ప్రజలను మోసం చేసిన చంద్రబాబునాయుడు, దేవినేని ఉమ రాజీనామా చేయాలని ఎమ్మెల్సీ మేకా శేషు బాబు డిమాండ్ చేశారు.
పశ్చిమగోదావరి: జామం పేట వద్ద పట్టిసీమ కుడికాలువ గండిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, మాజీ ఎమ్మెల్యే గంటా మురళి, పలువురు నేతలు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాణ్యతాలోపం వల్లే ఈ ఘటన చోటుచేసుకుందని ఆరోపించారు.
పట్టిసీమ ప్రాజెక్టు పేరుతో ప్రజలను మోసం చేసిన చంద్రబాబునాయుడు, దేవినేని ఉమ రాజీనామా చేయాలని ఎమ్మెల్సీ మేకా శేషు బాబు డిమాండ్ చేశారు. పట్టి సీమ పేరుతో ఇసుక, మట్టిని దోచుకుని వేలాది కోట్లు సంపాధించారని గంటా మురళి ఆరోపించారు. గండి ఘటనకు చంద్రబాబు బాధ్యత వహించాలని, నిర్లక్ష్యం వహించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.