ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆయన శుక్రవారమిక్కడ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ...'చంద్రబాబు సర్కార్ ప్రచార ఆర్భాటాలకు ఇస్తున్న ప్రాధాన్యత ప్రజా ప్రయోజనాలకు ఇవ్వడం లేదు. అందుకు పట్టిసీమే ఉదాహరణ.