driniking water
-
వెల్దుర్తి ప్రజల మంచినీటి సమస్యకు పరిష్కారం
-
అతి తక్కువ ఖర్చుతో మంచినీటిని అందిస్తున్నాం
-
నీళ్లు లేవు.. నీడా లేదు!
నల్లగొండ : వేసవిలో ఇతర పనులు దొరకని పరిస్థితి. అలాంటి వారు వలస వెళ్లకుండా, కుటుంబ పోషణలో ఇబ్బందులు పడకుండా ఉండేందుకు చేపట్టిన జాతీయ ఉపాధి హామీ పథకం పనుల వద్ద సౌకర్యాలు కరు వయ్యాయి. అసౌకర్యాల నడుమ కూలీలు పనులు చేస్తున్నారు. పనిచేసే చోట కూలీలకోసం టెంట్లు ఏర్పాటు చేయాలని నిబంధన ఉన్నా సిబ్బంది పట్టించుకోవడం లేదు. అధికారులు తాము అన్ని గ్రూప్‌లకు టెంట్లు ఇచ్చామని చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో కనిపించడం లేదు. జిల్లాలో మొత్తం 8,76,807 మంది ఉపాధి హామీ కూలీలు నమోదై ఉన్నారు. 3,69,000 జాబ్‌కార్డులు ఉన్నాయి. వేసవిలో ప్రత్యేక పనుల కోసం అధికారులు ఇటీవల ప్రతిపాదనలు రూపొందించి ప్రభుత్వ అనుమతి పొందారు. ఏప్రిల్ 2019 నుంచి మార్చి 2020 వరకు 77 లక్షల పనిదినాలు కల్పించాలని అధికారులు నిర్ణయించారు. ప్రతి కుటుంబానికి 100 రోజులు పని తప్పనిసరిగా కల్పించాల్సి ఉంది. ఇందుకు సుమారు 240 కోట్ల రూపాయలను ఖర్చు చేయాలని నిర్ణయించారు. ఈ నెల 1వ తేదీ నుంచి జిల్లాలో ఉపాధి హామీ పనులను అమలు చేస్తున్నారు. ఇప్పటి వరకు జిల్లాలో కూలీలకు 5 లక్షల పనిదినాలు కల్పించినట్లు అధికారులు చెబుతున్నారు. చేసిన పనులకుగాను 9 కోట్ల రూపాయలను కూలీల ఖాతాలో జమచేసినట్లు అధికారులు తెలుపుతున్నారు. భానుడి విశ్వరూపం.. ఎండాకాలంలో భానుడు తన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తున్నాడు. ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటుతున్నాయి. ప్రస్తుతం గ్రామాల్లో ఇంకుడుగుంతలు, కందకాలు, చెరువుల పూడిక, చెట్ల తొలగింపు, నర్సరీలు, కాల్వ పూడిక తదితర పనులు చేస్తున్నారు. ఉదయం 9 గంటలకే ఎండ సుర్రుమంటోంది. కూలీలు ఎండ తీవ్రతతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎండ తీవ్రంగా ఉండడంతో ఉదయం పూట వెళ్లి పనులు చేస్తున్నారు. ఉపాధి నిబంధనల ప్రకారం కూలీలకు పనిచేసే చోట టెంట్లు ఏర్పాటు చేయాలి. అధికారులు ఎప్పుడో గ్రామాల వారీగా అందించారు. ఎక్కడా అటువంటి ఏర్పాట్లు చేయడం లేదు. అసలు అవి ఉన్నాయా లేవా అన్నది తెలియని పరిస్థితి.. దీంతో కూలీలు చెట్లకింద సేదదీరుతున్నారు. కూలీలే తట్టలు, మంచి నీరు కూడా తెచ్చుకుంటున్నారు. అందుకు అధికారులు డబ్బులు చెల్లిస్తున్నామని చెబుతున్నారు. సౌకర్యాలు లేవు మేము పక్షం రోజులుగా కడపర్తి పెద్ద చెరువులో ఉపాధి హామీ పనులు చేస్తున్నాం. మంచీనటి సౌకర్యం కూడా లేదు. కనీసం టెంట్లు కూడా వేయలేదు. పనులు చేసేందుకు గడ్డపారలు కూడా ఇవ్వలేదు. ఎండకు ఎండుతూ ఉపాధి హామీ పనులు చేస్తున్నాం... – నూనె లింగయ్య, ఉపాధి కూలీ, కడపర్తి, నకిరేకల్ ఫస్ట్ ఎయిడ్ బాక్స్‌లు పెట్టాలి ఉపాధి హామీ పనులు జరుగుతున్న ప్రదేశాలలో ఫస్ట్ ఎయిడ్ బాక్స్‌లు కూడా ఇవ్వాలి. వడదెబ్బకు గురైనప్పుడు కూలీలకు ఇబ్బందులు ఎదురవుతాయి. పని చేస్తున్న ప్రదేశాలలో టెంట్లు కూడా వేయాలి. – జీడిపల్లి లక్ష్మమ్మ, ఉపాధి హామీ మేట్, కడపర్తి, నకిరేకల్ మండలం -
జలమే గరళమై..
ఆ ఊళ్లో ఓ చేదబావి లేదు.. ఓ చేతిపంపూ లేదు.. తాగుదామంటూ గుక్కెడు మంచినీళ్లు కరువు.. గ్రామస్తులకు వ్యవసాయ బావే దిక్కు.. అన్ని అవసరాలకు అవే నీళ్లు.. ఆ జలం కలుషితమై.. ఆపై గరళమై జనం ప్రాణాలను కాటేసింది. తాంసి మండలం అట్నంగూడలో కలుషిత నీటి కారణంగా అతిసారం ప్రబలింది. వాంతులు, విరేచనాలతో ఇద్దరు మృతి చెందారు. మరో 11 మంది తీవ్ర అస్వస్థతతో ఆదిలాబాద్ రిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. తాంసి(బోథ్): ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలం గిరిగాం గ్రామ పంచాయతీ పరిధి అట్నంగూడలో అతిసారం ప్రబలింది. కలుషిత నీరుతాగి వాంతులు, విరేచనాలతో తీవ్ర అస్వస్థతకు గుపై ఓ విద్యార్థిని, మరో వృద్ధురాలు మృతిచెందారు. 11 మంది అస్వస్థతకు గురై జిల్లా కేంద్రంలోని రి మ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గ్రా మంలో తాగునీటి బావి లేదు. దీంతో గ్రామ స మీపంలో ఉన్న వ్యవసాయ బావిలోని కలుషిత నీటిని తాగుతున్నారు. ఈ కారణంగానే అస్వస్థత కు గురైనట్లు గ్రామస్తులు పేర్కొంటున్నారు. మూ డు రోజుల క్రితం ఇదే గ్రామానికి చెందిన త లాండె బాపురావు(60) వాంతులు, విరేచనాలతో మృతి చెందాడు. అతడు అనారోగ్యంతో మృతి చెందినట్లు భావించారు. ఇదే క్రమంలో మంగళవారం గ్రామానికి చెందిన దుర్వ సుజాత(19), దుర్వ గంగుబాయి(60) వాంతులు, విరేచనాలతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారిని కుటుం బసభ్యులు రిమ్స్ ఆసుపత్రికి తరలిస్తుండగా, సు జాత మార్గంమధ్యలో చనిపోయింది. గంగుబాయి ఆసుపత్రి చికిత్స పొందూతు మృతిచెం దింది. సుజాత మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. గ్రామంలో వాంతులు, విరేచనాలతో బాధపడుతున్న తలండె జంగుబాయి(40), దుర్వ నిర్మలబాయి(45), పెందుర్ సీమ్(22), మడావి లక్ష్మి(26), అనక కౌసల్యబాయి(55)తో పాటు 11 మందిని ఆటోలు, 108ల ద్వా రా రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. జంగుబాయి పరిస్థితి కొంత విషమంగా ఉండడంతో అత్యవసర విభాగంలో చికిత్స అందిస్తున్నట్లు స్థానిక వై ద్య సిబ్బంది తెలిపారు. గ్రామంలో కనీసం బోరుబావి కూడా లేదని, దీంతో గ్రామ సమీపాన గల వ్యవసాయ బావి నీళ్లు తాగుతున్నామని గ్రామస్తులు తెలిపారు. వర్షాకాలంలో కలుషిత బావినీరు తాగడంతోనే అతిసారం ప్రబలిందని ఆవేదన వ్య క్తం చేస్తున్నారు. అతిసారంతో ఇద్దరు మృతి చెందిన వెంటనే తాంసి, భీంపూర్ పీహెచ్‌సీల వై ద్యులు, సిబ్బంది గ్రామంలో తిరుగుతూ అతి సారం లక్షణాలున్నవారికి చికిత్స అందిస్తున్నారు. -
