పక్కపక్కనే ఉన్న పట్టిసీమ, పోలవరం ప్రాజెక్టుల పరిహారం విషయంలో వేర్వేరు ప్రమాణాలు ఎందుకు పాటిస్తున్నారని ఏపీ సీఎం చంద్రబాబును వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిలదీశారు. పశ్చిమగోదావరి జిల్లా కుకునూరులో పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు అండగా నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు.