![Only Ujjwala Yojana Beneficiaries To Get Rs 200 Subsidy - Sakshi](/styles/webp/s3/article_images/2022/06/3/ujjawala.jpg.webp?itok=fiBDOghK)
న్యూఢిల్లీ: వంట గ్యాస్ వినియోగదారులకు చేదువార్త. ఉజ్వల పథకం కింద ఉచితంగా వంటగ్యాస్ సిలిండర్లు పొందినవారికే ఇకపై రాయితీ దక్కనుంది. దాదాపు 9 కోట్ల మంది పేద మహిళలకు ఒక్కో సిలిండర్‌పై రూ.200 చొప్పున రాయితీ అందుతుంది. మిగతా వినియోగదారులంతా మార్కెట్ ధర చెల్లించాల్సిందేనని కేంద్ర చమురు శాఖ కార్యదర్శి పంజక్ జైన్ వెల్లడించారు.
దేశ రాజధాని ఢిల్లీలో 14.2 కిలోల ఎల్పీజీ సిలిండర్ ధర ప్రస్తుతం రూ1,003గా ఉంది. ప్రధానమంత్రి ఉజ్వల యోజన లబ్ధిదారులకు ఒక్కో సిలిండర్‌పై రూ.200 రాయితీ వారి బ్యాంకు ఖాతాల్లో జమ కానుంది. అంటే వారికి ఒక్కో సిలిండర్ రూ.803కే లభిస్తుంది. ఏడాదికి 12 సిలిండర్లకే ఈ రాయితీ అందుతుంది. మిగిలిన వినియోగదారులంతా రూ.1,003 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment