చంద్రయాన్‌–3: షెడ్యూల్‌ కంటే ముందే ల్యాండింగ్‌ ప్రక్రియ | ISRO India Chandrayaan-3 Landing On Moon South Pole Countdown Starts, Live Updates In Telugu - Sakshi
Sakshi News home page

Chandrayaan-3 Moon Landing Updates:షెడ్యూల్‌ కంటే ముందే ల్యాండింగ్‌ ప్రక్రియ

Published Wed, Aug 23 2023 4:41 AM | Last Updated on Wed, Aug 23 2023 5:29 PM

India Chandrayaan-3 Moon Landing Live Updates - Sakshi

LIVE UPDATES:

►చంద్రయాన్‌-2 వ్యోమనౌక షెడ్యూల్‌ కంటే ముందే ల్యాండింగ్‌ కానుంది. 

►సాయంత్రం 5.44 నిమిషాలకు ల్యాండింగ్‌ ప్రక్రియ ప్రారంభం కానుంది.

►సాయంత్రం 6.04 గంటలకే ల్యాండర్‌  చంద్రుడిని తాకనుంది.

►విక్రమ్‌ ల్యాండర్‌ అడుగుపెట్టే చివరి 17 నిమిషాలే అత్యంత కీలకం: ఇస్రో చైర్మన్‌ సోమనాథ్‌
► ఆ 19 నిమిషాలు మాకు టెర్రరే.
►సాయంత్రం 5.47 గంటల తర్వాత ల్యాండర్‌ తన పని తాను చేసుకుపోతుంది.
►అన్ని సెన్సర్లు ఫెయిలైనా, ల్యాండింగ్‌ అయ్యేలా ప్రొపల్షన్‌ సిస్టమ్‌ను రూపొందించాం: ఇస్రో చీఫ్‌ సోమనాథ్‌
►ఆ దశలో ల్యాండర్‌ ఎవరి మాట వినదు.
►2 ఇంజిన్లు ఫెయిలైనా సజావుగా ల్యాండింగ్‌ అయ్యేలా ప్లాన్‌.
►అల్‌గోరిథమ్స్‌ బాగా పనిచేస్తే చాలు
►వర్టికల్‌ ల్యాండింగ్‌ అత్యంత కీలకం
►గంటకు 7.2 కిమీ. మీ-10.8 కి,మీ స్పీడుతో నేడు ల్యాండిగ్‌
►ల్యాండర్‌ 12 డిగ్రీల ఒరిగినా సేఫ్‌ ల్యాండింగ్‌కు ప్లాన్‌

►నేటి ల్యాండింగ్‌లో పూర్తిగా కంప్యూర్లదే పాత్ర
►చంద్రయాన్‌- నేటి ల్యాండింగ్‌లో ఇస్రో శాస్త్రవేత్తలది కేవలం పరిశీలక పాత్రే
►నేడు చివరి 15న నిమిషాలు పూర్తిగా కంప్యూటర్‌ గైడెడ్‌
►2019లో చంద్రయాన్‌-2 ల్యాండర్‌ నిలువుగా దిగకపోవడం వల్లే కూలింది
►నేడు అది జరగకూడదని సర్వ జాగ్రత్తలు

►చంద్రుడిపై ఐస్‌ ఉన్నట్లుందని 2009లో చెప్పిన చంద్రయాన్‌1 నాసా పరికరం
►చంద్రుడిపై సముద్రాలు ఉన్నట్లయితే హైడ్రోజన్‌, ఆక్సిజన్‌ ఉత్పత్తి చేసే వీలు
►చంద్రుడిపై ఇప్పటి దాకా ల్యాండ్‌ అయిన రోవర్లు: అమెరికా, చైనా, రష్యా
►చంద్రయాన్‌-3 పరిశోధనల వైపు ప్రపంచం మొత్తం చూపు

►చంద్రయాన్‌-3 ల్యాండింగ్‌ సౌతాఫ్రికా నుంచి ప్రధాని మోదీ వర్చువల్‌గా వీక్షించనున్నారు.

►మరొకన్ని గంటల్లో చంద్రుడిపై చారిత్రా‍త్మక ఘట్టం
►ఇవాళ జిబిల్లాపై చంద్రయాన్‌ 3 ల్యాండింగ్‌
►సాయంత్రం 6.04 గంటలకు చంద్రుడిపై అడుగుపెట్టనున్న విక్రమ్‌ ల్యాండర్‌
►సాఫ్ట్‌ ల్యాండింగ్‌పై ఇస్రోశాస్త్రవేత్తల ధీమా
►ఉత్కంఠగా ఎదురుచూస్తున్న దేశ ప్రజలు
►విజయవంతం కావాలని పూజలు, హోమాలు

►చంద్రయాన్‌ 3 రూపకల్పనలో గద్వాల జిల్లా యువకుడు కృష్ణా
►చంద్రయాన్‌-3 మిషన్‌లో 2 పేలోడ్స్‌(AHVC). (ILSA)కి డేటా ప్రాసెసింగ్‌ సాఫ్ట్‌వేర్‌ రాసిన ఉండవల్లికి చెందిన కృష్ణ

►ప్రపంచ దేశాల చూపు చంద్రయాన్‌వైపే
►రష్యా లూనా-25 విఫలం కావడంతో చంద్రయాన్‌పై ఇతర దేశాల ఆసక్తి
►ప్రయోగం  సక్సెస్‌ అయితే దక్షిణ ధృవంపై అడుగుపెట్టిన తొలిదేశంగా భారత్‌
►గత నెల 14న చంద్రయాన్‌ 3 ప్రయోగం
►41 రోజుల పాటు ప్రయాణం చేసిన చంద్రయాన్‌

ప్రతిష్టాత్మక చంద్రయాన్‌–3 మిషన్‌లో భాగమైన ల్యాండర్‌ మాడ్యూల్‌ తన తుది గమ్యాన్ని నేడు ముద్దాడనుంది. ఈ ప్రయోగంలో అత్యంత కీలకమైన తుదిఘట్టం బుధవారం ఆవిష్కృతం కానుంది. చంద్రుడి దక్షిణధ్రువ ఉపరితలంపై ల్యాండర్‌ మాడ్యూల్‌ అడుగు పెట్టనుంది. బుధవారం సాయంత్రం 5.27 గంటలకు ఈ ప్రక్రియ ప్రారంభమవుతుంది. సరిగ్గా 6.04 గంటలకు జాబిల్లి ఉపరితలంపై ల్యాండర్‌ను సురక్షితంగా దించడానికి ఇస్రో సైంటిస్టులు ఏర్పాట్లు పూర్తిచేశారు.

ఈ అపూర్వ ఘట్టాన్ని బుధవారం సాయంత్రం 5.20 నుంచే ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించవచ్చు. ల్యాండర్‌ మాడ్యూల్‌ చందమామను చేరుకొనే అద్భుత దృశ్యాల కోసం దేశ ప్రజలు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ‘జయహో భారత్‌.. జయహో ఇస్రో’ అంటూ సోషల్‌ మీడియాలో యువత నినాదాల హోరు ఇప్పటికే మొదలయ్యింది. ప్రపంచ దేశాలు చంద్రయాన్‌–3 ప్రయోగంపై ప్రత్యేక ఆసక్తి  ప్రదర్శిస్తున్నాయి.  
–సూళ్లూరుపేట(తిరుపతి జిల్లా)
 

70 కిలోమీటర్ల ఎత్తు నుంచి ఫొటోల చిత్రీకరణ ల్యాండర్‌ మాడ్యూల్‌లోని ల్యాండర్‌ పొజిషన్‌ డిటెక్షన్‌ కెమెరా(ఎల్‌పీడీసీ) కేవలం 70 కిలోమీటర్ల ఎత్తునుంచి 
చంద్రుడి ఉపరితలాన్ని ఈ నెల 19న చిత్రీకరించింది.ఈ ఫొటోలను ఇస్రో మంగళవారం విడుదల చేసింది.  

ఈ నెల 17న ప్రొపల్షన్‌ మాడ్యూల్‌ ల్యాండర్‌ మాడ్యూల్‌ను చంద్రుడికి దగ్గరగా విజయవంతంగా వదిలిపెట్టింది. 

చంద్రయాన్‌–3లో ఇప్పటిదాకా చేపట్టిన ప్రతి ఆపరేషన్‌ విజయవంతమైంది. ఇప్పటిదాకా ప్రతి ఆపరేషన్‌ విజయవంతం

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట నుంచి గత నెల 14న చంద్రయాన్‌–3 మిషన్‌ను ప్రయోగించింది. 

41 రోజుల ప్రయాణంలో ఐదుసార్లు భూమధ్యంతర కక్ష్యలో, మరో ఐదుసార్లు లూనార్‌ ఆర్బిట్‌(చంద్రుడి కక్ష్య)లో చంద్రయాన్‌–3 మిషన్‌ కక్ష్య దూరాన్ని 
పెంచుతూ వచ్చారు. 

...ఇక మిగిలింది ల్యాండర్‌ను చంద్రుడి 
ఉపరితలంపై క్షేమంగా దించడమే. ఇందుకోసం ఇస్రో శాస్త్రవేత్తలు అహర్నిశలూ శ్రమిస్తున్నారు.  

 సాఫ్ట్‌ ల్యాండింగ్‌ ఇలా..  
ప్రస్తుతం చంద్రుడి ఉపరితలం నుంచి 25గీ134 కిలోమీటర్ల ఎత్తులో కక్ష్యలో పరిభ్రమిస్తున్న ల్యాండర్‌ మాడ్యూల్‌ను సెకన్‌కు 1.68 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా చేసి బుధవారం సాయంత్రం 6.04 గంటలకు సురక్షితంగా దించనున్నారు. ఇందులో ఆఖరి 17 నిమిషాలు అత్యంత కీలకం. దీన్ని ‘17 మినిట్స్‌ ఆఫ్‌ టెర్రర్‌’ అని అభివర్ణిస్తున్నారంతే ఇదెంత ముఖ్యమో అర్థం చేసుకోవచ్చు. ఈ 17 నిమిషాల్లోనే ల్యాండర్‌ తనలోని ఇంజిన్లను తానే మండించుకుంటుంది.

సరైన సమయంలో ఇంజిన్లను మండించడం, సరైన పరిమాణంలో ఇంధనాన్ని వాడుకోవడం చాలా కీలకం. ల్యాండర్‌ మాడ్యూల్‌లో నాలుగు థ్రస్టర్‌ ఇంజిన్లు ఉన్నాయి. చంద్రుడి ఉపరితలం నుంచి 30 కిలోమీటర్ల ఎత్తుకు చేరుకున్న తర్వాత వీటిని మండించడం ప్రారంభమవుతుంది. దాంతో ల్యాండర్‌ వేగం క్రమంగా తగ్గిపోతుంది. తనలోని సైంటిఫిక్‌ పరికరాలతో ల్యాండింగ్‌ సైట్‌ను ల్యాండర్‌ మాడ్యూల్‌ గుర్తిస్తుంది. అడ్డంకులు ఏవైనా ఉంటే గుర్తిస్తుంది. ల్యాండింగ్‌ సైట్‌ చదునుగా ఉంటే బుధవారం ల్యాండింగ్‌ అవుతుంది. లేదంటే వాయిదా పడే అవకాశం లేకపోలేదు. వాయిదా పడితే ఈ నెల 27న సాఫ్ట్‌ ల్యాండింగ్‌ కోసం ప్రయత్నిస్తామని ఇస్రో స్పేస్‌ అప్లికేషన్స్‌ సెంటర్‌ డైరెక్టర్‌ నీలేశ్‌ దేశాయ్‌ చెప్పారు.

పరిస్థితులన్నీ అనూకూలించి, సాంకేతికపరంగా సహకారం అందితే సురక్షితంగా ల్యాండింగ్‌ అవుతుంది. ల్యాండర్‌ మాడ్యూల్‌ను నిరంతరం క్షుణ్నంగా పరిశీలిస్తున్నామని, ప్రస్తుతం చక్కగా పనిచేస్తోందని ఇస్రో మంగళవారం వెల్లడించింది. ల్యాండింగ్‌కు రెండు గంటల ముందు అవసరమైన కమాండ్‌లను ల్యాండర్‌లో ఇస్రో అప్‌లోడ్‌ చేస్తుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement