గ్యాస్ బండలు
విజయనగరం గంటస్తంభం: వంట గ్యాస్ విని యోగదారులకు కాస్తంత ఊరట కలిగింది. రాయితీ, రాయితీయేతర సిలిండర్ల ధర తగ్గిస్తూ చమురుసంస్థలు తీసుకున్న నిర్ణయం జిల్లావాసులను కాస్తంత ఊపిరి పీల్చుకునేలా చేసింది. ఆరు నెలలుగా వరుసగా ధరలు పెరుగుతుండటంతో ఈ నెలలో తగ్గడం వినియోగదారులకు ఉపశమనం కలిగిస్తుందనడంలో సం దేహం లేదు. జిల్లాలో ఏకంగా ప్రజలపై రూ. 22.40లక్షలు భారం తగ్గుతుండడం విశేషం. చమురుధరలు ప్రతి నెలా సమీక్ష చేస్తున్న విషయం తెలిసిందే. అంతర్జాతీయ మార్కెట్ ఆధారంగా చమురు సంస్థలు నెలాఖరున పెంచడంగానీ, తగ్గించడంగానీ చేస్తుంటాయి. ఇందులో భాగంగా డిసెంబర్ నెలకు సంబంధించి శుక్రవారం సమీక్షించిన చమురుసంస్థలు రూపా యి విలువ బలపడ్డంతో ధరలు తగ్గించాయి. తగ్గించిన ధరలుశుక్రవారం ఆర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చాయి.
తగ్గింపు ఇలా...
వంట గ్యాస్ సిలిండరు ధర విజయనగరంలో రూ.948లు ఉంది. 12 సిలిండర్ల వరకు ప్రభుత్వం రాయితీ ఇస్తున్న విషయం విదితమే. ఈ మేరకు రాయితీ ధర సుమారు రూ.507లు పడుతోంది. రూ.441లు వరకు కేంద్ర ప్రభుత్వం రాయితీ ఇవ్వడంతో గ్యాస్ విడుదల చేసిన తర్వాత వినియోగదారుల ఖాతాల్లో రాయితీ సొమ్ము జమవుతుంది. తాజాగా రాయితీ సిలిండర్‌పై రూ.6.52 తగ్గించడంతో జీఎస్‌టీతో కలిపి రూ.7 వరకు తగ్గనుంది. అంటే ఇకపై రూ.500లకే వస్తుందన్నమాట. అంటే గ్యాస్ విడుదల చేసిన తర్వాత రూ.448 వరకు ఖాతాల్లో పడనుంది. ఈ విధంగా జిల్లా వాసులపై రూ. 22.40వేల వరకూ భారం తగ్గనుంది. ఇదిలాఉండగా సబ్సడీ లేని సిలిండర్ ధర కూడా భారీగా తగ్గనుంది. ఒక్కో సిలిండర్‌పై రూ.133 తగ్గించారు. జీఎస్‌టీ 5శాతంతో కలిపితే రూ.138ల వరకు తగ్గుతుంది. సబ్సిడీ లేని సిలిండర్ల వినియోగం నామమాత్రంగా ఉండటంవల్ల వినియోగదారులకు పెద్దగా ఉపయోగం లేదు. ఎవరైనా విడుదల చేస్తే మాత్రం సుమారు రూ.148ల తగ్గుతుంది. రాయితీయేతర సిలిండర్ ధర తగ్గడంతో ప్రభుత్వానికి మాత్రం వినియోగదారులకు వేసే రాయితీ భారం తగ్గనుంది. ప్రస్తుతం ఇస్తున్న రాయితీ రూ.441లో రూ.148 తగ్గించి వినియోగదారులకు వేస్తారు. రాయితీ, రాయితీయేతర ధరల తగ్గింపు విషయం జిల్లాలో ఇతర ప్రాంతాల్లోనూ, కంపెనీలను బట్టి కూడా «తేడా ఉంటుంది.
జిల్లావాసులకుఉపశమనమే
జిల్లాలో 6.15లక్షల గ్యాస్ కనెక్షన్లున్నాయి. వీరంతా నెలకు దాదాపు 3.20లక్షల గ్యాస్ బండలు వినియోగిస్తున్నారు. రాయితీ ధర రూ.7 వరకు తగ్గడంతో సుమారు రూ.22.40లక్షల వరకూ వినియోగదారులకు మిగులుతుంది. రాయితీయేతర సిలిండర్లు నెలకు 10వేల వరకు వినియోగించినా రూ.14.80లక్షలు ఆదా అవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment