meka sheshubabu
-
'జాతీయ ఎస్సీ,ఎస్టీ కమిషన్ కు ఫిర్యాదు చేస్తాం'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ లో ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు పక్కదారి పడుతున్నాయని వైఆర్సీపీ ఎమ్మెల్సీలు మేకా శేషుబాబు, సుభాష్ చంద్రబోస్ ఆరోపించారు. బుధవారం ఏపీ శాసనమండలి లో వారు మాట్లాడుతూ దళిత, గిరిజనులకు అన్యాయం జరుగుతోందన్నారు. సబ్ ప్లాన్ చట్టం వేసినా కూడా దళితులకు అన్యాయం జరుగుతుందని, దీనిపై జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ కు ఫిర్యాదు చేస్తామన్నారు. ఈ విషయంపై మంత్రి రావెల కిశోర్ బాబు సమాధానం దాట వేశరన్నారు. -
'మోసం చేసిన బాబు రాజీనామా చేయాలి'
పశ్చిమగోదావరి: జామం పేట వద్ద పట్టిసీమ కుడికాలువ గండిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, మాజీ ఎమ్మెల్యే గంటా మురళి, పలువురు నేతలు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాణ్యతాలోపం వల్లే ఈ ఘటన చోటుచేసుకుందని ఆరోపించారు. పట్టిసీమ ప్రాజెక్టు పేరుతో ప్రజలను మోసం చేసిన చంద్రబాబునాయుడు, దేవినేని ఉమ రాజీనామా చేయాలని ఎమ్మెల్సీ మేకా శేషు బాబు డిమాండ్ చేశారు. పట్టి సీమ పేరుతో ఇసుక, మట్టిని దోచుకుని వేలాది కోట్లు సంపాధించారని గంటా మురళి ఆరోపించారు. గండి ఘటనకు చంద్రబాబు బాధ్యత వహించాలని, నిర్లక్ష్యం వహించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.