పట్టిసీమలో భక్తుల పాట్లు
పోలవరం : పట్టిసీమ పుష్కరఘాట్‌లో పుణ్యస్నానాలకు భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. గోదావరికి వరద పెరగడంతో భక్తుల రాకపోకల కోసం నదిలో వేసి ఇసుక బస్తాలు మునిగిపోయే దుస్థితి నెలకొంది. అయినా వాటిపైనే భక్తులు స్నానాలకు నడిచి వెళ్తున్నారు. మండలంలోని పట్టిసీమతోపాటు గూటాల, పోలవరం ఘాట్లలో జనం పలుచగా కనిపిస్తున్నారు. పట్టిసీమ శివక్షేత్రంలో భక్తులకు పులిహార ప్రసాదం అందజేశారు. వృద్ధులు, చిన్నారుల కోసం పట్టిసీమ రేవులో జల్లుస్నానాలు ఏర్పాటు చేశారు.