సాక్షి, అమరావతి: గుంటూరు, పల్నాడు, ప్రకాశం, బాపట్ల జిల్లాల్లో తాగునీటి అవసరాల కోసం నాగార్జునసాగర్ కుడికాలువ ద్వారా నాలుగు టీఎంసీల విడుదలకు కృష్ణాబోర్డు త్రిసభ్య కమిటీ అంగీకరించింది. ఈ నెల 17వ తేదీ నుంచి రోజుకు 5,500 క్యూసెక్కుల చొప్పున విడుదల చేయాలని బోర్డుకు సిఫార్సు చేసింది. హైదరాబాద్‌లోని కృష్ణా బోర్డు కార్యాలయంలో సోమవారం బోర్డు సభ్య కార్యదర్శి డి.ఎం.రాయ్‌పురే అధ్యక్షతన ఏపీ, తెలంగాణ ఈఎన్‌సీలు సి.నారాయణరెడ్డి, అనిల్‌కుమార్ సభ్యులుగా ఉన్న త్రిసభ కమిటీ సమావేశమైంది.
గుంటూరు, పల్నాడు, ప్రకాశం, బాపట్ల జిల్లాల్లో తాగునీటి అవసరాల కోసం సాగర్ కుడికాలువకు నాలుగు టీఎంసీలు విడుదల చేయాలని ఏపీ ఈఎన్‌సీ నారాయణరెడ్డి చేసిన విజŠక్షప్తికి బోర్డు సభ్య కార్యదర్శి డి.ఎం.రాయ్‌పురే సానుకూలంగా స్పందించారు. సాగర్‌లో నీటిమట్టం తగ్గిన నేపథ్యంలో శ్రీశైలం నుంచి విద్యుదుత్పత్తి చేస్తూ 5.7 టీఎంసీలను సాగర్‌కు తరలించి, అందులో నాలుగు టీఎంసీలను కుడికాలువకు కేటాయిస్తామని చెప్పారు. ఇందుకు ఏపీ ఈఎన్‌సీ అంగీకరించారు. శ్రీశైలం నుంచి మూడు టీఎంసీలు ఏపీ, 2.7 టీఎంసీలను తెలంగాణ విద్యుదుత్పత్తి చేస్తూ దిగువకు విడుదల చేయాలన్న రాయ్‌పురే సూచనకు రెండు రాష్ట్రాల ఈఎన్‌సీలు అంగీకరించారు. శ్రీశైలం, సాగర్‌లలో లభ్యతగా ఉన్న నీటిని తాగునీటి అవసరాల కోసం వాడుకోవడానికి రాయ్‌పురే అంగీకరించారు.
Comments
Please login to add a commentAdd a comment