సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి ప్రయోగించనున్న ఇస్రో
సూళ్లూరుపేట(తిరుపతి జిల్లా): భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో), సెంటర్ నేషనల్ ఎట్యుడస్ స్పాటైలెస్ (సీఎన్‌ఈఎస్) అనే అంతరిక్ష సంస్థలు సంయుక్తంగా త్రిష్ణా (థర్మల్ ఇన్‌ఫ్రా–రెడ్ ఇమేజింగ్ శాటిలైట్ ఫర్ హై రిజల్యూషన్ నేచురల్ రిసోర్స్ అసెస్‌మెంట్) అనే భూ పరిశీలన ఉపగ్రహాన్ని ప్రయోగించేందుకు భారత్–ఫ్రాన్స్‌లు ఒప్పందం చేసుకున్నాయి.
ఈ విషయాన్ని బుధవారం ఇస్రో అధికారులు తెలిపారు. భూమి ఉపరితలంపై ఉష్ణోగ్రతలు, ఉద్గారత, బయో ఫిజికల్, రేడియేషన్, అధిక టెంపోరల్ రిజల్యూషన్ పర్యవేక్షణ కోసం ఇరు దేశాలు సంయుక్తంగా ఈ ఉపగ్రహాన్ని రూపొందిస్తున్నాయి. ఈ ఉపగ్రహంలో రెండు పెద్ద పేలోడ్స్‌ను అమర్చి పంపబోతున్నట్లు ఇస్రో తెలిపింది.
త్రిష్ణా ఉపగ్రహం రిమోట్ సెన్సింగ్ టెక్నాలజీలో గణనీయమైన పురోగతిని సూచిస్తుందని, క్లిష్టమైన నీరు, ఆహారభద్రత సమస్యల పరిష్కారానికి మార్గం సుగమం చేస్తుందని, ఇప్పటిదాకా ప్రయోగించిన రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాలు ఒక ఎత్తయితే త్రిష్ణా శాటిలైట్ మరో ఎత్తు అని ఇస్రో పేర్కొంది. ఈ ప్రయోగాన్ని సతీ‹Ù ధవన్ స్పేస్ సెంటర్ నుంచి ప్రయోగించనుంది.
Comments
Please login to add a commentAdd a comment