
సాక్షి, హైదరాబాద్: గోదావరి జలాలను కృష్ణా బేసిన్‌కు మళ్లిస్తూ చేపట్టిన పట్టిసీమ ప్రాజెక్టు నుంచి తెలంగాణకు దక్కాల్సిన వాటాలపై అదే ప్రతిష్టంభన కొనసాగుతోంది. దీనిపై ఇప్పటికే కృష్ణాబోర్డు చేతులెత్తేయగా.. గోదా వరి నదీ యాజమాన్య బోర్డు వద్ద కూడా పంచాయితీ ఎటూ తేలలేదు. పట్టిసీమ మళ్లిం పు జలాలపై ఎలాంటి అభ్యంతరాలు, విజ్ఞప్తు లు ఉన్నా.. వాటిని లిఖితపూర్వకంగా తమకు అందజేయాలంటూ గోదావరి బోర్డు చేతులు దులుపుకొంది.
గోదావరి బేసిన్‌లోని ప్రాజెక్టుల పై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య వివాదాలు, కొత్త ప్రాజెక్టుల డీపీఆర్‌లు, వర్కిం గ్ మాన్యువల్, మళ్లింపు జలాల అంశాలపై చర్చించేందుకు మంగళవారం హైదరాబాద్‌లో ని జల సౌధలో గోదావరి బోర్డు సమావేశం నిర్వహించింది. బోర్డు చైర్మన్ సాహూ, సభ్య కార్యదర్శి సమీర్ చటర్జీ, తెలంగాణ, ఏపీ నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శులు ఎస్‌కే జో షి, శశిభూషణ్ కుమార్ పాల్గొన్నారు.
మళ్లింపు జలాలపైనే ప్రధానంగా చర్చ
సమావేశంలో మళ్లింపు జలాల అంశంపై చర్చించారు. పట్టిసీమ ద్వారా ఏపీ ఇప్పటికే 106 టీఎంసీల మేర గోదావరి నీటిని కృష్ణా డెల్టాకు తరలించిందని, అందులోంచి ఎగువ రాష్ట్రాలకు దక్కే 45 టీఎంసీల వాటాను తేల్చి తెలంగాణకు కేటాయింపులు చేయాలని రాష్ట్ర అధికారులు కోరారు. దీనిపై కృష్ణా బోర్డు నిర్ణయం తీసుకోనందున గోదావరి బోర్డు నిర ్ణయం తీసుకోవాలన్నారు. దీనిపై ఏపీ విభేదిం చింది. పట్టిసీమ ఎత్తిపోతల ప్రాజెక్టుతో తెలం గాణకు చుక్క నీటి వాటా కూడా దక్కదని.. పోలవరం ప్రాజెక్టు ఫలాలను ముందుగా అందుకోవాలన్న లక్ష్యంతోనే పట్టిసీమ చేపట్టా మని పేర్కొంది.
తెలంగాణ సర్కారు గోదావరి ట్రిబ్యునల్ తీర్పునకు విరు ద్ధంగా శ్రీరాం సాగర్ ప్రాజెక్టు రెండో దశ, వరద కాల్వ, దేవా దుల, కాళేశ్వరం, సీతారామ, మంజీరా, ఎల్లం పల్లి, సింగూరుల నుంచి 163 టీఎంసీల గోదా వరి జలాలను కృష్ణా పరీవా హక ప్రాంతానికి మళ్లిస్తోందని పేర్కొన్నట్లు తెలిసింది. మళ్లింపు జలాలతో ఎగువ రాష్ట్రాలకు దక్కే నీటి వాటాలను తేల్చే అధికారం గోదావరి బోర్డుకు, బ్రిజేశ్ ట్రిబ్యునల్‌కుగానీ లేదని, ఆ అధికారం గోదా వరి ట్రిబ్యునల్‌కే ఉందని ఏపీ పేర్కొన్నట్లు సమాచారం. దీనిపై తెలంగాణ అధికారులు అభ్యంతరాలు తెలపగా.. లిఖితపూర్వ కంగా ఇవ్వాలని బోర్డు చైర్మన్ సాహూ సూచించారు.
డీపీఆర్‌లు ఇస్తామన్న ఏపీ..
గోదావరిపై కొత్త ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టడం లేదని, రాష్ట్ర విభజనకు ముందు నాటి ప్రాజెక్టులనే రీ ఇంజనీరింగ్ చేస్తున్నం దున కొత్త డీపీఆర్‌లు ఇవ్వాల్సిన అవసరం లేదని తెలంగాణ లిఖిత పూర్వకంగా తెలిపిం ది. ఏపీ పరిధిలో చేపట్టిన పురుషోత్తమ పట్నం, పట్టిసీమ, చింతపూడి ప్రాజెక్టుల డీపీ ఆర్‌లను 15 రోజుల్లో ఇస్తామని పేర్కొంది.
వర్కింగ్ మాన్యువల్‌కు ఓకే!
సమావేశంలో గోదావరి బోర్డు వర్కింగ్ మాన్యువల్‌కు ఆమోదం తెలిపారు. ఇక పలు ప్రాంతాల్లో టెలిమెట్రీ పరికరాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించగా.. ఎక్కడెక్కడ ఏర్పాటు చేయాలన్న దానిపై కమిటీ ఏర్పాటు చేయాలని తీర్మానిం చారు. ఇక ఒడిశా నిర్మిస్తున్న కోలాబ్ ప్రాజెక్టుపై ఏపీ, తెలంగాణ అభ్యంతరా లను 15 రోజుల్లోగా అందజేయాలని బోర్డు ఇరు రాష్ట్రాలకు సూచించింది.
Comments
Please login to add a commentAdd a comment