కారులో వెనుక సీట్లో కూర్చున్న నలుగురు పిల్లలకు గాయాలయ్యాయి.