‘యాంకర్‌ గూబ గుయ్యిమనేలా కౌంటరిచ్చిన ఆనంద్‌ మహీంద్రా’ | Anand Mahindra Strong Counter To BBC Anchor Who Questioned About India Space Mission, Goes Viral - Sakshi
Sakshi News home page

Anand Mahindra Slams BBC Anchor: అంతరిక్ష ప్రయోగాలపై బీబీసీ యాంకర్‌ అనుచిత వ్యాఖ్యలు.. కౌంటర్‌ ఇచ్చిన ఆనంద్‌ మహీంద్రా

Published Thu, Aug 24 2023 3:55 PM | Last Updated on Thu, Aug 24 2023 4:05 PM

Anand Mahindra Slams Bbc Anchor - Sakshi

అంతరిక్ష ప్రయోగంలో (Chandrayaan-3) భారత్‌ విజయంపై బ్రిటీష్‌ మీడియా సంస్థలు జీర్ణించుకోలేకపోతున్నాయి. కనీస మౌలిక సదుపాయాలు లేని భారత్‌కు అంతరిక్ష ప్రయోగాల కోసం ఇంత భారీ మొత్తంలో ఖర్చు చేయడం అవసరమా? అంటూ డిబెట్‌లు పెట్టి ప్రశ్నిస్తున్నాయి. అలా ప్రశ్నించిన బీబీసీ యాంకర్‌కు ప్రముఖ వ్యాపార వేత్త ఆనంద్‌ మహీంద్రా గూబ గుయ్యిమనేలా కౌంటర్‌ ఇచ్చారు.

అంతరిక్ష ప్రయోగాల్లో భారత్‌ చరిత్ర సృష్టించింది. ప్రపంచ అంతరిక్ష ప్రయోగాల చరిత్రలో చంద్రుడి దక్షిణధ్రువంపై అడుగుపెట్టిన మొదటి దేశంగా భారత్‌ రికార్డుకెక్కింది. భూమి నుంచి చంద్రుడి దిశగా 41 రోజులపాటు సాగించిన తన ప్రయాణాన్ని చంద్రయాన్‌–3 మిషన్‌ ఘనంగా ముగించి.. 140 కోట్ల మంది భారతీయల హృదయాలను ఆనందంతోనూ ఒకింత విజయగర్వంతోనూ నింపింది. అయితే, భారత్‌ విజయాన్ని దాయాది దేశం పాకిస్తాన్‌, అమెరికా వంటి దేశాలు అభినందనలతో ముంచెత్తుతుంటే బ్రిటీష్‌ మీడియా సంస్థ బీబీసీ తన అక్కసు వెళ్లగక్కుకుంది. 

మరుగుదొడ్లే లేవు
700 మిలియన్ల మందికి కనీస మరుగదొడ్డి సదుపాయాలు లేవని.. అంతటి పేదరికంతో ఉన్న భారతదేశం.. అంతరిక్ష ప్రయోగానికి ఇంత మొత్తంలో ఖర్చు చేయాలా? అని ప్రశ్నిస్తూ బీబీసీ డిబేట్‌లు పెడుతోంది. అలా ఓ బీసీసీ యాంకర్‌ భారత్‌ విజయంపై అనుచిత వ్యాఖ్యలు చేసింది. దీనిపై భారతీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కోహినూర్‌ డైమండ్‌ను దోచుకొని 
బీబీసీ యాంకర్‌ డిబెట్‌ను షేర్‌ చేసిన ఆనంద్‌ మహీంద్రా ఇలా ట్వీట్‌ చేశారు. నిజం ఏంటంటే? పేదరికం దశాబ్దాల వలస పాలన ఫలితం. మా నుంచి అత్యంత విలువైన ఆస్తి కోహినూర్ వజ్రమే కాదు, మా నమ్మకాన్ని, శక్తి సామర్ధ్యాల్ని దోచుకున్నారు. అలాంటి మీరు మరుగుదొడ్లు, అంతరిక్ష అన్వేషణ పెట్టుబడులపై ప్రశ్నించడం మీ వైఖరికి అద్దం పడుతోంది. మేం చంద్రునిపైకి వెళ్లడం అంటే ఆత్మవిశ్వాసాన్ని పునరుద్ధరించేందుకు సహాయపడుతుంది. పరిశోధనా రంగంలో పురోగతిని సాధించేందుకు మాపై మాకు నమ్మకాన్ని కలిగిస్తుంది. పేదరికం నుండి బయటపడేయాలనే ఆకాంక్షను ఇస్తుంది. అసలు పేదరికం ఏంటంటే ఆకాంక్షల్లో కూడా పేదరికాన్ని కలిగి ఉండటమే’ అంటూ ఆనంద్‌ మహీంద్రా ధీటుగా  బదులిచ్చారు. ప్రస్తుతం, ఈ ట్వీట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 


చదవండి👉ఈ కారు కొంటే మీ ఇంటిని మీరు తగలబెట్టుకున్నట్లే’

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement