తూర్పు’న మరో పట్టిసీమ ‘పథకం’!
Published Fri, Jul 15 2016 1:01 PM | Last Updated on Thu, Mar 21 2019 8:22 PM
విశాఖపట్నానికి నీరు తరలించేందుకే?
‘పుష్కర’ను పరిశీలించిన కలెక్టర్ అరుణ్‌కుమార్
పురుషోత్తపట్నం : మరో పట్టిసీమ ఎత్తిపోతల ‘పథకానికి’ రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోందా? తూర్పు గోదాకరి జిల్లా అధికారుల హడావిడి చూస్తే అవునన్నట్టుగానే ఉంది. పశ్చిమ గోదావరి జిల్లా పట్టిసీమలో ఏర్పాటు చేసిన పట్టిసీమ ఎత్తిపోతల పథకం లాగే, పురుషోత్తపట్నం –రామచంద్రపురం మధ్య ఈ ఎత్తిపోతల పథకాన్ని నిర్మించి, పోలవరం కాలువ ద్వారా విశాఖపట్నానికి నీరు తరలించే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో పురుషోత్తపట్నంలో ఉన్న తోట వెంకటాచలం పుష్కర ఎత్తిపోతల పథకాన్ని గురువారం కలెక్టర్ అరుణ్‌కుమార్ పరిశీలించడం ప్రాధాన్యం సంతరించుకుంది. పోలవరం ప్రాజెక్ట్ ఎడమ ప్రధాన కాలువను పరిశీలిందచేందుకు వచ్చిన ఆయన వెంట పుష్కర ఎల్‌ఎంసీ సర్కిల్ ఎస్‌ఈ సుగుణాకరరావు కూడా ఉన్నారు. పోలవరం ఎడమ కాలువ ఏడు ప్యాకేజీలుగా ఉండగా, ఇందులో ఐదు కలెక్టర్ ఆధీనంలో ఉన్నాయి. వీటిలో సోమా కంపెనీ నూరు శాతం పనులు చేయగా, మిగిలిన నాలుగు కంపెనీలు కేవలం 60 నుంచి 80 శాతం పనులు మాత్రమే చేసినట్టు సమాచారం. ఆయా పరిస్థితులపై కలెక్టర్ ఆరాతీసినట్టు తెలిసింది. కాగా వీటిని వచ్చే ఏడాది జూన్ నాటికి పూర్తి చేయగలరా లేక కొత్త కంపెనీలకు ఇవ్వాలనే అంశం కూడా ప్రభుత్వ పరిశీలనలో ఉంది. అందుకే వీటిని పరిశీలిస్తున్నట్టు అధికారులు పేర్కొన్నారు.
Advertisement
Advertisement