
రికార్డు సృష్టించాం: చంద్రబాబు
కేంద్ర ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) సహకరించకపోయినా రైతులకు రుణమాఫీ చేశామని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు తెలిపారు.
అనంతపురం: కేంద్ర ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) సహకరించకపోయినా రైతులకు రుణమాఫీ చేశామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. 5 నెలల 20 రోజుల్లో పట్టిసీమ ప్రాజెక్టును పూర్తి చేసి రికార్డు సృష్టించామని చెప్పారు. పట్టి సీమ నుంచి 100 టీఎంసీలు హంద్రీనీవా, గాలేరు-నగరి, పోతిరెడ్డిపాడులకు తరలిస్తామన్నారు.
రైతులు ధైర్యంగా ఉండాలి, ఆత్మహత్యలు చేసుకోవద్దని సూచించారు. రాజధానిపూజకు అక్టోబర్22న ప్రధాని నరేంద్రమోదీ హాజరవుతారన్నారు. అనంతపురంలో రూ. 500 కోట్లతో బీఈఎల్ పరిశ్రమ ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు.