ఉజ్వల లబ్ధిదారు ఇంట్లో టీ తాగిన మోదీ | Ayodhya: PM Modi visits Ujjwala Scheme beneficiary home | Sakshi
Sakshi News home page

ఉజ్వల లబ్ధిదారు ఇంట్లో టీ తాగిన మోదీ

Published Sun, Dec 31 2023 4:47 AM | Last Updated on Sun, Dec 31 2023 4:47 AM

Ayodhya: PM Modi visits Ujjwala Scheme beneficiary home - Sakshi

అయోధ్య: ‘ఉజ్వల పథకం’ 10 కోట్లవ లబ్దిదారు మీరా మంఝీతో మోదీ అన్న మాటలివి! అయోధ్య రైల్వేస్టేషన్‌ ప్రారంభించాక విమానాశ్రయానికి వెళ్తూ మార్గ మధ్యంలో లతా మంగేష్కర్‌ చౌక్‌ కూడలి సమీపంలో ఆయన హఠాత్తుగా ఆగారు. సమీప వీధిలోని మీరా ఇంటికెళ్లి వారందరినీ సంభ్రమాశ్చర్యాలకు గురిచేశారు. స్వయానా ప్రధాని తన ఇంటికి రావడంతో ఉబ్బి తబ్బిబ్బైన మీరా బహుశా ఆ కంగారులో ఆయనకు కలిపిచి్చన టీలో కాస్తంత చక్కెర ఎక్కువేశారు.

ఆ చాయ్‌ తాగుతూ తీపి ఎక్కువైందని మోదీ సరదాగా స్పందించారు. ఉజ్వల పథకం 10 కోట్లవ లబ్ధిదారు కావడంతో ఆమె కుటుంబాన్ని కలిసేందుకు మోదీ ప్రత్యేకంగా వారింటికి వెళ్లారు. ‘‘ఉజ్వలతో ఉచితంగా గ్యాస్‌ కనెక్షన్‌ వచి్చంది. కేంద్ర గృహ నిర్మాణ పథకంతో ఉచితంగా ఇల్లూ వచి్చంది’’ అంటూ మీరా ఆనందం వెలిబుచ్చారు. ఆమె కుటుంబ యోగక్షేమాలను మోదీ అడిగి తెల్సుకున్నారు. మీరా కుమారుడికి ఆటోగ్రాఫ్‌ ఇచ్చి వందేమాతరం అని రాసిచ్చారు. అక్కడి చిన్నారులతో సెల్ఫీ దిగారు. ‘‘పాత ప్రభుత్వాలు ఐదు దశాబ్దాల్లో కేవలం 14 కోట్ల గ్యాస్‌ కనెక్షన్లిస్తే మేం పదేళ్లలో ఏకంగా 18 కోట్ల కనెక్షన్లు అందించాం. వాటిలో పది కోట్లు ఉచిత కనెక్షన్లే’’ అని మోదీ అన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement