సాగర్ కుడికాలువకు జలకళ
సాగర్ కుడికాలువకు జలకళ
Published Wed, Aug 17 2016 9:37 PM | Last Updated on Mon, Sep 4 2017 9:41 AM
మాచర్ల : సాగర్ జలాశయం నుంచి ప్రకాశం జిల్లా తాగునీటి అవసరాల నిమిత్తం కుడికాలువకు బుధవారం నీటిని విడుదల చేశారు. దీంతో ఉదయం నుంచి కుడికాలువలో సాగర్ నుంచి బుగ్గవాగు రిజర్వాయర్ వరకు జలకళ సంతరించుకుంది. ప్రకాశం జిల్లా తాగునీటి అవసరాల నిమిత్తం 3 టీఎంసీల నీటిని విడుదల చేయాలని ఏపీ ప్రభుత్వం కోరింది. దీనికి స్పందించిన బోర్డు 3 టీఎంసీల నీటిని విడుదల చేయాలని ఆదేశాలిచ్చింది. ఈ మేరకు సాగర్ కుడికాలువ గేట్లు ఎత్తి 5 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రతి రోజు ఐదువేల క్యూసెక్కుల చొప్పున మూడు టీఎంసీల నీటిని విడుదల చేయడం జరుగుతుందని సాగర్ కెనాల్స్ విభాగ ఈఈ జబ్బార్, డీఈ నిమ్మగడ్డ వెంకటేశ్వరరావు తెలిపారు. తాగునీటి అవసరాల నిమిత్తం కాలువకు విడుదల చేయడంతో మళ్లీ ఈ ప్రాంతం భూగర్భ జలాలు పెరుగుతాయని ప్రజలు ఆనందం వ్యక్తం చే స్తున్నారు.
Advertisement
Advertisement