
సూళ్లూరుపేట: షార్ నూతన డైరెక్టర్‌గా ఆర్ముగం రాజరాజన్ ఆదివారం బాధ్యతలను స్వీకరించారు. ప్రస్తుతం డైరెక్టర్‌గా ఉన్న ఎస్.పాండ్యన్ ఆదివారం ఉద్యోగ విరమణ చేయనుండడంతో బాధ్యతలను ఆయనకు అప్పగించారు. విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్‌లో డిప్యూటీ డైరెక్టర్‌గా పనిచేస్తున్న రాజరాజన్‌ను షార్ డైరెక్టర్‌గా నాలుగు రోజుల క్రితమే బదిలీ చేసిన విషయం తెలిసిందే. ఆయన నాలుగు రోజులుగా షార్‌లోనే ఉంటూ పాండ్యన్‌తో కలిసి అన్ని విభాగాలను సందర్శించి అవగాహన చేసుకున్నారు. ఈ నెల 15న చంద్రయాన్–2 ప్రయోగం నిర్వహించనున్న దృష్ట్యా ఆయన ముందుగానే విచ్చేసి అన్ని విషయాలు తెలుసుకునే పనిలో నిమగ్నమయ్యారు. సోమవారం నుంచి ఆయన ఆధ్వర్యంలోనే చంద్రయాన్–2 పనులు జరుగుతాయి. ఉద్యోగ విరమణ చేసిన షార్ మాజీ డైరెక్టర్ ఎస్ పాండ్యన్ చంద్రయాన్–2 ప్రయోగం అయ్యేదాకా ఇక్కడే ఉంటారని షార్ అధికార వర్గాలు పేర్కొన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment