న్యూఢిల్లీ: ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-2 విక్రమ్ ల్యాండర్ ఆచూకీ కోసం నాసా ప్రయత్నించి చివరకు దాని ఆచూకీ కనిపెట్టింది. దీన్ని గుర్తించడంలో చెన్నైకి చెందిన ఓ ఇంజినీర్, ఖగోళ శాస్త్రవేత్త షణ్ముగ సుబ్రమణియన్ కీలక పాత్ర పోషించినట్లు నాసా చెప్పింది. దీంతో నాసా అతనిపై ప్రశంసలు కురిపించింది. దీనిపై షణ్ముగ స్పందిస్తూ.. ఓ సాధారణ పిక్ నుంచే తాను ల్యాండర్ కూలిన ప్రాంతాన్ని గుర్తించగలినట్లు షణ్ముగ చెప్పాడు. నాసా విడుదల చేసిన రెండు ఫోటోల్లో ఉన్న తేడాల ఆధారంగానే ఆ ప్రాంతాన్ని గుర్తించినట్లు తెలిపాడు. లూనార్ ఆర్బిటార్ తీసిన ఫోటోలను నాలుగైదు రోజుల పాటు కనీసం 7 నుంచి 8 గంటలు స్కాన్ చేసినట్లు చెప్పాడు. అయితే తాను కనుగొన్న విషయాన్ని నాసా ద్రువీకరించడం సంతోషంగా ఉందన్నాడు. ఒక రకంగా తన శోధన అనేక మందికి ప్రేరణగా నిలుస్తుందని షణ్ముగ తెలిపాడు.
Shanmuga Subramanian,an amateur astronomer from Chennai who has discovered debris of Chandrayaan-2's Vikram Lander on surface of the moon:I was able to find something out of the ordinary in a particular spot,so,I thought this must be the debris. I got confirmation from NASA today pic.twitter.com/8WBAZvNkRn
— ANI (@ANI) December 3, 2019
Comments
Please login to add a commentAdd a comment