Cooking gas prices
-
వంట గ్యాస్ ధర భారీగా పెంపు
వంటగ్యాస్ ధర భారీగా పెంపు -
ఉజ్వల లబ్ధిదారులకు రూ.500కే సిలిండర్
అల్వార్(రాజస్థాన్): కేంద్ర ప్రభుత్వ ఉజ్వల పథకం కింద లబ్ధిపొందే రాష్ట్రంలోని పేదలకు రూ.500కే వంటగ్యాస్ సిలిండర్ అందిస్తామని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ప్రకటించారు. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ఏడాదికి 12 సిలిండర్లు ఈ ధరకే అందిస్తారు. ‘ ఉజ్వల పథకం కింద ప్రధాని మోదీ పేదలకు ఉచితంగా ఎల్పీజీ కనెక్షన్లు అయితే ఇచ్చారుగానీ ధరలు రూ.400 నుంచి ఏకంగా రూ.1,040కి పెరగడంతో ఎవరూ కొత్తగా సిలిండర్లు బుక్‌చేయట్లేరు. రాష్ట్రంలో ఇకపై ఉజ్వల పథకం లబ్దిదారులైన దారిద్రరేఖకు దిగువన ఉన్న పేదలకు రూ.500కే వంటగ్యాస్ సిలిండర్ అందిస్తాం. ఈ ధరకే ఏడాదికి 12 సిలిండర్లు ఇస్తాం’ అని సోమవారం గెహ్లాట్ చెప్పారు. సోమవారం రాజస్థాన్‌లోని అల్వార్‌లో జరుగుతున్న రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో రాహుల్‌తోపాటు గెహ్లాట్, కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే పాల్గొన్నారు. -
ప్రధాన సమస్యల నుంచి పక్కదారి
త్రిసూర్(కేరళ): విపరీతంగా పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల ధాటికి ఆగ్రహావేశాలతో ఉన్న ప్రజలను సమస్యల నుంచి దృష్టి మరల్చేందుకు బీజేపీ సర్కార్ శతథా ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఎగసిన ధరల అంశాలను గాలికొదిలేసి బీజేపీ, ఆర్ఎస్ఎస్ ద్వయం సమాజంలో విద్వేషాన్ని పెంచి హింసకు తావు కల్పిస్తున్నాయని రాహుల్ మండిపడ్డారు. భారత్ జోడో యాత్రను శనివారం ఆయన త్రిసూర్ దగ్గర్లోని పెరంబ్రలో ప్రారంభించారు. త్రిసూర్‌లో భారీ జనసందోహానుద్దేశించి రాహుల్ ప్రసంగించారు. ‘‘గత ఏడు దశాబ్దాల్లో కాంగ్రెస్ పార్టీ దేశం కోసం ఏం చేసిందని తరచూ ప్రధాని మోదీ అడుగుతుంటారు. అయితే, మోదీ జీ, మేం ఎన్నడూ దేశంలో నిరుద్యోగిత ఇంతటి గరిష్ట స్థాయికి తేలేదు. నిత్యావసరాల ధరలూ ఈ స్థాయికి పెరగలేదు. మా యూపీఏ హయాంలో వంటగ్యాస్ కోసం రూ.400 సరిపోయేవి. ఆ ధరే ఎక్కువ అన్నట్లు ఆనాడు మీరు మాట్లాడారు. కానీ, ఇప్పుడు రూ.1,000 దాటేసింది. ఇప్పుడు ఒక్క ముక్క కూడా మాట్లాడరేం?’’ అని ప్రశ్నించారు. ‘‘ఇంధన ధరలు విపరీతంగా పెంచేసి సామాన్యుల సొమ్మును అన్యాయంగా లాక్కుంటున్నారు. కొద్దిమంది బడా పారిశ్రామికవేత్తల బోషాణంలో పోస్తున్నారు. హింస, విద్వేషం పెరిగేలా చేసి ప్రజా సమస్యల నుంచి పౌరుల దృష్టిని కేంద్రం మళ్లిస్తోంది’’ అని ఆరోపించారు. ‘‘పట్టణ నిరుద్యోగిత రేటు దేశంలో కేరళలోనే అత్యధికం. రాష్ట్ర ప్రభుత్వ పాలనను విమర్శించడం నా ఉద్దేశంకాదు. సీఎం విజయన్‌కు నా విజ్ఞప్తి ఒక్కటే. యువత భవితను పట్టించుకోండి’’ అని రాహుల్ అన్నారు. -
