
పట్టిసీమ పేరుతో మోసం
పట్టిసీమ ప్రాజెక్టు పేరుతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాయలసీమ ప్రజలను మోసం చేస్తున్నారని.....
పుంగనూరు: పట్టిసీమ ప్రాజెక్టు పేరుతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాయలసీమ ప్రజలను మోసం చేస్తున్నారని, రాయలసీమకు పట్టిసీమ నీరు వచ్చే అవకాశాలు లేవని వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పుంగనూరు ఎమ్మె ల్యే డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన సోమల మండలం నంజంపేటలో పల్లెబాట కార్యక్రమంలో మాట్లాడుతూ పట్టిసీమ పేరుతో రూ.1,300 కోట్లు ఖర్చు చూపి అందులో రూ.500 కోట్లు స్వాహా చేశారని ఆరోపించారు. హంద్రీనీవా, గాలేరు ప్రాజెక్టులలో రూ.6 వేల కోట్లు అవినీతి జరిగిందని ఆరోపించా రు. ఎన్నికల సమయంలో చం ద్రబాబు ప్రజలను ఆకట్టుకునేందుకు అమలు సాధ్యంకాని హామీలు ఇచ్చారని, అధికారంలోకి వచ్చాక వాగ్దానాలను మరచిపోయారని మండిపడ్డారు.
రాజధాని పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని తెలిపారు. రైతుల నుంచి 30 వేల ఎకరాలు లాక్కుని టీడీపీ నేతలు పంచుకున్నారని ఆరోపించారు. చంద్రబాబుకు అమరావతి మినహా మరేమీ కనిపిం చడం లేదని, రాష్ట్రంలో అవినీతి విలయతాండవం చేస్తోందని అన్నారు. వచ్చే ఎన్నికల్లో గుణపాఠం నేర్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నా రు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి రెడ్డెప్ప, నియోజకవర్గ కన్వీనర్ పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి, జెడ్పీ మాజీ ఉపాధ్యక్షుడు పెద్దిరెడ్డి, జెడ్పీ ఫ్లోర్‌లీడర్ వెంకటరెడ్డి యాదవ్, మున్సిపల్ వైస్ చైర్మన్ ఆవుల అమరేంద్ర పాల్గొన్నారు.