పోలవరం కాంట్రాక్టర్లకు కలెక్టర్‌ హెచ్చరిక | Collector warns to polavaram contracters attack on Media coverage | Sakshi
Sakshi News home page

పోలవరం కాంట్రాక్టర్లకు కలెక్టర్‌ హెచ్చరిక

Published Mon, Oct 17 2016 8:48 AM | Last Updated on Thu, Mar 21 2019 8:30 PM

పోలవరం కాంట్రాక్టర్లకు కలెక్టర్‌ హెచ్చరిక - Sakshi

పోలవరం కాంట్రాక్టర్లకు కలెక్టర్‌ హెచ్చరిక

ఏలూరు: పోలవరం కాంట్రాక్టర్లను జిల్లా కలెక్టర్‌ హెచ్చరించారు. ట్రాన్స్‌ట్రాయ్‌ సిబ్బంది మీడియాపై చేసిన దౌర్జన్యంపై సోమవారం జిల్లా కలెక్టర్‌ స్పందించారు. మీడియాపై ఎవరైనా దౌర్జన్యం చేస్తే కఠిన చర్యలు ఉంటాయని అన్నారు. మీడియాపై దౌర్జన్యానికి దిగిన ట్రాన్స్‌ట్రాయ్‌ అధికారి తిరుమలేశ్‌ను వెనక్కి పంపేయాలని కాంట్రాక్టర్‌ను కలెక్టర్‌ ఆదేశించారు.

ఈ రోజు (సోమవారం) ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలో పర్యటనలో భాగంగా పనుల పరిశీలనకు వస్తుండటంతో కాంట్రాక్టర్లు శనివారం సాయంత్రం నుంచి హఠాత్తుగా మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో పోలవరం పనులపై కవరేజీకి వెళ్లిన మీడియాపై నిన్న ట్రాన్స్‌ట్రాయ్‌ సిబ్బంది దౌర్జన్యానికి దిగిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement