విద్యుత్ ఉత్పాదన పేరుతో నీళ్లు దిగువ ప్రాంతాలకు వదలొద్దని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే గడికోట ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి అన్నారు. శ్రీశైలం ప్రాజెక్టులో నీటి మట్టం 854 అడుగులకు తగ్గకుండా చూడాలని ప్రభుత్వాన్ని ఆయన కోరారు. వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం మధ్యాహ్నం ఆయన విలేకరులతో మాట్లాడారు.