అవినీతి కోసమే పట్టిసీమ
Published Mon, Jan 9 2017 12:50 AM | Last Updated on Mon, Aug 20 2018 6:35 PM
- ఎర్రకోట చెన్నకేశవరెడ్డి
- వైఎస్సార్‌సీపీలోకి 30 మంది చేరిక
ధర్మాపురం(నందవరం) : అవినీతి అక్రమార్జన కోసమే పట్టిసీమ ప్రాజెక్టు నిర్మాణానికి ప్రభుత్వం నిధులు పెంచిందని మాజీ ఎమ్మెల్యే, వైఎస్‌ఆర్‌సీపీ సీనియర్ నాయకులు ఎర్రకోట చెన్నకేశవరెడ్డి అన్నారు. ధర్మాపురంలో ఆదివారం ఆ పార్టీ జెండాను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టిసీమకు మొదట్లో రూ. వెయ్యి కోట్లు అవసరమని చెప్పి ఆ తర్వాత అమాంతంగా రూ. 3 వేల కోట్లకు పెంచి సీఎం అవినీతికి తెరతీశారని మండిపడ్డారు. రాబోయే రోజుల్లో వైఎస్‌ఆర్‌సీపీ గెలుపు తథ్యమని, వైఎస్ జగన్ సీఎం కావడం ఖాయమని స్పష్టం చేశారు.
వైఎస్సార్సీపీలోకి 30 మంది చేరిక
ధర్మాపురం గ్రామానికి చెందిన టీడీపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన 30 మంది కార్యకర్తలు వైఎస్‌ఆర్‌సీపీలో చేరారు. టీడీపీకు చెందిన విద్యాకమిటీ చైర్మన్ చిన్నమద్దిలేటి, వార్డు మెంబర్ రంగస్వామి, చిన్ననాగన్న, గోవిందు, వెంకటేష్, కాంగ్రెస్ పార్టీకు చెందిన నరసింహులు, కాశిం, వడ్డేనరసన్నలతో పాటు ఆయా పార్టీలకు చెందిన మరో 23 మంది కార్యకర్తలు వైఎస్‌ఆర్‌సీపీలో చేరారు. ఎర్రకోట చెన్నకేశవరెడ్డి సమక్షంలో వీరంతా పార్టీలో చేరారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పీఏ ధర్మకారి నాగేశ్వరరావు, ఆ పార్టీ నాయకులు కేఆర్ రాఘవరెడ్డి, ధర్మాపురం రాఘవరెడ్డి, సుధాకర్, బందేనవాజ్, కడిమెట్లతిమ్మప్పాచారి, సయ్యద్‌చాంద్, జగ్గాపురం నరసరాజు, జయన్న, శ్రీనివాసులు, రాఘవేంద్ర, ఆదోని భీమన్న తదితరులు పాల్గొన్నారు.
Advertisement