Kohinoor diamond
-
‘యాంకర్ గూబ గుయ్యిమనేలా కౌంటరిచ్చిన ఆనంద్ మహీంద్రా’
అంతరిక్ష ప్రయోగంలో (Chandrayaan-3) భారత్ విజయంపై బ్రిటీష్ మీడియా సంస్థలు జీర్ణించుకోలేకపోతున్నాయి. కనీస మౌలిక సదుపాయాలు లేని భారత్‌కు అంతరిక్ష ప్రయోగాల కోసం ఇంత భారీ మొత్తంలో ఖర్చు చేయడం అవసరమా? అంటూ డిబెట్లు పెట్టి ప్రశ్నిస్తున్నాయి. అలా ప్రశ్నించిన బీబీసీ యాంకర్‌కు ప్రముఖ వ్యాపార వేత్త ఆనంద్ మహీంద్రా గూబ గుయ్యిమనేలా కౌంటర్ ఇచ్చారు. అంతరిక్ష ప్రయోగాల్లో భారత్ చరిత్ర సృష్టించింది. ప్రపంచ అంతరిక్ష ప్రయోగాల చరిత్రలో చంద్రుడి దక్షిణధ్రువంపై అడుగుపెట్టిన మొదటి దేశంగా భారత్ రికార్డుకెక్కింది. భూమి నుంచి చంద్రుడి దిశగా 41 రోజులపాటు సాగించిన తన ప్రయాణాన్ని చంద్రయాన్–3 మిషన్ ఘనంగా ముగించి.. 140 కోట్ల మంది భారతీయల హృదయాలను ఆనందంతోనూ ఒకింత విజయగర్వంతోనూ నింపింది. అయితే, భారత్ విజయాన్ని దాయాది దేశం పాకిస్తాన్, అమెరికా వంటి దేశాలు అభినందనలతో ముంచెత్తుతుంటే బ్రిటీష్ మీడియా సంస్థ బీబీసీ తన అక్కసు వెళ్లగక్కుకుంది. మరుగుదొడ్లే లేవు 700 మిలియన్ల మందికి కనీస మరుగదొడ్డి సదుపాయాలు లేవని.. అంతటి పేదరికంతో ఉన్న భారతదేశం.. అంతరిక్ష ప్రయోగానికి ఇంత మొత్తంలో ఖర్చు చేయాలా? అని ప్రశ్నిస్తూ బీబీసీ డిబేట్లు పెడుతోంది. అలా ఓ బీసీసీ యాంకర్ భారత్ విజయంపై అనుచిత వ్యాఖ్యలు చేసింది. దీనిపై భారతీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కోహినూర్ డైమండ్‌ను దోచుకొని బీబీసీ యాంకర్ డిబెట్‌ను షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా ఇలా ట్వీట్ చేశారు. నిజం ఏంటంటే? పేదరికం దశాబ్దాల వలస పాలన ఫలితం. మా నుంచి అత్యంత విలువైన ఆస్తి కోహినూర్ వజ్రమే కాదు, మా నమ్మకాన్ని, శక్తి సామర్ధ్యాల్ని దోచుకున్నారు. అలాంటి మీరు మరుగుదొడ్లు, అంతరిక్ష అన్వేషణ పెట్టుబడులపై ప్రశ్నించడం మీ వైఖరికి అద్దం పడుతోంది. మేం చంద్రునిపైకి వెళ్లడం అంటే ఆత్మవిశ్వాసాన్ని పునరుద్ధరించేందుకు సహాయపడుతుంది. పరిశోధనా రంగంలో పురోగతిని సాధించేందుకు మాపై మాకు నమ్మకాన్ని కలిగిస్తుంది. పేదరికం నుండి బయటపడేయాలనే ఆకాంక్షను ఇస్తుంది. అసలు పేదరికం ఏంటంటే ఆకాంక్షల్లో కూడా పేదరికాన్ని కలిగి ఉండటమే’ అంటూ ఆనంద్ మహీంద్రా ధీటుగా బదులిచ్చారు. ప్రస్తుతం, ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. Really?? The truth is that, in large part, our poverty was a result of decades of colonial rule which systematically plundered the wealth of an entire subcontinent. Yet the most valuable possession we were robbed of was not the Kohinoor Diamond but our pride & belief in our own… https://t.co/KQP40cklQZ — anand mahindra (@anandmahindra) August 24, 2023 చదవండి👉‘ఈ కారు కొంటే మీ ఇంటిని మీరు తగలబెట్టుకున్నట్లే’ -
బ్రిటన్ ఎత్తుకెళ్లిన వస్తువులు.. సంపద ఎంతో తెలుసా?
సాక్షి, అమరావతి: బ్రిటిష్ సామ్రాజ్యం.. దాని కాలనీలు మన దేశం సహా ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి లెక్కలేనన్ని విలువైన కళాఖండాలను దోచుకెళ్లింది. 16వ శతాబ్దం చివరి నుంచి 20వ శతాబ్దం వరకు బ్రిటిష్ సామ్రాజ్యం ప్రపంచవ్యాప్తంగా తన కాలనీలు, వలస రాజ్యాలు, రక్షిత ప్రాంతాలను స్థాపించింది. బ్రిటన్‌లోని పలు మ్యూజియాలలో ప్రస్తుతం ప్రదర్శనలో ఉన్న అనేక సాంస్కృతిక కళాఖండాలు వలస రాజ్యాల ప్రజల నుంచి దోచుకున్నవే. వాటిని తిరిగి ఇచ్చేయాలని ఆ దేశాలు కోరుతున్నా.. బ్రిటన్ పట్టించుకోవడం లేదు. కోహినూర్ వజ్రం నుంచి బెనిన్ కాంస్యాలు, పారి్థనాన్ మార్బుల్స్ వంటి 8 మిలియన్లకుపైగా కళాఖండాలు బ్రిటిష్ మ్యూజియంలలో ఉన్నట్టు అంచనా. వాటిలో అత్యంత విలువైనవి కొన్ని ఇవే. టిప్పుసుల్తాన్ ఉంగరం ఈస్టిండియా కంపెనీతో 1799లో జరిగిన యుద్ధంలో టిప్పుసుల్తాన్ ఓడిపోయిన తర్వాత.. బ్రిటిష్ దళాలు సుల్తాన్‌ను చంపి ఆయన ఖడ్గం, బొమ్మ పులి, చేతి వేలి నుంచి ఉంగరాన్ని తీసుకెళ్లారు. సుల్తాన్ ఉంగరంపై దేవనాగరి లిపిలో రాముడి పేరు చెక్కి ఉండేది. ఖడ్గాన్ని భారతదేశానికి తిరిగి రప్పించారు. 41 గ్రాముల ఈ ఉంగరాన్ని 2014లో వేలం వేయగా.. అంచనా ధర కంటే పది రెట్లు ఎక్కువ ధర చెల్లించి ఒక వ్యక్తి కొనుగోలు చేశారు. టిప్పుసుల్తాన్‌కు చెందిన వేసవి రాజభవనం నుంచి తీసుకెళ్లిన బొమ్మ పులి ప్రస్తుతం విక్టోరియా ఆల్బర్ట్ మ్యూజియంలో ఉంది. కోహినూర్ వజ్రం ప్రపంచంలోనే అత్యంత విలువైన కోహినూర్ వజ్రాన్ని భారతదేశం నుంచి బ్రిటిషర్లు తీసుకుపోయారు. 105.6 క్యారెట్లు, 21.6 గ్రాముల బరువున్న కోహినూర్ వజ్రాన్ని ప్రస్తుత ఏపీలోని కొల్లూరు గనిలో సేకరించారు. మొఘల్ చక్రవర్తులు నెమలి సింహాసనంపై దీన్ని ఉంచేవారు. మొదట దీన్ని సేకరించినప్పుడు 793 క్యారెట్లతో ఉండేది. ఆ తర్వాత దాన్ని కట్ చేశారు. 1849లో బ్రిటిషర్లు దాన్ని విక్టోరియా రాణికి అప్పగించారు. ఆమె దాన్ని పలు సందర్భాల్లో తన కిరీటంపై ధరించేవారు. ప్రస్తుతం ఇది లండన్ టవర్‌కి చెందిన జ్యువెల్ హౌస్ మ్యూజియంలో ఉంది. కోహినూర్ ప్రపంచంలోనే పురాతన, అత్యంత ప్రసిద్ధ వజ్రాలలో ఒకటి. ఎల్గిన్ మార్బుల్స్ ఎల్గిన్ మార్బుల్స్ పురాతన గ్రీకు శిల్పాల సమాహారం. గ్రీస్‌లోని పార్థినాన్ నుంచి 1801–1805 సంవత్సరాల మధ్య బ్రిటిషర్లు ఎథీనా దేవతకు అంకితం చేసిన ఈ శిల్పాలను తీసుకెళ్లారు. ఈ శిల్పాలు గ్రీకుల గొప్పతనం, వారి వారసత్వం, చరిత్రను తెలుపుతాయి. 