- రూ.370 కోట్ల దుర్వినియోగంపై వైఎస్సార్ సీపీ నేతల మండిపాటు
- కాగ్ నివేదికపై ప్రజలకు వివరణ ఇవ్వాలని డిమాండ్
‘పట్టిసీమ’లో అవినీతి బట్టబయలు
Published Fri, Mar 31 2017 11:59 PM | Last Updated on Sat, Sep 22 2018 8:25 PM
మండపేట :
సాగునీటి ప్రాజెక్టుల పేరిట చంద్రబాబు సర్కారు సాగిస్తున్న అవినీతి భాగోతాన్ని కాగ్ బట్టబయలు చేసిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు విమర్శించారు. పట్టిసీమ ప్రాజెక్టులో రూ.370 కోట్లు అవినీతి జరిగినట్టు కాగ్ వెల్లడించడంపై రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వం వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రయోజనం లేని పట్టిసీమ పేరుతో ప్రజాధనాన్ని సీఎం చంద్రబాబు, ఆయన అనుచరగణం దిగమింగారని ధ్వజమెత్తారు. స్థానిక పార్టీ కార్యాలయంలో శుక్రవారం పార్టీ రైతు విభాగం రాష్ట్ర కార్యనిర్వాహక ప్రధాన కార్యదర్శి కొవ్వూరి త్రినాథరెడ్డి, మండపేట నియోజకవర్గ కోఆరి్డనేటర్ వేగుళ్ల పట్టాభిరామయ్యచౌదరి, రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి రెడ్డి రాధాకృష్ణ (రాజుబాబు) విలేకరులతో మాట్లాడారు. పట్టిసీమ ప్రాజెక్టు వలన ప్రయోజనం లేదని వైఎస్సార్ సీపీ, రైతు సంఘాలు ఎంత మొర పెట్టుకున్నా వినకుండా ప్రజాధనాన్ని దోచుకునేందుకు ఎత్తిపోతల పథకాన్ని నిర్మించారని త్రినాథరెడ్డి విమర్శించారు. మొదట రెండు టీఎంసీలు, తర్వాత 48 టీఎంసీల నీరు కృష్ణా బ్యారేజీ ద్వారా సముద్ర జలాల్లో కలిసిపోయాయన్నారు. పుష్కర, పురుషోత్తపట్నం టెండర్లలోను అక్రమాలు జరిగినట్టు కాగ్ బహిర్గతం చేసిందన్నారు. 2019 నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తిచేస్తామని చంద్రబాబు చెబుతున్న మాటలన్నీ బూటకమని విమర్శించారు. రూ.42 వేల కోట్లు ప్రస్తుత అంచనా వ్యయంగా చంద్రబాబు చెబుతుండగా 2013 అంచనాల ప్రకారం మాత్రమే ఇస్తామని కేంద్రం చెబుతోందన్నారు. ఈ మేరకు ఇప్పటి వరకు చేసిన చెల్లింపులు పోగా పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం ఇచ్చేది రూ.ఐదు వేల కోట్ల లోపే ఉంటుందన్నారు. పట్టిసీమ అవినీతిపై చంద్రబాబు, ఇరిగేష¯ŒSశాఖ మంత్రి సమాధానం చెప్పాలని, లేకుంటే పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాజుబాబు మాట్లాడుతూ రుణమాఫీకి దాదాపు రూ.80 వేల కోట్లు అవసరం కాగా మూడు విడతల్లోను ఇచ్చింది కేవలం రూ.11 వేల కోట్లు మాత్రమేనన్నారు. పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పెంకే వెంకట్రావు, ప్రచార విభాగం జిల్లా కన్వీనర్ సిరిపురపు శ్రీనివాసరావు పాల్గొన్నారు.
Advertisement