'నాగావళి, వంశధారనూ అనుసంధానం చేస్తాం' | linking of nagavali and vamsadhara rivers in future | Sakshi
Sakshi News home page

'నాగావళి, వంశధారనూ అనుసంధానం చేస్తాం'

Published Wed, Jul 6 2016 1:47 PM | Last Updated on Mon, Aug 20 2018 6:35 PM

linking of nagavali and vamsadhara rivers in future

ఏలూరు : కృష్ణా, పెన్నానదులు అనుసంధానానికి ఆలోచన చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు తెలిపారు. పోలవరం ఎడమకాల్వను ఏడాదిలోకాగా పూర్తి చేసి... సోమశిలకు నీటిని తరలిస్తామన్నారు. బుధవారం పశ్చిమగోదావరి జిల్లాలో పట్టిసీమ ఎత్తిపోతల నుంచి చంద్రబాబు నీటిని విడుదల చేశారు.

అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ... 24 పంపులు, 12 పైప్లైన్ల ద్వారా పట్టిసీమ నుంచి నీరు విడుదల చేసినట్లు ఆయన వెల్లడించారు. మరో ఐదారు రోజుల్లో గోదావరి నీళ్లు కృష్ణా నదిలో కలుస్తాయని తెలిపారు. నాగావళి, వంశధార నదులనూ కూడా అనుసంధానం చేస్తామని చంద్రబాబు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement