బెజ్జూర్, న్యూస్‌లైన్ : వంటగ్యాస్ ధరలు విపరీంతగా పెరగడంతోపాటు వంటచెరుకు పెరుగున్న తరుణంలో సామాన్యుడు వంట చేసుకోవడానికి నెలకు కనీసం రూ.500 ఖర్చు చేయాల్సి వస్తోంది. ఏదైనా పరిష్కారం కనుగొనాలనే తలంపుతో మండలంలోని మర్థిడి గ్రామానికి చెందిన జుమిడే ఆనంద్ కేవలం రూ.100 ఖర్చుతో మట్టిపొయ్యిని తయారు చేసి పిడుకెడు బొగ్గుతో వంట పూర్తి చేయడానికి ప్రయోగం చేశాడు. అందుకుగాను తన వద్ద ఉన్న ఫెవిస్టిక్, ఇనుప డబ్బా, 3 వాట్స్‌తో తిరిగే మోటార్, ఎంసిల్, రంధ్రాలతో కూడిన రేకుతో ప్రయోగం చేశాడు.
మట్టిపొయ్యికి ఒక వైపులా రేకు డబ్బాను అమర్చి డబ్బాకు రెండువైపుల రంధ్రాలు చేశాడు. ఒక వైపు మోటార్‌ను బిగించడంతోపాటు మరోవైపు పొయ్యి లోపలిభాగంలో గాలి వచ్చేలా ఏర్పాటు చేశాడు. పొయ్యిపై రంధ్రాలు చేసిన రేకు ఉంచాడు. సెల్‌బ్యాటరీ సహాయంతో మోటార్ తిరిగేలా కనెక్ష న్ ఇచ్చాడు.
గాలి కోసం ఫ్యాన్‌ను మోటార్‌కు బిగించాడు. దీం తో బ్యాటరీ సాయంతో మోటార్ తిరుగుతుంది. అందులోని ఫ్యాన్ తిరగడంతో చిన్నపాటి గాలితో రంధ్రాల రేకుపై ఉన్న బొగ్గులు గ్యాస్ మాదిరిగా మండుతుంది. ఎలాంటి కాలుష్యం లేకుండా పొగచూరకుండా గ్యాస్ కన్నా రెండు నిమిషాలు ముందుగానే వంట పూర్తవుతుంది. దీని కి కావాల్సింది రోజూ పిడికెడు బొగ్గులు మాత్రమే. ఎలాంటి ఖర్చు లేకుండా వం ట పూర్తి చేయడానికి తయారు చేశాడు.
ఒక ఐడియా వంట ఖర్చు తగ్గించింది
Published Mon, Jan 27 2014 2:43 AM | Last Updated on Sat, Sep 2 2017 3:02 AM
Advertisement