ఎల్పీజీ రాయితీ... ‘ఉజ్వల’ లబ్ధిదారులకే
న్యూఢిల్లీ: వంట గ్యాస్ వినియోగదారులకు చేదువార్త. ఉజ్వల పథకం కింద ఉచితంగా వంటగ్యాస్ సిలిండర్లు పొందినవారికే ఇకపై రాయితీ దక్కనుంది. దాదాపు 9 కోట్ల మంది పేద మహిళలకు ఒక్కో సిలిండర్‌పై రూ.200 చొప్పున రాయితీ అందుతుంది. మిగతా వినియోగదారులంతా మార్కెట్ ధర చెల్లించాల్సిందేనని కేంద్ర చమురు శాఖ కార్యదర్శి పంజక్ జైన్ వెల్లడించారు. దేశ రాజధాని ఢిల్లీలో 14.2 కిలోల ఎల్పీజీ సిలిండర్ ధర ప్రస్తుతం రూ1,003గా ఉంది. ప్రధానమంత్రి ఉజ్వల యోజన లబ్ధిదారులకు ఒక్కో సిలిండర్‌పై రూ.200 రాయితీ వారి బ్యాంకు ఖాతాల్లో జమ కానుంది. అంటే వారికి ఒక్కో సిలిండర్ రూ.803కే లభిస్తుంది. ఏడాదికి 12 సిలిండర్లకే ఈ రాయితీ అందుతుంది. మిగిలిన వినియోగదారులంతా రూ.1,003 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. -
కాస్త తగ్గిన గ్యాస్‌భారం
విజయనగరం గంటస్తంభం: వంట గ్యాస్ విని యోగదారులకు కాస్తంత ఊరట కలిగింది. రాయితీ, రాయితీయేతర సిలిండర్ల ధర తగ్గిస్తూ చమురుసంస్థలు తీసుకున్న నిర్ణయం జిల్లావాసులను కాస్తంత ఊపిరి పీల్చుకునేలా చేసింది. ఆరు నెలలుగా వరుసగా ధరలు పెరుగుతుండటంతో ఈ నెలలో తగ్గడం వినియోగదారులకు ఉపశమనం కలిగిస్తుందనడంలో సం దేహం లేదు. జిల్లాలో ఏకంగా ప్రజలపై రూ. 22.40లక్షలు భారం తగ్గుతుండడం విశేషం. చమురుధరలు ప్రతి నెలా సమీక్ష చేస్తున్న విషయం తెలిసిందే. అంతర్జాతీయ మార్కెట్ ఆధారంగా చమురు సంస్థలు నెలాఖరున పెంచడంగానీ, తగ్గించడంగానీ చేస్తుంటాయి. ఇందులో భాగంగా డిసెంబర్ నెలకు సంబంధించి శుక్రవారం సమీక్షించిన చమురుసంస్థలు రూపా యి విలువ బలపడ్డంతో ధరలు తగ్గించాయి. తగ్గించిన ధరలుశుక్రవారం ఆర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చాయి. తగ్గింపు ఇలా... వంట గ్యాస్ సిలిండరు ధర విజయనగరంలో రూ.948లు ఉంది. 12 సిలిండర్ల వరకు ప్రభుత్వం రాయితీ ఇస్తున్న విషయం విదితమే. ఈ మేరకు రాయితీ ధర సుమారు రూ.507లు పడుతోంది. రూ.441లు వరకు కేంద్ర ప్రభుత్వం రాయితీ ఇవ్వడంతో గ్యాస్ విడుదల చేసిన తర్వాత వినియోగదారుల ఖాతాల్లో రాయితీ సొమ్ము జమవుతుంది. తాజాగా రాయితీ సిలిండర్‌పై రూ.6.52 తగ్గించడంతో జీఎస్టీతో కలిపి రూ.7 వరకు తగ్గనుంది. అంటే ఇకపై రూ.500లకే వస్తుందన్నమాట. అంటే గ్యాస్ విడుదల చేసిన తర్వాత రూ.448 వరకు ఖాతాల్లో పడనుంది. ఈ విధంగా జిల్లా వాసులపై రూ. 22.40వేల వరకూ భారం తగ్గనుంది. ఇదిలాఉండగా సబ్సడీ లేని సిలిండర్ ధర కూడా భారీగా తగ్గనుంది. ఒక్కో సిలిండర్‌పై రూ.133 తగ్గించారు. జీఎస్టీ 5శాతంతో కలిపితే రూ.138ల వరకు తగ్గుతుంది. సబ్సిడీ లేని సిలిండర్ల వినియోగం నామమాత్రంగా ఉండటంవల్ల వినియోగదారులకు పెద్దగా ఉపయోగం లేదు. ఎవరైనా విడుదల చేస్తే మాత్రం సుమారు రూ.148ల తగ్గుతుంది. రాయితీయేతర సిలిండర్ ధర తగ్గడంతో ప్రభుత్వానికి మాత్రం వినియోగదారులకు వేసే రాయితీ భారం తగ్గనుంది. ప్రస్తుతం ఇస్తున్న రాయితీ రూ.441లో రూ.148 తగ్గించి వినియోగదారులకు వేస్తారు. రాయితీ, రాయితీయేతర ధరల తగ్గింపు విషయం జిల్లాలో ఇతర ప్రాంతాల్లోనూ, కంపెనీలను బట్టి కూడా «తేడా ఉంటుంది. జిల్లావాసులకుఉపశమనమే జిల్లాలో 6.15లక్షల గ్యాస్ కనెక్షన్లున్నాయి. వీరంతా నెలకు దాదాపు 3.20లక్షల గ్యాస్ బండలు వినియోగిస్తున్నారు. రాయితీ ధర రూ.7 వరకు తగ్గడంతో సుమారు రూ.22.40లక్షల వరకూ వినియోగదారులకు మిగులుతుంది. రాయితీయేతర సిలిండర్లు నెలకు 10వేల వరకు వినియోగించినా రూ.14.80లక్షలు ఆదా అవుతుంది. -
మళ్లీ పెరిగిన వంట గ్యాస్ సిలిండర్ ధర
సాక్షి, హైదరాబాద్: వంట గ్యాస్ ధర మళ్లీ పెరిగింది. గత 6 నెలల నుంచి క్రమంగా పెరుగుతున్న సిలిండర్ ధర.. తాజాగా రూ.58.50 పెరిగింది. దీంతో హైదరాబాద్‌లో సబ్సిడీ లేని వంట గ్యాస్ సిలిండర్ ధర రూ.936.50కు చేరింది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర పెరుగుతుండటంతో వంట గ్యాస్ ధరపై తీవ్ర ప్రభావం పడుతోంది. తాజా పెంపుతో గత 6మాసాల్లోనే రూ.233.50 మేర గ్యాస్ ధర పెరిగినట్లయింది. అయితే సబ్సిడీ సిలిండర్ ధరలో మాత్రం హైదరాబాద్‌లో మార్పు లేదు. పెరిగిన ధరకు తగట్టుగా సిలిండర్‌పై సబ్సిడీ జమ కూడా పెరుగుతూ వస్తోంది. దీంతో సబ్సిడీ సిలిండర్ వినియోగదారులపై నయా పైసా కూడా అదనపు భారం లేకుండా పోయింది. అయితే సబ్సిడీ సిలిండర్‌కు నగదు బదిలీ పథకం వర్తింపు కారణంగా మొత్తం ధర ఒకేసారి చెల్లించి సిలిండర్ కొనుగోలు చేయడం నిరుపేదలకు భారంగా తయారైంది. ప్రస్తుతం పెరిగిన నగదు తిరిగి బ్యాంకు ఖాతాలోకి వస్తుండటంతో కొంత ఉపశమనం కలిగిస్తోంది. -
గ్యాస్ ధర భారమే!
సాక్షి, సిటీబ్యూరో: వంట గ్యాస్ ధర ఇంతింతై వటుడింతై మాదిరిగా రెండు నెలల నుంచి ఎగబాకుతోంది. వంటింట్లో మంట రాకుండానే మాడ్చేస్తోంది. సిలిండర్ ధర పెంపు సగటు జీవిని సంకటంలో పడేస్తోంది. ప్రస్తుతం వంట గ్యాస్ ధర రూ.58 పెరిగి మొత్తం సిలిండర్ ధర రూ.811లకు చేరింది. కేవలం రెండు నెలల వ్యవధిలో రూ.108 పెరిగినట్లయింది. అయితే డీబీటీ (సబ్సిడీ) వర్తిస్తున్న గృహ వినియోగదారులకు మాత్రం పెరిగిన రూ.58 రూపాయలు బ్యాంక్ ఖాతాలో తిరిగి వెనక్కి వస్తోంది. కానీ ముందుగానే రూ.811 రూపాయలు చెల్లించడం సగటు జీవికి కొంత ఇబ్బందికరమే. కేంద్ర ప్రభుత్వం ఎల్పీజీ సిలిండర్లపై సబ్సిడీ ఎత్తేయాలని సరిగ్గా ఏడాది క్రితం జూలైలో నిర్ణయం తీసుకోవడంతో చమురు సంస్ధలు ధరల సవరణల పేరుతో వరుసగా గత డిసెంబర్ వరకు 20 సార్లు సిలిండర్ రీఫిల్ ధర పెంచి...తిరిగి వరసగా నాలుగు పర్యాయాలు తగ్గిస్తూ వచ్చింది. గత రెండు నెలల నుంచి తిరిగి వరసగా ధర పెంచడంతో ధర ఎగబాకుతోంది. వాస్తవంగా పెరిగిన ధర సబ్సిడీ నగదు రూపేణా బ్యాంక్ ఖాతాలో నయా పైసాతో సహా జమ అవుతున్నా..ఒకేసారి సిలిండర్ కోసం పెద్ద మొత్తంలో నగదుగా చెల్లింపు చేయడం భారంగా కనిపిస్తోంది. బ్యాంక్‌లో సబ్సిడీ సొమ్ము నగదుగా సకాలంలో జమ కాకపోవడం కూడా వినియోగదారులైన నిరుపేదలకు ఆర్థిక కష్టాలు తప్పడం లేదు. గృహోపయోగ వంట గ్యాస్ వినియోగదారులు మార్కెట్ ధర ప్రకారం నగదుగా చెల్లిస్తే సబ్సిడీ సిలిండర్ ధర మినహాయించి మిగిలిన చెల్లింపులు నగదు బదిలీ కింద బ్యాంక్ ఖాతాలో జమ అవుతోంది. గత నెలలో సిలిండర్ ధరను బట్టి సబ్సిడీ సొమ్ము రూ.263.50 బ్యాంకు ఖాతాలో జమ కాగా, తాజాగా పెరిగిన ధరతో రూ.321.50 జమ అవుతుంది. మరోవైపు వంట గ్యాస్ సిలిండర్లపై డెలివరీ బాయ్స్ అదనంగా బాదేస్తున్నారు. ప్రతి సిలిండర్‌పై రూ.20 నుంచి 25 వరకు బలవంతంగా వసూలు చేస్తున్నారు. -
ఒక ఐడియా వంట ఖర్చు తగ్గించింది
బెజ్జూర్, న్యూస్‌లైన్ : వంటగ్యాస్ ధరలు విపరీంతగా పెరగడంతోపాటు వంటచెరుకు పెరుగున్న తరుణంలో సామాన్యుడు వంట చేసుకోవడానికి నెలకు కనీసం రూ.500 ఖర్చు చేయాల్సి వస్తోంది. ఏదైనా పరిష్కారం కనుగొనాలనే తలంపుతో మండలంలోని మర్థిడి గ్రామానికి చెందిన జుమిడే ఆనంద్ కేవలం రూ.100 ఖర్చుతో మట్టిపొయ్యిని తయారు చేసి పిడుకెడు బొగ్గుతో వంట పూర్తి చేయడానికి ప్రయోగం చేశాడు. అందుకుగాను తన వద్ద ఉన్న ఫెవిస్టిక్, ఇనుప డబ్బా, 3 వాట్స్‌తో తిరిగే మోటార్, ఎంసిల్, రంధ్రాలతో కూడిన రేకుతో ప్రయోగం చేశాడు. మట్టిపొయ్యికి ఒక వైపులా రేకు డబ్బాను అమర్చి డబ్బాకు రెండువైపుల రంధ్రాలు చేశాడు. ఒక వైపు మోటార్‌ను బిగించడంతోపాటు మరోవైపు పొయ్యి లోపలిభాగంలో గాలి వచ్చేలా ఏర్పాటు చేశాడు. పొయ్యిపై రంధ్రాలు చేసిన రేకు ఉంచాడు. సెల్బ్యాటరీ సహాయంతో మోటార్ తిరిగేలా కనెక్ష న్ ఇచ్చాడు. గాలి కోసం ఫ్యాన్‌ను మోటార్‌కు బిగించాడు. దీం తో బ్యాటరీ సాయంతో మోటార్ తిరుగుతుంది. అందులోని ఫ్యాన్ తిరగడంతో చిన్నపాటి గాలితో రంధ్రాల రేకుపై ఉన్న బొగ్గులు గ్యాస్ మాదిరిగా మండుతుంది. ఎలాంటి కాలుష్యం లేకుండా పొగచూరకుండా గ్యాస్ కన్నా రెండు నిమిషాలు ముందుగానే వంట పూర్తవుతుంది. దీని కి కావాల్సింది రోజూ పిడికెడు బొగ్గులు మాత్రమే. ఎలాంటి ఖర్చు లేకుండా వం ట పూర్తి చేయడానికి తయారు చేశాడు.