Ujjwala scheme
-
Lok Sabha elections 2024: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ 4 శాతం పెంపు
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తుండడంతో కేంద్ర ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. కేంద్ర మంత్రివర్గ సమావేశం గురువారం జరిగింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరువు భత్యాన్ని(డీఏ), పెన్షనర్లకు కరువు సహాయాన్ని(డీఆర్) బేసిక్ పే/పెన్షన్‌పై మరో 4 శాతం పెంచింది. ప్రస్తుతం డీఏ/డీఆర్ 46 శాతం ఉంది. తాజా పెంపుతో ఇది 50 శాతానికి చేరింది. పెంచిన భత్యం ఈ ఏడాది జనవరి 1 నుంచే అమల్లోకి వస్తుందని ప్రభుత్వం వెల్లడించింది. దీనివల్ల కోటి మందికిపైగా ఉద్యోగులకు, పెన్షనర్లకు లబ్ధి చేకూరుతుందని తెలియజేసింది. ఉద్యోగులకు డీఏ అదనపు వాయిదా సొమ్ము, పెన్షనర్లకు కరువు సహాయం(డీఆర్) సొమ్ము ఈ ఏడాది జనవరి 1 నుంచి చెల్లించేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ధరలు పెరగడంతో ఉద్యోగులకు, పెన్షనర్లకు డీఏను 50 శాతానికి పెంచినట్లు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పేర్కొన్నారు. ఈ పెంపు వల్ల ఖజానాపై ప్రతిఏటా రూ.12,869 కోట్ల భారం పడనుంది. 2024 జవవరి నుంచి 2025 ఫిబ్రవరి వరకు ప్రభుత్వం రూ.15,014 కోట్లు చెల్లించనుంది. డీఏ పెంపుతో ఉద్యోగులకు ఇతర భత్యాలు, గ్రాట్యుటీ సైతం పెరుగుతాయి. డీఏ/డీఆర్ కాకుండా ఇతర భత్యాల పెంపు కారణంగా ప్రభుత్వ ఖజానాపై ఏటా రూ.9,400 కోట్ల భారం పడుతుంది. ఏడో కేంద్ర వేతన కమిషన్ సిఫార్సుల ప్రకారమే డీఏ/డీఆర్‌ను కేంద్రం పెంచింది. ఉజ్వల రాయితీ గడువు పెంపు ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద పేద మహిళలకు వంట గ్యాస్ సిలిండర్లపై రూ.300 చొప్పున ఇస్తున్న రాయితీ గడువును కేంద్రం మరో ఏడాది పెంచింది. వాస్తవానికి ఈ గడువు ఈ ఏడాది మార్చి 31న ముగియనుంది. ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమయ్యే 2024–25 ఆర్థిక సంవత్సరంలోనూ రాయితీని వర్తింపజేయాలని నిర్ణయించినట్లు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ప్రతిఏటా 12 సిలిండర్లకు ఈ రాయితీ వర్తిస్తుంది. ముడి జనపనారకు మరో రూ.285 ముడి జనపనారకు కనీస మద్దతు ధరను కేంద్రం మరో రూ.285 పెంచింది. దీనివల్ల క్వింటాల్ ముడి జనపనార ధర రూ.5,335కు చేరుకుంది. 2024–25 ఆర్థిక సంవత్సరంలో ఈ కనీస మద్దతు ధర వర్తిస్తుంది. రూ.10,037 కోట్లతో ‘ఉన్నతి’ ఈశాన్య రాష్ట్రాల్లో పారిశ్రామికాభివృద్ధి, ఉద్యోగాల సృష్టికి ప్రోత్సాహం ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన కొత్త పథకం ‘ఉన్నతి’కి కేబినెట్ ఆమోదం తెలియజేసింది. ఈ పథకం రూ.10,037 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో పరిశ్రమలు స్థాపించే పెట్టుబడిదారులకు ప్రోత్సాహకాలు ఇస్తారు. 2034 మార్చి 31 దాకా ఈ పథకం అమల్లో ఉంటుంది. రూ.10,372 కోట్లతో కృత్రిమ మేధ ఐదేళ్ల పాటు అమలు చేసే ఇండియా కృత్రిమ మేధ(ఏఐ) మిషన్‌కు కేంద్ర మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. ఈ మిషన్‌కు ప్రభుత్వం రూ.10,373 కోట్లు కేటాయించింది. ఈ మిషన్‌లో భాగంగా 10,000 జీపీయూ సూపర్ కంప్యూటింగ్ కెపాసిటీని అందుబాటులోకి తీసుకొస్తారు. -
ఉజ్వల లబ్ధిదారు ఇంట్లో టీ తాగిన మోదీ
అయోధ్య: ‘ఉజ్వల పథకం’ 10 కోట్లవ లబ్దిదారు మీరా మంఝీతో మోదీ అన్న మాటలివి! అయోధ్య రైల్వేస్టేషన్ ప్రారంభించాక విమానాశ్రయానికి వెళ్తూ మార్గ మధ్యంలో లతా మంగేష్కర్ చౌక్ కూడలి సమీపంలో ఆయన హఠాత్తుగా ఆగారు. సమీప వీధిలోని మీరా ఇంటికెళ్లి వారందరినీ సంభ్రమాశ్చర్యాలకు గురిచేశారు. స్వయానా ప్రధాని తన ఇంటికి రావడంతో ఉబ్బి తబ్బిబ్బైన మీరా బహుశా ఆ కంగారులో ఆయనకు కలిపిచి్చన టీలో కాస్తంత చక్కెర ఎక్కువేశారు. ఆ చాయ్ తాగుతూ తీపి ఎక్కువైందని మోదీ సరదాగా స్పందించారు. ఉజ్వల పథకం 10 కోట్లవ లబ్ధిదారు కావడంతో ఆమె కుటుంబాన్ని కలిసేందుకు మోదీ ప్రత్యేకంగా వారింటికి వెళ్లారు. ‘‘ఉజ్వలతో ఉచితంగా గ్యాస్ కనెక్షన్ వచి్చంది. కేంద్ర గృహ నిర్మాణ పథకంతో ఉచితంగా ఇల్లూ వచి్చంది’’ అంటూ మీరా ఆనందం వెలిబుచ్చారు. ఆమె కుటుంబ యోగక్షేమాలను మోదీ అడిగి తెల్సుకున్నారు. మీరా కుమారుడికి ఆటోగ్రాఫ్ ఇచ్చి వందేమాతరం అని రాసిచ్చారు. అక్కడి చిన్నారులతో సెల్ఫీ దిగారు. ‘‘పాత ప్రభుత్వాలు ఐదు దశాబ్దాల్లో కేవలం 14 కోట్ల గ్యాస్ కనెక్షన్లిస్తే మేం పదేళ్లలో ఏకంగా 18 కోట్ల కనెక్షన్లు అందించాం. వాటిలో పది కోట్లు ఉచిత కనెక్షన్లే’’ అని మోదీ అన్నారు. -
ఉజ్వల లబ్ధిదారులకు రూ.500కే సిలిండర్
అల్వార్(రాజస్థాన్): కేంద్ర ప్రభుత్వ ఉజ్వల పథకం కింద లబ్ధిపొందే రాష్ట్రంలోని పేదలకు రూ.500కే వంటగ్యాస్ సిలిండర్ అందిస్తామని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ప్రకటించారు. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ఏడాదికి 12 సిలిండర్లు ఈ ధరకే అందిస్తారు. ‘ ఉజ్వల పథకం కింద ప్రధాని మోదీ పేదలకు ఉచితంగా ఎల్పీజీ కనెక్షన్లు అయితే ఇచ్చారుగానీ ధరలు రూ.400 నుంచి ఏకంగా రూ.1,040కి పెరగడంతో ఎవరూ కొత్తగా సిలిండర్లు బుక్‌చేయట్లేరు. రాష్ట్రంలో ఇకపై ఉజ్వల పథకం లబ్దిదారులైన దారిద్రరేఖకు దిగువన ఉన్న పేదలకు రూ.500కే వంటగ్యాస్ సిలిండర్ అందిస్తాం. ఈ ధరకే ఏడాదికి 12 సిలిండర్లు ఇస్తాం’ అని సోమవారం గెహ్లాట్ చెప్పారు. సోమవారం రాజస్థాన్‌లోని అల్వార్‌లో జరుగుతున్న రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో రాహుల్‌తోపాటు గెహ్లాట్, కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే పాల్గొన్నారు. -
ఏప్రిల్ 1 నుంచి రూ.500లకే గ్యాస్ సిలిండర్!
జైపూర్: దేశంలో వంట గ్యాస్ ధరలు ఆకాశన్నంటుతూ సామాన్యుడికి పెనుభారంగా మారిన వేళ తమ రాష్ట్ర ప్రజలకు శుభవార్త అందించారు రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లట్. వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి సిలిండర్ ధరను రూ.500లకు తగ్గిస్తామని ప్రకటించారు. దారిద్య్ర రేఖకు దిగువన ఉండి ఉజ్వల పథకంలో నమోదు చేసుకున్న వారికి ఈ రాయితీ అందిస్తామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో ఈ ప్రకటన చేశారు ముఖ్యమంత్రి. బీజేపీపై విమర్శలు గుప్పించారు. ‘వచ్చే నెలలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్ కోసం సన్నద్ధమవుతున్నాం. ఇప్పుడు ఒకటి చెప్పాలనుకుంటున్నా. ఉజ్వల స్కీంలో పేదలకు ప్రధాని మోదీ ఎల్పీజీ కనెక్షన్లు, స్టౌవ్ ఇచ్చారు. కానీ, సిలిండర్లు ఖాళీగా ఉన్నాయి. ఎందుకంటే ధరలు రూ.400 నుంచి రూ.1,040 మధ్య ఉండటమే. ఉజ్వల స్కీంలో నమోదు చేసుకున్న నిరుపేదలకు రూ.500లకే ఏడాదికి 12 సిలిండర్లు అందిస్తాం.’ అని పేర్కొన్నారు. మరోవైపు.. వచ్చే ఏడాదిలో రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో ప్రజలపై ముఖ్యమంత్రి వరాల జల్లు కురిపిస్తున్నట్లు విపక్ష పార్టీలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఇదీ చదవండి: కర్ణాటక అసెంబ్లీ తొలిరోజున సరిహద్దులో ఉద్రిక్తత.. బెళగావిలో 144 సెక్షన్ అమలు -
ఎల్పీజీ రాయితీ... ‘ఉజ్వల’ లబ్ధిదారులకే
న్యూఢిల్లీ: వంట గ్యాస్ వినియోగదారులకు చేదువార్త. ఉజ్వల పథకం కింద ఉచితంగా వంటగ్యాస్ సిలిండర్లు పొందినవారికే ఇకపై రాయితీ దక్కనుంది. దాదాపు 9 కోట్ల మంది పేద మహిళలకు ఒక్కో సిలిండర్‌పై రూ.200 చొప్పున రాయితీ అందుతుంది. మిగతా వినియోగదారులంతా మార్కెట్ ధర చెల్లించాల్సిందేనని కేంద్ర చమురు శాఖ కార్యదర్శి పంజక్ జైన్ వెల్లడించారు. దేశ రాజధాని ఢిల్లీలో 14.2 కిలోల ఎల్పీజీ సిలిండర్ ధర ప్రస్తుతం రూ1,003గా ఉంది. ప్రధానమంత్రి ఉజ్వల యోజన లబ్ధిదారులకు ఒక్కో సిలిండర్‌పై రూ.200 రాయితీ వారి బ్యాంకు ఖాతాల్లో జమ కానుంది. అంటే వారికి ఒక్కో సిలిండర్ రూ.803కే లభిస్తుంది. ఏడాదికి 12 సిలిండర్లకే ఈ రాయితీ అందుతుంది. మిగిలిన వినియోగదారులంతా రూ.1,003 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. -
గ్యాస్ వినియోగదారులకు అదిరిపోయే గుడ్‌న్యూస్..!
ఆకాశమే హద్దుగా పెరిగిన ఇంధన ధరలపై కేంద్రం ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీని తగ్గించడంతో సామాన్యులకు కాస్త ఉపశమనం తగ్గింది. పెట్రోల్‌పై రూ. 5, డీజిల్‌పై రూ. 10 చొప్పున తగ్గిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. తాజాగా కేంద్ర ప్రభుత్వం ఎల్పీజీ సిలిండర్లపై మరో అనూహ్య నిర్ణయాన్ని తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఎల్పీజీ సిలిండర్లపై భారీ రాయితీ..! ఇంధన ధరలతో పాటుగా ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల ధరలు భారీగానే పెరిగాయి. కొన్ని ప్రాంతాల్లో డొమెస్టిక్ గ్యాస్ ధర ఏకంగా రూ.1000కు చేరువైంది. దాంతో పాటుగా గ్యాస్ సిలిండర్లపై కేంద్రం సబ్సిడీను కూడా భారీగా తగ్గించింది. ప్రస్తుతం ఆయా ప్రాంతాలను బట్టి డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ల కొనుగోలుపై సుమారు రూ.20 నుంచి రూ. 40 వరకు మాత్రమే సబ్సిడీని పొందుతున్నారు. గ్యాస్ సిలిండర్లపై ధరల పెంపుతో సామాన్య ప్రజలపై ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ రూపంలో ఇచ్చే మినహాయింపును పెంచాలని భావిస్తోన్నట్లు తెలుస్తోంది. డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్‌పై రూ.312.48కి సబ్సీడి అందించాలని తెలుస్తోంది. ఉజ్వల పథకం కింద గ్యాస్ తీసుకున్న వారికి గరిష్టంగా ఈ సబ్సిడీ లభించనుంది. ఇతరులకు రూ.291.48 వరకు సబ్సిడీ రానుంది. కేంద్ర ప్రభుత్వం అందించే ఈ సబ్సిడీని పొందాలంటే గ్యాస్ వినియోగదారులు కచ్చితంగా బ్యాంక్ ఖాతాను మీ ఆధార్ కార్డ్‌తో లింక్ చేసుకోవాల్సి ఉంటుంది. సబ్సిడీ పొందాలంటే మీ బ్యాంకు ఖాతాను ఆధార్‌తో ఇలా లింక్ చేయండి ఇండనే గ్యాస్ సిలిండర్ కస్టమర్లు ‘cx.indianoil.in’ వెబ్‌సైట్‌ను సందర్శించి ఆదార్‌కార్డును లింక్ చేయాలి. భారత్ గ్యాస్ కంపెనీ వినియోగదారులు కంపెనీ అధికారిక వెబ్సైట్ - ‘ebharatgas.com’సందర్శించి ఆదార్‌కార్డును లింక్ చేయాలి. సంబంధిత బ్యాంకును సందర్శించడం ద్వారా కూడా ఆదార్ కార్డును లింక్ చేయవచ్చును. చదవండి: డిజిటల్ ఛార్జీల మోతపై క్లారిటీ ఇచ్చిన ఎస్బీఐ -
గ్యాస్ వినియోగదారులకు కేంద్రం శుభవార్త
గ్యాస్ వినియోగదారులకు కేంద్రం శుభవార్త. ఉజ్వల 2.0 పథకం కింద లబ్దిదారులకు ఉచిత ఎల్పీజీ కనెక్షన్లు అందించే కార్యక్రమాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు. 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర బడ్జెట్లో పీఎంయూవై పథకం కింద మరో కోటి గ్యాస్ కనెక్షన్లను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. తొలి విడతలో ఎల్పీజీ కనెక్షన్లు పొందలేక పోయిన పేద కుటుంబాలకు గ్యాస్ కనెక్షన్లను అందించాలని నిర్ణయించింది. PM Narendra Modi launches Pradhan Mantri Ujjwala Yojana 2.0, hands over LPG connections to several women beneficiaries, at Mahoba via video conferencing. pic.twitter.com/DoPfy2RA1b — ANI UP (@ANINewsUP) August 10, 2021 ఇందులో భాగంగా ప్రధాని మోదీ మంగళవారం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మహోబా జిల్లాలో జరిగిన కార్యక్రమాన్ని ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఉజ్వల 2.0లో యూనియన్ పెట్రోలియం మినిస్టర్ హర్దీప్ సింగ్ పూరి, ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాధ్, డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్యాలు పాల్గొన్నారు. ఈ పథకంలో భాగంగా ఉజ్వల 2.0 కింద ఉచిత ఎల్పీజీ కనెక్షన్‌తో పాటు లబ్ధిదారులకు మొదటి రీఫిల్, హాట్ప్లేట్ అందించనున్నట్లు కేంద్రం తెలిపింది. ఇదిలా ఉంటే.. ఉజ్వల స్కీమ్‌లో రిజిస్ట్రేషన్ కోసం కనీస ప్రతాలు అవసరమే కానీ ఉజ్వల 2.0లో వలసదారులు రేషన్‌కార్డు, నివాస ధ్రువీకరణ పత్రాలు లేకుండానే గ్యాస్ కనెక్షన్లు అందించనుంది. కాగా ఉజ్వల 1.0 కార్యక్రమాన్ని మే1, 2016న ప్రధాని మోదీ ఉత్తర్ ప్రదేశ్ బల్లియా నుంచి ప్రారంభించారు. తొలివిడుతలో 80లక్షల ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్లను అందించిన విషయం తెలిసిందే. -
తప్పనున్న పొగ తిప్పలు.!
ఆసిఫాబాద్‌అర్బన్: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకం ద్వారా వంటింట్లో పొగ తిప్పలు తప్పేలా కనిపిస్తున్నాయి. ఈ పథకంలో భాగంగా నిరుపేద మహిళలను అర్హులుగా చేర్చుతూ ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు అందజేస్తున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత మహిళలకు ఈ పథకంతో మేలు జరగనుంది. ఈ నేపథ్యంలో అర్హులను గుర్తించి సిలిండర్లు అందజేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ఆసిఫాబాద్ జిల్లాలో ఇప్పటి వరకు 11,142 మందికి ఈ పథకం కింద కనెక్షన్లు మంజూరు చేసినట్లు అధికారులు తెలుపుతున్నారు. ఉచితంగా సిలిండర్లు.. దారిద్య్ర రేఖకు దిగవనున్న కుటుంబాల్లో నేటికీ వంట చేసుకోవడానికి కట్టెలే దిక్కు. ఇలాంటి వారిని పొగ నుంచి విముక్తి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఉజ్వల యోజన పథకం ప్రవేశపెట్టింది. నేటికీ చాలా వరకు గ్రామాల్లో కట్టెల పొయ్యి దిక్కు. వంట చేసేటప్పుడు మహిళల కళ్లల్లోకి పొగ వెళ్లడంతో అనారోగ్యం పాలవుతున్నారు. ఆహారం సైతం కలుషితమవుతుంది. 2016లో ఉత్తరప్రదేశ్‌లోని బాల్లియాలో మొదటగా ప్రయోగాత్మకంగా ఈ పథకాన్ని అమలు చేశారు. దశల వారీగా దేశ వ్యాప్తంగా అమలు చేస్తున్నారు. రూ.1600లు విలువ చేసే గ్యాస్ కనెక్షన్ పూర్తిగా ఉచితంగా అందజేస్తున్నారు. గ్యాస్ పొయ్యితో పాటు రెగ్యులేటర్, మిగితా అన్ని వస్తువులను అందిస్తున్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని గ్యాస్ ఏజెన్సీలు వినియోగదారులకు అవగాహన కల్పిస్తున్నాయి. పథకానికి అర్హులు వీరే.. ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన వారు ఈ పథకానికి అర్హులు. అంత్యోదయ కార్డు కలిగిన వారికి కూడా ఈ పథకంలో ప్రాధాన్యత ఇస్తారు. దారిద్య్ర రేఖకు దిగువన ఉండి ఇది వరకు గ్యాస్ కనెక్షన్ లేనివారికి సైతం ఉచితంగా పంపిణీ చేయనున్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం రేషన్‌కార్డు కలిగి ఉన్న పేదలను ఈ పథకానికి అర్హులుగా ఎంపిక చేస్తున్నారు. ఉజ్వల యోజన పథకంలో భాగంగా గ్యాస్ సిలిండర్ పొందాలంటే మహిళకు బ్యాంకు ఖాతా పుస్తకం ఉండాలి. రెండు పాస్‌పోర్టు సైజు ఫొటోలు అవసరం. రేషన్ కార్డు ఉండాలి. మొబైల్ నంబరుతో సమీప గ్యాస్ ఏజెన్సీలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మొదట దరఖాస్తు గడువు ఆగస్టుతో ముగిసింది. తిరిగి మళ్లీ ఈనెల 18 నుంచి అర్హుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. సద్వినియోగం చేసుకోవాలి.. గ్రామీణ ప్రాంతాల వారికి ఈ పథకం ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకం ద్వారా జిల్లాలో 11,142 మందికి ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు అందజేశాం. అర్హులు ధ్రువపత్రాలను సంబంధత అధికారులకు అందించి నేరుగా కనెక్షన్లు పొందవచ్చు. ఈ పథకం దరఖాస్తు గడువు ఆగస్టు నెలలోనే ముగిసింది. తిరిగి మళ్లీ నేటి నుంచి దరఖాస్తు చేసుకునేందుకు అవకాశముంది. – టి.సత్యనారాయణ, జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి -
ప్రేమ్‌చంద్ కథకు ‘ఉజ్వల’ లింకేమిటో?
సాక్షి, న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సోమవారం తన వినూత్న ఉజ్వల పథకం విజయ ప్రస్థానం గురించి దేశ పేద మహిళల ముందు ప్రస్థావిస్తూ ‘పిట్ట’ కథకు బదులుగా ప్రముఖ హిందీ రచయిత ప్రేమ్‌చంద్ రాసిన ‘ఈద్గా’ చిన్న కథ గురించి వివరంగా చెప్పారు. అందులో హమీద్ అనే చిన్న కుర్రాడు చేగోడీలో, పకోడీలో కొనుక్కోకుండా దాచుకున్న తన జేబు డబ్బును తన నానమ్మ రొట్టెలు కాలుస్తున్నప్పుడు చేతులు కాల్చుకోకుండా ఉండేందుకుగాను పటకారు కొంటాడు. ‘నానమ్మ చేతులు కాల్చుకోకుండా ఓ చిన్న కుర్రవాడు చేసినప్పుడు ఈ దేశ ప్రధానిగా ఉన్న నేను ఈ మహిళలకు ఎందుకు చేయలేను’ అన్న ఆలోచన నుంచి పుట్టుకొచ్చిందే ఈ వినూత్న ఉజ్వల పథకమని మోదీ సగర్వంగా చెప్పుకోవడమే కాకుండా ముచ్చటగా మురిసిపోయారు. అవిభాజ్య ఆంధ్రప్రదేశ్‌లో రెండు దశాబ్దాల క్రితమే పేదలకు సబ్సిడీ ఎల్పీజీ స్కీమ్‌ను అమలు చేశారు. తమిళనాడులో 2007లో అప్పటి డీఎంకే ప్రభుత్వం ఎల్పీజీ కనెక్షన్లను, గ్యాస్ స్టవ్‌లను ఉచితంగా అందజేసింది. కేంద్రంలో మన్మోహన్ సింగ్ నాయకత్వంలోని యూపీఏ ప్రభుత్వం కూడా పేద మహిళలకు సబ్సిడీలపై ఎల్పీజీ కనెక్షన్లను అందజేసింది. ఈ స్కీమ్లకే మన ప్రధాని నరేంద్ర మోదీ ‘ఉజ్వల’గా పేరు మార్చి అమలు చేశారు. ఉత్తరాదిలో చాలా చోట్ల ఇప్పటికే సిలిండర్లు, గ్యాస్ స్టవ్‌లు అటకెక్కగా, కొన్ని చోట్ల సిలిండర్లు పక్కింటికి, స్టవ్‌లు అంగడికి వెళ్లాయి. ఉచితంగా దొరికే వంట చెరకు బదులుగా నెలకు ఐదారు వందల రూపాయలను గ్యాస్ సిలిండర్‌కు ఎందుకు ఖర్చు చేయాలన్న ఆలోచనే అందుకు కారణం. నరేంద్ర మోదీ మాత్రం తాను ‘ఈద్గా’ కథ నుంచి స్ఫూర్తి పొంది ఉజ్వల పథకాన్ని అమలు చేసినట్లు చెబుతున్నారు. ఈ కథను చదువుతున్నప్పుడు ఎవరైనా హమీద్‌కు తన నానమ్మ అమీనా పట్ల ఉన్న అంతులేని అభిమానాన్ని అనుభూతి పొందుతాము. నరేంద్ర మోదీ ఉజ్వల లబ్ధిదారులతో మాట్లాడిన సంభాషణ వింటే మనకు ఎలాంటి అనుభూతి కలగదు. పైగా అర్థరహితంగా కనిపిస్తుంది. ఒడిశాలోని మయూర్భంజ్ నుంచి సుశ్మిత... ప్రధాన మంత్రి మోదీతో మాట్లాడుతూ ‘ఇంతకుముందు వర్షాకాలంలో వర్షాలు పడ్డప్పడల్లా పొయ్యిలోకి నీళ్లు వచ్చేటివి. పొయ్యి వెలిగేది కాదు. పిల్లలు పస్తులుండేది. ఇక ఆ బాధ ఉండదని అనుకుంటా!’ అని వ్యాఖ్యానించారు. ‘కొత్త స్టవ్ వచ్చిన సందర్భంగా పిల్లలకు నీవు కొత్త వంటకాలు ఏమైనా చేసి పెడుతున్నావా? లేక అదే కట్టెల పొయ్యి మీద చేసినట్లుగా లావు, లావు రొట్టెలు చేసి పెడుతున్నావా?’ అని మోదీ ప్రశ్నించారు. మయూర్భంజ్ ప్రాంతంలో ఎక్కువగా అన్నమే తింటారని, రొట్టెలు చేసుకోరన్న విషయం మన ప్రియతమ ప్రధానికి తెలియదు పాపం! ‘నీవు ఏం బాగా చేస్తావు? నీ పిల్లలకు ఏది ఎక్కువ ఇష్టం? వారికి ఏది చేసి పెడతావు?’ అని కూడా సుశ్మితాను మోదీ ప్రశ్నించారు. అందుకు ఆమె ‘మ్యాగీ’ అంటూ సమాధానమిచ్చారు. నిజంగా మ్యాగి చేస్తారా? అంటూ మోదీ ఆశ్చర్యపోతూ మనల్నీ ఆశ్చర్యంలో పడేశారు. మోదీ మరో లబ్ధిదారు మీనాతో మాట్లాడుతూ ‘ మీ ఇరుగుపొరుగున ధనవంతులున్నారు. వారికి అందమైన ఇళ్లు ఉన్నాయి. కార్లు ఉన్నాయి. స్కూటర్లూ ఉన్నాయి. అన్నింటికన్నా ముందు గ్యాస్ స్టవ్‌లు ఉన్నాయి. మీకు ఇంతకాలం గ్యాస్ స్టవ్ లేదు.....మాకే గ్యాస్ స్టవ్ ఉందంటూ ఇంతకాలం రొమ్ము విరుచుకుని తిరిగాంగానీ ఇప్పుడు ఈ మోదీ వచ్చి ఓ పేదకు గ్యాస్ స్టవ్ ఇచ్చారు. ఇక మమ్మల్ని చూసి ఔరా! అనే వారే ఉండరని వారంటారుగదా!’ అన్న వ్యాఖ్యల్లో ఎవరికి తోచిన అర్థాలు వారు వెతుక్కోవచ్చు! -
1.5 కోట్ల ఎల్పీజీ కనెక్షన్లు
న్యూఢిల్లీ: ఏడాదిలో 1.5 కోట్ల ఉచిత ఎల్పీజీ కనెక్షన్లు అందివ్వాలనే లక్ష్యాన్ని ప్రభుత్వం కేవలం ఎనిమిది నెలల్లోనే చేరుకుంది. ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకం కింద మూడేళ్లలో 5 కోట్ల నిరుపేద కుటుంబాలకు ఎల్పీజీ కనెక్షన్లు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా తొలి ఏడాది 1.5 కోట్ల కనెక్షన్లు జారీచేయాలని నిర్దేశించుకుంది. మూడేళ్లకు రూ.8 వేల కోట్ల రూపాయలతో ఈ పథకాన్ని 2016–17 బడ్జెట్లో ప్రకటించారు. సామాజిక, ఆర్థిక, కుల గణన(ఎస్ఈసీసీ) సమాచారం ఆధారంగా గుర్తించిన నిరుపేద కుటుంబ మహిళ పేరిట ఉచితంగా ఎల్పీజీ కనెక్షన్ జారీచేస్తారు.