right canal
-
సాగర్ కుడికాలువకు 4 టీఎంసీలు
సాక్షి, అమరావతి: గుంటూరు, పల్నాడు, ప్రకాశం, బాపట్ల జిల్లాల్లో తాగునీటి అవసరాల కోసం నాగార్జునసాగర్ కుడికాలువ ద్వారా నాలుగు టీఎంసీల విడుదలకు కృష్ణాబోర్డు త్రిసభ్య కమిటీ అంగీకరించింది. ఈ నెల 17వ తేదీ నుంచి రోజుకు 5,500 క్యూసెక్కుల చొప్పున విడుదల చేయాలని బోర్డుకు సిఫార్సు చేసింది. హైదరాబాద్‌లోని కృష్ణా బోర్డు కార్యాలయంలో సోమవారం బోర్డు సభ్య కార్యదర్శి డి.ఎం.రాయ్‌పురే అధ్యక్షతన ఏపీ, తెలంగాణ ఈఎన్సీలు సి.నారాయణరెడ్డి, అనిల్‌కుమార్ సభ్యులుగా ఉన్న త్రిసభ కమిటీ సమావేశమైంది.గుంటూరు, పల్నాడు, ప్రకాశం, బాపట్ల జిల్లాల్లో తాగునీటి అవసరాల కోసం సాగర్ కుడికాలువకు నాలుగు టీఎంసీలు విడుదల చేయాలని ఏపీ ఈఎన్సీ నారాయణరెడ్డి చేసిన విజŠక్షప్తికి బోర్డు సభ్య కార్యదర్శి డి.ఎం.రాయ్‌పురే సానుకూలంగా స్పందించారు. సాగర్‌లో నీటిమట్టం తగ్గిన నేపథ్యంలో శ్రీశైలం నుంచి విద్యుదుత్పత్తి చేస్తూ 5.7 టీఎంసీలను సాగర్‌కు తరలించి, అందులో నాలుగు టీఎంసీలను కుడికాలువకు కేటాయిస్తామని చెప్పారు. ఇందుకు ఏపీ ఈఎన్సీ అంగీకరించారు. శ్రీశైలం నుంచి మూడు టీఎంసీలు ఏపీ, 2.7 టీఎంసీలను తెలంగాణ విద్యుదుత్పత్తి చేస్తూ దిగువకు విడుదల చేయాలన్న రాయ్‌పురే సూచనకు రెండు రాష్ట్రాల ఈఎన్సీలు అంగీకరించారు. శ్రీశైలం, సాగర్‌లలో లభ్యతగా ఉన్న నీటిని తాగునీటి అవసరాల కోసం వాడుకోవడానికి రాయ్‌పురే అంగీకరించారు. -
సాగర్ కుడి కాలువకు మరో 3 టీఎంసీలు
సాక్షి, అమరావతి: ప్రకాశం, పల్నాడు, బాపట్ల, గుంటూరు జిల్లాల తాగునీటి అవసరాల కోసం నాగార్జునసాగర్ కుడి కాలువకు మరో 3 టీఎంసీలు కేటాయించాలని కృష్ణా బోర్డుకు త్రిసభ్య కమిటీ సిఫార్సు చేసింది. కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శి డీఎం రాయ్‌పురే కన్వీనర్‌గా వ్యవహరిస్తున్న త్రిసభ్య కమిటీ శుక్రవారం హైదరాబాద్‌లో సమావేశమైంది. ఏపీ ఈఎన్సీ సి.నారాయణరెడ్డి, తెలంగాణ ఈఎన్సీ అనిల్‌కుమార్ ఈ సమావేశానికి హాజరయ్యారు. కేటాయించిన నీటి కంటే 8.66 టీఎంసీలు అధికంగా వాడుకుంటూ తెలంగాణ ప్రభుత్వం ఏపీ హక్కులను కాలరాస్తోందని ఏపీ ఈఎన్సీ నారాయణరెడ్డి కమిటీ దృష్టికి తీసుకొచ్చారు. ఈ వ్యవహారంపై బోర్డుకు ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాగునీటి అవసరాల కోసం సాగర్ కుడి కాలువకు ప్రస్తుతం విడుదల చేస్తున్న 5 టీఎంసీలకు అదనంగా మరో 3 టీఎంసీలు విడుదల చేయాలని ఈఎన్సీ నారాయణరెడ్డి చేసిన ప్రతిపాదనకు త్రిసభ్య కమిటీ కన్వీనర్ డీఎం రాయ్‌పురే అంగీకరించారు. హైదరాబాద్ తాగునీటి అవసరాల కోసం 8.5 టీఎంసీలు కేటాయించాలని తెలంగాణ ఈఎన్సీ చేసిన విజ్ఞప్తికి కూడా కమిటీ సానుకూలంగా స్పందించింది. త్రిసభ్య కమిటీ చేసిన సిఫార్సుల ఆధారంగా రెండు రాష్ట్రాలకు నీటిని విడుదల చేస్తూ బోర్డు ఉత్తర్వులు జారీ చేయనుంది. -
డెడ్ స్టోరేజీకి ‘నాగార్జున సాగర్’!.. ఆందోళనలో ఆయకట్టు రైతులు
సాక్షిప్రతినిధి, నల్లగొండ: నాగార్జునసాగర్ ఆయకట్టు రైతుల్లో ఆందోళన నెలకొంది. బోరుబావుల వసతి ఉన్నవారు నార్లు పోసి నీటివిడుదల కోసం ఎదురుచూస్తుండగా, మిగతావారు ఎగువ కృష్ణానది నుంచి వరద వస్తుందా? లేదా? అన్న ఆందోళనలో ఉన్నారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టు పరిధిలోని ఎడమకాల్వ ద్వారా ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం జిల్లాల పరిధిలో స్థిరీకరించిన ఆయకట్టు 6.57 లక్షల ఎకరాలు. గతేడాది జూలై 28వ తేదీన ఎడమ కాల్వ ద్వారా వ్యవసాయ అవసరాలకు సాగునీటిని విడుదల చేశారు. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. శ్రీశైలం ప్రాజెక్టు వరకే... గత నెల చివరలో కురిసిన వర్షాలతో కృష్ణానదికి ఎగువ నుంచి వరద రాక మొదలైంది. అది కూడా శ్రీశైలం ప్రాజెక్టు వరకే వస్తోంది. దిగువకు అంటే నాగార్జునసాగర్ ప్రాజెక్టులోకి నీరు రాలేదు. ఈ ఆగస్టులోనూ ఇంతవరకు వర్షాలు పడలేదు. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు (215.81 టీఎంసీలు) కాగా, ప్రస్తుతం 864.57 అడుగుల (120.92 టీఎంసీలు) మేర మాత్రమే నీటినిల్వ ఉంది. ప్రస్తుతం ఎగువ నుంచి 65 వేల క్యూసెక్కుల నీరు ఇన్‌ఫ్లోగా వస్తోంది. కృష్ణానదికి ఎగువ నుంచి పెద్ద ఎత్తున వరద వస్తే మరో వారంలో ఈ ప్రాజెక్టు నుంచి నీటి విడుదలకు అవకాశం ఉంటుంది. లేదంటే 15 రోజులకుపైగా సమయం పట్టవచ్చని, ఆ ప్రభావం నాగార్జునసాగర్ ఆయకట్టుపైనా తీవ్రంగా ఉంటుందని చెబుతున్నారు. వ్యవసాయశాఖ కూడా అప్పుడే ముమ్మరంగా వరినాట్లు వద్దని, పంటలు ఎండిపోయే పరిస్థితి రావొచ్చని పేర్కొంటోంది. చదవండి: అంకాపూర్ @మక్కవడలు.. చికెన్‌తో నంజుకుని తింటే.. ఆ టేస్టే వేరు! సాగర్ 570 అడుగులకు చేరితేనే.... నాగార్జునసాగర్ ప్రాజెక్టు గరిష్ట నీటిమట్టం 590 అడుగులు. కుడి, ఎడమ కాల్వలకు నీరు విడుదల చేయాలంటే సాగర్ జలాశయంలో కనీసం 570 అడుగుల మేర నీటినిల్వ ఉండాలి. అయితే ప్రస్తుతం నాగార్జునసాగర్ ప్రాజెక్టు డెడ్ స్టోరేజీకి దగ్గరలో ఉంది. డెడ్ స్టోరేజీ 510 అడుగులు కాగా, ప్రస్తుతం 515.4 అడుగుల మేర నీరు నిల్వ ఉంది. నల్లగొండ, హైదరాబాద్ తాగునీటి అవసరాలకు మాత్రమే ఈ నీటిని వినియోగించుకునే పరిస్థితి నెలకొంది. వ్యవసాయానికి ఇచ్చే పరిస్థితి లేదు. సాగర్ రిజర్వాయర్‌లోని బ్యాక్‌వాటర్ నుంచే నల్లగొండ జిల్లాలో మిషన్ భగీరథ కింద 597 గ్రామాలకు రోజుకు 25 క్యూసెక్కుల తాగునీటిని సరఫరా చేయాల్సి వస్తోంది. హైదరాబాద్ జంట నగరాలకు తాగునీటి అవసరాల కోసం రోజుకు 595 క్యూసెక్కుల నీటిని సరఫరా చేస్తున్నారు. నారు ఎండిపోతోంది పదిహేను రోజుల క్రితం వరినారు పోశాను. ఎడమకాల్వ నీటికోసం ఎదురుచూస్తున్నా. బోరుబావుల కింద ఐదు ఎకరాలు నాట్లు వేశా. ఎడమకాల్వ నుంచి నీరు విడుదల కాకపోవడంతో బోర్లలో కూడా నీరు తగ్గిపోయింది. నారుమడి, నాట్లు ఎండిపోయే దశకు చేరుకున్నాయి. సకాలంలో సాగునీరు అందించకుంటే నష్టపోయే ప్రమాదం ఉంది. – పసునూరి హనుమంతరెడ్డి, రైతు,యాద్గార్పల్లి, మిర్యాలగూడ సాగర్ ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వలకు నీటి విడుదల ఇలా... ►2019- ఆగస్టు 12 ►2020- ఆగస్టు 8 ►2021- ఆగస్టు 2 ►2022 - జూలై 28 ప్రాజెక్టుల నీటిమట్టం ఇలా... (అడుగుల్లో) గరిష్టం ప్రస్తుతం శ్రీశైలం 885 864.57 నాగార్జున సాగర్ 590 515.4 -
పీఏబీఆర్ కుడి కాలువకు నీరు విడుదల
కూడేరు : కూడేరు మండల పరిధిలోని పెన్నహోబిâýæం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ (పీఏబీఆర్ డ్యాం) నుంచి ధర్మవరం కుడికాలువకు మంగâýæవారం నీటిని విడుదల చేశారు. మంత్రి పరిటాల సునీత, ఎమ్మెల్సీ కేశవ్‌లు ముఖ్య అతిథులుగా హాజరై స్విచ్ ఆ¯ŒS చేసి నీటిని విడుదల చేశారు. అనంతరం వారు డ్యాంలో ప్రస్తుతం నీటి మట్టం ఎంత ఉంది ? ఇ¯ŒSప్లో, ఔట్ ప్లో, కుడికాలువకు ఎన్ని క్యూసెక్కులు నీటిని సరఫరా చేస్తారు తదితర అంశాలపై ఎస్ఈ శేషగిరిరావును అడిగి తెలుసుకున్నారు. డ్యాంలో 3.5 టీఎంసీల నీరు నిలువ ఉందని, జీడిపల్లి జలాశయం నుంచి 800 క్యూసెక్కుల నీరు డ్యాంలోకి వస్తోందని ఎస్ఈ వివరించారు. జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ తయారీకి, 3 తాగునీటి ప్రాజుక్టులకు సుమారు 800 క్యూసెక్కుల నీటిని సరఫరా చేయడం జరుగుతోందన్నారు. కుడికాలువకు 2.5 టీఎంసీల నీటిని కేటాయించడం జరిగిందని చెప్పారు. కుడి కాలువ ద్వారా నీటి విడుదల సందర్భంగా కాలువకు 200 క్యూసెక్కుల నీటిని వదిలి, బుధవారం ఉదయం నుంచి 500 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తామని ఆయన తెలిపారు. మొదటి విడతలో కుడికాలువకు ఇరువైపులా పక్కనే ఉన్న చెరువులకు నీటిని నింపేందుకు చర్యలు చేపట్టామన్నారు. ఈ లెక్కన 39 చెరువులకు నీటిని నింపుతామన్నారు. అనంతరం మంత్రి, ఎమ్మెల్సీ మాట్లాడుతు కాలువకు నీటిని విడుదల చేసి చెరువులకు నీరందించడం ద్వారా భూగర్భ జలాలు పెరుగుతాయన్నారు. -
కోయిల్‌సాగర్ కుడి కాల్వకు గండి
ధన్వాడ : కోయిల్‌సాగర్ ప్రధాన కుడి కాల్వకు శనివారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు గండి కొట్టారు. దీంతో ఆయకట్టు కింద వరి సాగు చేసిన రైతులు ఆందోళన చెందుతున్నారు. కేఎస్పీ ప్రధాన కుడి కాల్వకు గండి కొట్టడంతో నీరంతా ఊకచెట్టు వాగులో ప్రవహించింది. ఈ విషయమై వెంటనే రైతులు అధికారులకు సమాచారం ఇచ్చారు. తేరుకున్న ప్రాజెక్టు అధికారులు కుడి కాల్వ ద్వారా విడుదల అవుతున్న నీటిని ఆదివారం ఉదయం నిలిపివేశారు. ముమ్మరంగా వరినాట్లు వేసుకునే సమయంలో ఇలా జరగడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కాల్వలో పెరిగిన ముళ్లచెట్లు, అధ్వానంగా మారిన తూముల వల్ల చివరి ఆయకట్టుకు చుక్కనీరు చేరకపోవడంతొ చివరి ఆయకట్టు రైతులు కాల్వకు గండి కొట్టినట్లు పై ఆయకట్టు రైతులు ఆరోపిస్తున్నారు. కుడి కాల్వకు నీటి ఉధృతి ఎక్కువ కావడంతో కాల్వకు గండి పడిందని అధికారులు చెబుతున్నారు. వెంటనే చర్యలు తీసుకోవాలని గోటూర్, పూసల్‌పహాడ్, తీలేర్ రైతులు కోరుతున్నారు. -
సాగర్ కుడికాలువకు జలకళ
మాచర్ల : సాగర్ జలాశయం నుంచి ప్రకాశం జిల్లా తాగునీటి అవసరాల నిమిత్తం కుడికాలువకు బుధవారం నీటిని విడుదల చేశారు. దీంతో ఉదయం నుంచి కుడికాలువలో సాగర్ నుంచి బుగ్గవాగు రిజర్వాయర్ వరకు జలకళ సంతరించుకుంది. ప్రకాశం జిల్లా తాగునీటి అవసరాల నిమిత్తం 3 టీఎంసీల నీటిని విడుదల చేయాలని ఏపీ ప్రభుత్వం కోరింది. దీనికి స్పందించిన బోర్డు 3 టీఎంసీల నీటిని విడుదల చేయాలని ఆదేశాలిచ్చింది. ఈ మేరకు సాగర్ కుడికాలువ గేట్లు ఎత్తి 5 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రతి రోజు ఐదువేల క్యూసెక్కుల చొప్పున మూడు టీఎంసీల నీటిని విడుదల చేయడం జరుగుతుందని సాగర్ కెనాల్స్ విభాగ ఈఈ జబ్బార్, డీఈ నిమ్మగడ్డ వెంకటేశ్వరరావు తెలిపారు. తాగునీటి అవసరాల నిమిత్తం కాలువకు విడుదల చేయడంతో మళ్లీ ఈ ప్రాంతం భూగర్భ జలాలు పెరుగుతాయని ప్రజలు ఆనందం వ్యక్తం చే స్తున్నారు. -
సాగర్ కుడి కాలువకు జలకళ
నీటిని విడుదల చేసిన అధికారులు 15 రోజుల్లో ఏడు టీఎంసీలు మూడు నెలల పాటు తీరనున్న నీటికొరత సీఈ వీర్రాజు వెల్లడి విజయపురిసౌత్ : గుంటూరు, ప్రకాశం జిల్లాల తాగునీటి అవసరాల కోసం నాగార్జునసాగర్ ప్రాజెక్టు కుడికాలువకు అధికారులు శుక్రవారం నీటిని విడుదల చేశారు. సీఈ వీర్రాజు సాయంత్రం 5.50 గంటలకు స్విచాన్ చేసి 500 క్యూసెక్కుల నీటిని వదిలారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ గంటకు 500 క్యూసెక్కుల చొప్పున పెంచుతూ అర్ధరాత్రికి నాలుగువేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయనున్నట్లు చెప్పారు. ఈ విధంగా ఏడు టీఎంసీల నీటిని 15 రోజులపాటు విడుదల చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఇప్పటికే నీటి విడుదల సమాచారం రెండు జిల్లాల కలెక్టర్లకు అందించినట్లు చెప్పారు. ఈ నీటితో రెండు జిల్లాల్లోని కుంటలు, చెరువులు, నీటి ట్యాంకులు నింపనున్నట్లు తెలిపారు. ఈ నీటి ద్వారా మూడు నెలల పాటు నీటి కొరత తీరనున్నట్లు వివరించారు. రెవెన్యూ, ఇరిగేషన్, పోలీస్ శాఖల అధికారుల సమన్వయంతో తాగునీటి కోసం కుడికాలువ చివరి వరకు చేరే విధంగా చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. ఇప్పటికే సాగర్ ప్రాజెక్టు ఎగువ ప్రాజెక్టులైన ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకున్నాయన్నారు. ఈ సీజన్లో శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టులలో నీటిని నిల్వ చేసి రెండు పంటలతో పాటు తాగునీటి అవసరాలను తీర్చే అవకాశాలు మెండుగా ఉన్నాయన్నారు. ప్రపంచ బ్యాంకు నిధులతో 2010 నుంచి చేపట్టిన కుడికాలువ ఆధునికీకరణ పనులలో భాగంగా ప్రధాన కాల్వల పనులు పూర్తయ్యాయని, బ్రాంచి కెనాల్స్ పనులు 90 శాతం పూర్తయ్యాయని చెప్పారు. 2017 మే కల్లా పనులు మొత్తం పూర్తవుతాయన్నారు. ఈ కార్యక్రమంలో కుడికాలువ ప్రాజెక్టు కమిటీ చైర్మన్ భుజంగరాయలు, సాగర్ డ్యామ్ ఎస్ఈ ప్రసాద్, ఈఈలు జబ్బార్, మొహినుద్దీన్, మాచర్ల– సత్తెనపల్లి డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్లు నర్సింహారావు, తుమ్మల ఏడుకొండలు, డీఈ నిమ్మగడ్డ వెంకటేశ్వరరావు, జేఈలు సత్యనారాయణ, కేశవరావు, లక్ష్మీనారాయణ, కృష్ణయ్య ఉన్నారు. -
'మోసం చేసిన బాబు రాజీనామా చేయాలి'
పశ్చిమగోదావరి: జామం పేట వద్ద పట్టిసీమ కుడికాలువ గండిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, మాజీ ఎమ్మెల్యే గంటా మురళి, పలువురు నేతలు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాణ్యతాలోపం వల్లే ఈ ఘటన చోటుచేసుకుందని ఆరోపించారు. పట్టిసీమ ప్రాజెక్టు పేరుతో ప్రజలను మోసం చేసిన చంద్రబాబునాయుడు, దేవినేని ఉమ రాజీనామా చేయాలని ఎమ్మెల్సీ మేకా శేషు బాబు డిమాండ్ చేశారు. పట్టి సీమ పేరుతో ఇసుక, మట్టిని దోచుకుని వేలాది కోట్లు సంపాధించారని గంటా మురళి ఆరోపించారు. గండి ఘటనకు చంద్రబాబు బాధ్యత వహించాలని, నిర్లక్ష్యం వహించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
పోలవరం కుడికాలువకు భారీ గండి
-
తోటపల్లి కుడికాల్వకు భారీ గండి
పార్వతీపురం(విజయనగరం): విజయనగరం జిల్లాలో తోటపల్లి ప్రాజెక్టు కుడికాల్వకు శనివారం మధ్యాహ్నం భారీ గండిపడింది. దీంతో రూ.3 కోట్లలో చేపట్టిన అక్విడెక్ట్ పనులు మట్టి పాలయ్యాయి. సీతానగరం మండలం లక్ష్మీపురం వద్ద సువర్ణముఖీ అక్విడెక్ట్ పనులు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. అయితే, త్వరలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన ఉండటంతో ఆయనతో ప్రారంభించాలనే తొందరలో ట్రయల్స్ చేపట్టారు. పనులు పూర్తి చేయకుండానే శనివారం మధ్యాహ్నం నీరు వదలటంతో 15వ కిలోమీటర్ వద్ద కుడికాల్వకు పెద్ద గండిపడింది. దీంతో రూ.3 కోట్లతో నిర్మిస్తున్న అక్విడెక్ట్ నామరూపాలు లేకుండా కొట్టుకుపోయింది. దిగువన పొలాల్లో మట్టి మేటవేసింది. నారు మళ్లు నీటి ముంపునకు గురయ్యాయి. ఇదంతా అధికారుల అత్యుత్సాహం వల్లే జరిగిందని రైతులు ఆరోపిస్తున్నారు.