అల్లివలస గ్రామస్తులకు బోరును అందజేస్తున్న దృశ్యం
అల్లివలసకు తాగునీటి మోటారు అందించిన జెడ్పీటీసీ
Published Tue, Jul 19 2016 9:05 PM | Last Updated on Mon, Sep 4 2017 5:19 AM
రణస్థలం: గ్రామాలకు కనీసం తాగునీరు అందించలేని స్థితిలో ప్రభుత్వం ఉందని వైఎస్‌ఆర్ సీపీ ఎచ్చెర్ల నియోజకవర్గ సమన్వయకర్త గొర్లె కిరణ్‌కుమార్, జెడ్పీటీసీ సభ్యులు గొర్లె రాజగోపాల్‌లు తెలిపారు. అల్లివలస గ్రామంలో తాగునీటి సమస్యపై ఈ నెల 17న సాక్షిలో ‘గొంతెండుతోంది’ అన్న శీర్షికన కథనం వెలువడింది. దీనికి స్పందించిన జెడ్పీటీసీ సభ్యుడు గొర్లె రాజగోపాల్ మంగళవారం అల్లివలసకు తన సొంత డబ్బుతో తాగునీటి బోరు ఏర్పాటు చేశారు. ఎన్నో ఏళ్లుగా ఈ సమస్యతో బాధ పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోలేదని కిరణ్, రాజగోపాల్ ఆవేదన వ్యక్తం చేశారు. జెడ్పీ సమావేశంలో ప్రస్తావించినా లాభం లేకపోయిందని తెలిపారు. ప్రభుత్వం పట్టించుకోకున్నా వైఎస్‌ఆర్ సీపీ ప్రజలకు అండగా ఉంటోందని స్థానికులు ఆనందం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో వైఎస్‌ఆర్ సీపీ జిల్లా కార్యదర్శి పిన్నింటి సాయికుమార్, అల్లివలస ఎంపీటీసీ మైలపల్లి వెంకటేష్, వి.ఎల్లయ్య, సోరాడ కోర్లమ్మ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement