సాక్షి, హైదరాబాద్: ‘ప్యాకేజీతో పోల్చితే ప్రత్యేక హోదా వల్ల ఎక్కువ ప్రయోజనాలుంటాయా?, పట్టిసీమ పథకం వల్ల ప్రయోజనాలేంటి?’ వంటి తాజా పరిణామాలను గ్రూప్-1 మెయిన్స్‌లో ప్రశ్నలుగా సంధించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఏపీపీఎస్సీ నిర్వహించిన 2011 గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభమయ్యాయి. తొలిరోజు బుధవారం జనరల్ ఎస్సేపై పరీక్ష జరిగింది.
పలు ప్రశ్నలను ఇటీవలి పరిణామాలపైనే ఇచ్చారు. ప్రత్యేక హోదాపై ఓ ప్రశ్న ఇచ్చారు. పట్టిసీమ పథకం ప్రయోజనాలు వివరించండి? అని మరో ప్రశ్న ఇచ్చారు. తొలిరోజు పరీక్షకు 3,128 మంది హాజరయ్యారు.
పట్టిసీమ, హోదాలపై ఏపీ గ్రూప్-1లో ప్రశ్నలు
Published Thu, Sep 15 2016 2:08 AM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM
Advertisement
Advertisement