ఆ గ్రామాల్లో తాగేనీరు విషంగా మారాయి
-
సాగర్ కుడికాలువకు జలకళ
మాచర్ల : సాగర్ జలాశయం నుంచి ప్రకాశం జిల్లా తాగునీటి అవసరాల నిమిత్తం కుడికాలువకు బుధవారం నీటిని విడుదల చేశారు. దీంతో ఉదయం నుంచి కుడికాలువలో సాగర్ నుంచి బుగ్గవాగు రిజర్వాయర్ వరకు జలకళ సంతరించుకుంది. ప్రకాశం జిల్లా తాగునీటి అవసరాల నిమిత్తం 3 టీఎంసీల నీటిని విడుదల చేయాలని ఏపీ ప్రభుత్వం కోరింది. దీనికి స్పందించిన బోర్డు 3 టీఎంసీల నీటిని విడుదల చేయాలని ఆదేశాలిచ్చింది. ఈ మేరకు సాగర్ కుడికాలువ గేట్లు ఎత్తి 5 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రతి రోజు ఐదువేల క్యూసెక్కుల చొప్పున మూడు టీఎంసీల నీటిని విడుదల చేయడం జరుగుతుందని సాగర్ కెనాల్స్ విభాగ ఈఈ జబ్బార్, డీఈ నిమ్మగడ్డ వెంకటేశ్వరరావు తెలిపారు. తాగునీటి అవసరాల నిమిత్తం కాలువకు విడుదల చేయడంతో మళ్లీ ఈ ప్రాంతం భూగర్భ జలాలు పెరుగుతాయని ప్రజలు ఆనందం వ్యక్తం చే స్తున్నారు. -
ఒక్క బోరే
బూర్జ, : మండలంలోని లచ్చయ్యపేట కాలనీ వాసులు తాగునీటికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కానీలో సుమారు 90 కుటుంబాలు నివాసం ఉండగా, వారి తాగునీటి అవసరాల కోసం అధికారులు ఒక్కబోరు ఏర్పాటు చేశారు. లచ్చయ్యపేట పాత ఊరు వాసులు సైతం ఈ బోరు నుండే నీరు తీసుకు వెళుతున్నారు. ఈ బోరుపై ఎక్కువ ఒత్తిడి పడడంతో ఎప్పుడు మూలకు చేరుతుందోనని కాలనీ వాసులు ఆందోళన చెందుతున్నారు. తెల్లవారుజాము నుంచే క్యూ కాలనీలో నివాసం ఉంటున్న వారంతా నిరుపేదలే కావడంతో ఉదయాన్నే కూలి పనులకు వెళ్లాలి. దీంతో అందరూ ఒకేసారి నీటి కోసం బోరు వద్ద గుముకూడుతున్నారు. తెల్లవారు జాము మూడు గంటల నుంచే బోరు వద్ద క్యూ కడుతున్నారు. మహిళలు బోరు వద్ద నిత్యం గొడవలు పడుతుంటారు. వేసవి వస్తే పరిస్థితి చెప్పనక్కర లేదు. బోరు నుంచి తక్కువ నీరు రావడంతో ఒక్కో ఇంటికి బిందెడు నీరు దొరకడం కూడా కష్టమే. సింగన్నపాలెం గ్రామంలో ఉన్న రక్షిత మంచినీటి పథకం ద్వారా ఈ గ్రామానికి పైపులైన్ వేసి తాగునీరు సరఫరా చేయాలనే ఉద్దేశంతో కుళాయిలు వేశారు. కుళాయి నీరు కూడా కాలనీకి రావడం లేదు. దీంతో కాలనీ వాసులు మంచినీటి కోసం పడుతున్న అవస్థలు వర్ణనీతీతం. మరోబోరు ఏర్పాటు చేయాలని కాలనీ వాసులు పలుమార్లు అధికారులకు విన్నవించినా.. పట్టించుకోలేదని విమర్శలు వినిపిస్తున్నాయి. -
కొంగు బిగించి...
లోవోల్టేజీ వారికి నీరు లేకుండా చేస్తోంది. దీనితో కంటి మీద కునుకు లేదు. ఇంట్లో నీరు లేదు. కొంగు బిగించారు. అంతా చలో మహబూబ్‌నగర్ అంటూ ‘విద్యుత్తు భవన్’కు వచ్చి చుట్టుముట్టారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు హఠం చేశారు. విద్యుత్తు డీఈ (టెక్నికల్) నీలాదేవి కాళ్లూ పట్టుకున్నారు. చివరికి ఎస్.ఇ. సదాశివరెడ్డి వచ్చే ట్రాన్స్ఫార్మర్ తీసుకెళ్లమని చెప్పడంతో పంతం వీడారు. ఇదీ జడ్చర్ల మండలం కుర్వపడ్డి పల్లె మహిళలు చూపిన తెగువ. పని సాధించుకున్న తీరు. -విద్యుత్ భవన్ ముట్టడి మహబూబ్‌నగర్ అర్బన్, న్యూస్‌లైన్: ఓ వర్‌లోడ్‌తో నాలుగు నెలలుగా బోరుమోటారు పనిచేయడం లేదని, తాగునీటి కో సం ఇబ్బందులు పడుతున్నా ఎవరూ ప ట్టించుకోవడం లేదని జడ్చర్ల మండలం కుర్వగడ్డపల్లికి చెందిన సుమారు వందమంది మహిళలు మంగళవారం స్థానిక విద్యుత్‌భవన్‌ను ముట్టడించారు. ఒకే ట్రాన్స్ఫార్మర్పై 24 వ్యవసాయ మోటా ర్లు, తాగనీటి పథకం కనెక్షన్లు ఉండటం తో లోఓల్టేజీ అధికమై తాగునీటి ఎద్దడి నెలకొందని, నీళ్లులేక రబీ పంటలు ఎం డుతున్నాయని వాపోయారు. ఈ విషయాన్ని స్థానిక అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. అలాగే బైరంపల్లి గ్రామ రైతులు రెండు ట్రాక్టర్లలో వచ్చి ఎస్ఈ కార్యాల యం ఎదుట బైఠాయించారు. విద్యుత్శా ఖ ఎస్ఈ సదాశివారెడ్డి వచ్చే వరకు ఇక్క డి నుంచి కదిలేదని భీష్మించుకూర్చున్నా రు. వారిని పట్టించుకోకుండా వెళ్తున్న టెక్నికల్ డీఈ నీలాదేవిని రైతులు అడ్డుకున్నారు. ఆ మహిళలు చాంబర్లోకి దూ సుకుపోయి తమ గోడును వెలిబుచ్చారు. ఈ విషయం తనకు సంబంధం లేదని, తన విధులకు అడ్డుతగిలితే చర్యలు తీసుకుంటానని బెదిరించినప్పటికీ వారు అ క్కడే బైఠాయించారు. ఎస్ఈ వచ్చేవరకు చాంబర్లోనే ఉంటామని, లేదా అదనపు ట్రాన్స్ఫార్మర్ను ఇచ్చేవరకు కదలబోమని బీష్మించుకూర్చున్నారు. ఇంత లోకొందరు మహిళలు కరెంట్ సమస్య ను పరిష్కరించమని కోరుతూ ్డ్డటెక్నికల్ డీఈ నీలాదేవి కాళ్లపైపడ్డారు. చివరికి విషయం తెలుసుకున్న ఎస్ఈ సదాశివారెడ్డి బుధవారం సంబంధిత ఏఈని తీసుకొచ్చి ట్రాన్స్ఫార్మర్ తీసుకెళ్లమని చెప్పడంతో వారు శాంతించారు. కార్యక్రమంలో బీజేపీ కిసాన్‌మోర్చా మండల అధ్యక్ష, కార్యదర్శులు శౌరి, శ్యాంసుందర్‌రెడ్డి, మహిళలు జంగమ్మ, పుష్పలత, లక్షి్ష్మదేవి, అలివేలు, జయమ్మ, మంత మ్మ, శ్యా మలమ్మతో పాటు మహిళలు, రైతులు పాల్గొన్నారు.