
'ఒక్క చుక్క నీరు తేలేకపోయారు'
గుంటూరు: పట్టిసీమతో కృష్టాడెల్టాను సస్యశ్యామలం చేస్తామని చెప్పి, డెల్టా మొత్తం ఎండిపోతున్నా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పట్టించుకోవడం లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మండిపడ్డారు. పట్టిసీమ ద్వారా 80 టీఎంసీల నీరు తెస్తామన్న చంద్రబాబు ఒక్క చుక్కనీరు తేలేకపోయారన్నారు.
పులిచింతల ప్రాజెక్టుకు వందకోట్లు ఖర్చు చేసి ఉంటే 45 టీఎంసీల నీరు నిల్వ చేసుకునే అవకాశం ఉండేదని ఆయన అభిప్రాయపడ్డారు. వైఎస్ రాజశేఖరరెడ్డి పులిచింతలను నిర్మించారనే కారణంతోనే చంద్రబాబు దానిని పట్టించుకోవడం లేదని అంబటి తెలిపారు.