1453 నుండి దాదాపు 400 సంవత్సరాల పాటు ఒట్టోమన్ సామ్రాజ్యం గ్రీకును పాలించింది. ఆ సమయంలో బ్రిటిష్ రాయబారి లార్డ్ ఎల్గిన్, పారి్థనాన్ శిథిలాల నుంచి ఈ శిల్పాలను సేకరించి తీసుకెళ్లారని చెబుతారు. బ్రెజిల్ రబ్బరు విత్తనాలు బ్రెజిల్‌కే సొంతమైన హెవియా బ్రాసిలియెన్సిస్ (రబ్బరు చెట్టు) 70 వేల విత్తనాలను 1876లో బ్రిటిష్ యాత్రికుడు హెన్రీ విక్హామ్ దొంగిలించాడు. ఇది చరిత్ర గతిని మార్చిన ఘటనగా పేర్కొంటారు. బ్రెజిల్‌లోని శాంటారెమ్ ప్రాంతంలోని 140 అడుగుల ఎత్తుకు పెరిగిన రబ్బరు చెట్టు విత్తనాలవి. అప్పటివరకు రబ్బరు పరిశ్రమపై బ్రెజిల్‌కు ఉన్న ఆధిపత్యం ఈ ఘటనతో చెదిరిపోయింది. ఈ విత్తనాలు ప్రస్తుతం లండన్ మ్యూజియంలో ఉన్నాయి. రోసెట్టా స్టోన్ ఈజిప్టులోని రోసెట్టా ప్రాంతంలో దొరికిన పురాతన శాసనం ఇది. ఈజిప్టును పాలించిన టోలెమీ 196 బీసీలో నల్లటి బసాల్ట్ గ్రానైట్ రాయిపై ఈ శాసనాన్ని చెక్కించారు. మూడు విభిన్న ఈజిప్టియన్ భాషల్లో రాసిన ఈ శాసనం తన సామ్రాజ్యం, తాను చేసిన పనుల గురించి ఇందులో రాయించారు. 1799లో ఈ రాయిని కనుగొన్నారు. నెపోలియన్ బోనపార్టీ ఈజిప్టు నుంచి దీన్ని స్వా«దీనం చేసుకున్నారు. 1800 సంవత్సరంలో ఫ్రెంచ్ సైన్యం ఓడిపోయిన తర్వాత బ్రిటిషర్లు దీన్ని స్వా«దీనం చేసుకుని బ్రిటన్‌కు తరలించారు. ప్రాచీన ఈజిప్టు సామ్రాజ్యం, గ్రీకుల సంస్కృతి, వారసత్వం గురించి తెలిపే అత్యంత విలువైన శాసనంగా దీన్ని పరిగణిస్తారు. అందుకే దీన్ని తిరిగి ఇవ్వాలని ఈజిప్టు దేశం బ్రిటన్ను కోరినా పట్టించుకోలేదు. షాజహాన్ వైన్ జార్ మొఘల్ చక్రవర్తి షాజహాన్ వైన్ తాగే జార్‌ను కూడా బ్రిటిషర్లు తీసుకెళ్లి అక్కడి మ్యూజియంలో పెట్టుకున్నారు. తెల్లటి కప్పులా ఉండే ఈ జార్ దిగువ భాగంలో కమలం, ఆకులను పోలి ఉండేది. హ్యాండిల్‌పై కొమ్ము, గడ్డంతో ఉన్న జంతువు ఉండేది. 19వ శతాబ్దంలో ఈ అందమైన వైన్ జార్‌ను కల్నల్ చార్లెస్ సెటన్ గుత్రీ దొంగిలించి బ్రిటన్‌కు పంపినట్టు చెబుతారు. 1962 నుంచి ఇది లండన్‌లోని విక్టోరియా మ్యూజియంలో ఉంది. బెనిన్ కాంస్యాలు ఒకప్పటి బెనిన్ రాజ్యమే ఇప్పటి నైజీరియా. 1897లో బ్రిటిషర్లు బెనిన్‌పై దాడిచేసి ఆ నగరాన్ని దోచుకుంది. అక్కడి రాజ భవనంలో ఉన్న చారిత్రాత్మక వస్తువులు, 200కిపైగా కాంస్య ఫలకాలు ఇప్పుడు బ్రిటిష్ మ్యూజియంలో ఉన్నాయి. 1960లో స్వాతంత్య్రం పొందినప్పటి నుంచి నైజీరియా పలుసార్లు ఈ కాంస్యాలను తిరిగి ఇవ్వాలని కోరినా ఫలితం లేదు. ఇది కూడా చదవండి: ఒక ఇమ్రాన్.. రెండు కేసులు -
‘కోహినూర్‌ను బ్రిటన్ దొంగిలించింది’
బ్రిటన్ రాజకుటుంబ కథనాలంటే ఇప్పటికీ ఆసక్తికరమే. పైగా ప్రిన్స్ హ్యారీ దూకుడుగా వెలువరించిన ‘స్పేర్’ చదవడానికి మరింత ఆకర్షణీయం. తల్లి డయానా నాటకీయ మరణం నుంచి ఇప్పటికీ కోలుకోలేకపోవడాన్నీ, తానొక ‘స్పేర్’గా ఊరికే అలా పక్కనుండాల్సిన స్థితినీ రాశాడు. అలాగే అనేక ఇబ్బందికర విషయాలను పంచుకున్నాడు. అయితే కోహినూర్ వజ్రం గురించిన హ్యారీ ఆలోచనలు మాత్రం భారతీయులకు సంతోషం కలిగిస్తాయి. బ్రిటన్ రాకుమారుడు హ్యారీ రాసిన ‘స్పేర్’ పుస్తకం చదివినప్పుడు మనకు కొట్టొచ్చినట్టు కనబడేది దాన్ని రాసిన విధానమే. శైలి బిగువుగా, ఉద్రిక్తభరితంగా, ఒక్కోసారి అసంగతంగానూ ఉంటుంది. చెప్పాలంటే ఒక థ్రిల్లర్‌లా ఉంటుంది. కాబట్టే ఇది చదవడానికి ఆకర్షణీయంగా ఉంది. అయితే ఇందులోని భాషలో లోతు తక్కువ. విషయం వదులుగా ఉన్నప్పుడు, ముఖ్యంగా ఈటన్ స్కూల్, అఫ్గానిస్తాన్‌లలో హ్యారీ గడిపిన సమయాల గురించి వివ రిస్తున్నప్పుడు పైపైన సాగుతుంది. అప్పుడు నిస్సారంగా ఉండి, చికాకు కలిగిస్తుంది కూడా. తప్పనిసరిగా కనబడేవి మరో రెండు అంశాలు. తన తల్లి (డయానా) నాటకీయ మరణం కలిగించిన వేదన నుంచి హ్యారీ బయటపడలేదు. ఈ పుస్తకం మొత్తంగా ఇదే మానసిక స్థితి కొన సాగు తుంటుంది. అయితే ఇది అర్థం చేసుకోదగినదే. అర్థం కానిదల్లా ఏమి టంటే, తానొక ‘స్పేర్’(అలా పక్కన అందుబాటులో ఉండటం)గా ఉండాల్సిన వాస్తవం గురించి ఇంకా సమాధాన పడక పోవడమే. 38 సంవత్సరాల వయస్సులో కూడా ఏ హోదా లేదు. తన సోదరుడు విలి యమ్‌తో బాంధవ్యంపై ఇది స్పష్టమైన ప్రభావం చూపుతూ వచ్చింది. ఈ కారణంగానే స్కూల్లో విల్లీ (విలియమ్‌ను హ్యారీ ఇలాగే పిలు స్తాడు) తన పట్ల పట్టనట్టుగా ఉన్నాడని హ్యారీ నమ్మకం. పుస్తకంలోని మూడో అంశం ఏమిటంటే – రాజ కుటుంబానికీ, వెంటాడే ఫొటోగ్రాఫర్లకూ (పాపరాజ్జీ) మధ్య సాగిన అంతులేని పోరాటం. ‘‘ఎప్పుడూ ఫిర్యాదు చేయవద్దు, ఎప్పుడూ వివరణ ఇవ్వ వద్దు’’ అనేది రాజ కుటుంబ నినాదంగా ఉండేది. హ్యారీ ఈ విషయంలో ఒకడుగు ముందుకేసినట్టుగా కనిపిస్తుంది. పబ్‌లో రాత్రంతా గడిపిన తర్వాత తన కారు డిక్కీలో దాక్కునే వాడినని చెప్పాడు. డయానా కూడా అలాగే చేసివుంటుందని హ్యారీ అంటాడు. ఈ పుస్తకం చాలా విషయాలను వెల్లడిస్తుంది. వాటిలో చాలా వరకు తీవ్రమైనవి, కొన్ని మనోహరమైనవి. బాక్సర్ షార్ట్స్‌లో శీర్షాస నాలు వేసే అతడి తండ్రి, బ్రిటన్ రాజు చార్లెస్ ‘డార్లింగ్ బాయ్’ అని హ్యారీని పిలుస్తారు. ఇక విలియమ్ అతడిని ‘హెరాల్డ్’ అంటాడు. కానీ అలా ఎందుకంటాడో పుస్తకంలో ఎక్కడా ఉండదు. అయితే, ‘‘నాతో వ్యవహరించినప్పుడల్లా ఏ మార్పూ లేకుండా’’ అదే ‘‘సుపరి చితభ్రుకుటి’’ అని మాత్రం చెబుతాడు. ఇక బాల్మోరల్ రాజమందిరంలో పిల్లలుగా ఉన్నప్పుడు, క్వీన్ విక్టోరియా విగ్రహాన్ని ఎప్పుడు దాటు కుని వెళ్లినా వారు ప్రతిసారీ వంగి నమస్కరించేవారు. ఈ పుస్తకంలోని చాలా వివరాలు అనవసరం. పైగా అవి ఇబ్బంది కలిగిస్తుంటాయి. వాటన్నింటినీ హ్యారీ ఎందుకు పంచు కున్నాడని మీరు ఆశ్చర్యపడతారు కూడా. ఉదాహరణకు, హ్యారీ తనకు తడి అయిందనీ (స్ఖలనం), దాన్ని దాచిపెట్టడానికి సముద్రంలోకి దూకేశాననీ చెబుతాడు. మేగన్ మెర్కెల్‌తో తన తొలి డేట్‌కు కొద్ది గంటల ముందు అలా జరిగింది. రాజకుటుంబీకులు, వారి స్కాటిష్ సంప్రదాయాలకు కాలం చెల్లిపోయిందని అనిపించే ఒక కథనం ఆశ్చర్యం కలిగిస్తుంది. హ్యారీ తొలిసారి ఒక మగజింకను కాల్చినప్పుడు అతడి గైడ్ అయిన శాండీ ఆ మృతకళేబరపు చర్మాన్ని చీల్చి, యువరాజు హ్యారీని మోకాళ్లపై కూర్చో బెట్టి, అతడి తలను అందులోకి దూర్చాడట. ‘‘దీంతో ఉదయం నేను తిన్న ఫలహారం కడుపులోంచి బయటకు వచ్చేసింది’’ అని హ్యారీ రాస్తాడు. ‘‘నేను దేన్నీ వాసన పీల్చలేకపోయాను. ఎందుకంటే నేను శ్వాస పీల్చలేకపోయాను’’ అని చెబుతాడు. ‘‘నా నోరు, ముక్కు పూర్తిగా రక్తంతో, పేగులతో నిండిపోయాయి. ఒక తీవ్రమైన అసౌక ర్యపు వెచ్చదనం’’ అని చెబుతాడు. ఈ ఆచారం ముగియగానే, హ్యారీ ముఖంపై పడిన జింక రక్తాన్ని తుడవవద్దని శాండీ చెప్పాడట. ‘‘దాన్ని అలాగే ఎండిపోనీ, కుర్రాడా, అలాగే ఎండిపోనీ!’’ అన్నాడట. బ్రిటిష్ రాజకుటుంబంలో ఇద్దరు సభ్యులను హ్యారీ అంగీకరించలేకపోయాడు. ఒకరు మార్గరెట్ (ఎలిజబెత్ రాణి చెల్లెలు). ఆమెను అతడు ఆంట్ మార్గో అని పిలుస్తాడు. ఒకసారి ఆమె క్రిస్మస్కు మామూలు బాల్‌పాయింట్ పెన్ ఇచ్చిందట. అయినా వాళ్లిద్దరూ కలిసి సాగాల్సి వుంది. ఎందుకంటే, హ్యారీ నొక్కిచెప్పినట్టుగా ఆమె కూడా తనలాగే ఒక స్పేర్. ఇక హ్యారీ అంగీకరించని మరొకరు కెమిల్లా. ఆమెను పెళ్లాడవద్దని హ్యారీ, విలియమ్ ఇద్దరూ తమ తండ్రి చార్లెస్‌కి చెప్పారు. ఆమెను ‘ప్రమాదకారి’గా హ్యారీ పరిగణిస్తాడు. తన ఇమేజ్ను పెంచుకునే క్రమంలో ఆమె మీడియాకు పలు కథనాలు బహిర్గతం చేశారంటాడు. రెండు విషయాలు నన్ను ఆశ్చర్యపరిచాయి. ఈ పుస్తకంలో దోడీ ఫయీద్ పేరు ఎక్కడా ప్రస్తావనకు రాలేదు. అతడిని హ్యారీ అంతటా ‘మమ్మీ బాయ్‌ఫ్రెండ్’ అనే రాశాడు. ఇంకా తనకు ‘పాకీ’ అంటే జాతి వివక్షా పదమనీ, అవమానించినట్టనీ తెలియదని పేర్కొన్నాడు. అంతిమంగా, గూర్ఖాల పట్ల హ్యారీకి ఉన్న ఆత్మీయతకు భార తీయ పాఠకులు సంతోషపడతారు. లెఫ్టినెంట్ వేల్స్ అని హ్యారీని సంబోధించడానికి వారు ఇష్టపడేవారు కాదు. ఎల్లప్పుడూ ‘సాబ్’ అనేవారు. ‘‘రాజరికం పట్ల వాళ్లకు గంభీరమైన పూజ్యభావం ఉంది. వారి దృష్టిలో రాజు అంటే దైవం. కాబట్టి రాజకుమారుడు కూడా దైవా నికి మరీ దూరం కాదు’’. ఇక కోహినూర్ వజ్రాన్ని బ్రిటన్ కలిగివుండటంలోని న్యాయ సమ్మతిని హ్యారీ ప్రశ్నించడం మన ప్రభుత్వానికి సంతోషం కలిగించే విషయం. ‘‘బ్రిటిష్ సామ్రాజ్యం తన ఉచ్చదశలో దాన్ని స్వాధీనం చేసుకుంది. ఇంకో ఆలోచన, దొంగిలించింది’’ అని అంటూ ఇలా కొన సాగిస్తాడు. ‘‘అది శాపగ్రస్తమైందని నేను విన్నాను.’’ కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
Rishi Sunak: సార్.. కోహినూర్!
బ్రిటన్ ప్రధాని పీఠంపై చిన్న వయసులో.. అదీ తొలి శ్వేతజాతీయేతరుడిగా రిషి సునాక్ పగ్గాలు అందుకున్నారు. భారత మూలాలు ఉన్న వ్యక్తి, పైగా మన దేశపు అల్లుడు కావడంతో ఇక్కడి నుంచి కూడా హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ క్రమంలో.. మీమ్స్ వడ్డన మామూలుగా ఉండడం లేదు. రెండు రోజులుగా కొనసాగుతూనే ఉంది. ప్రముఖ భారత క్రికెటర్ అశిష్ నెహ్రా.. రిషి సునాక్ కవలలు అంటూ మొదలైన మీమ్స్ ఫెస్టివల్.. ఇవాళ అధికారికంగా ఆయన ప్రధానిగా నియామకం అయిన తర్వాత కూడా కొనసాగుతూనే ఉంది. ఇక ఆయనకు భారతీయులు ట్విటర్ ద్వారా చేసిన తొలి విజ్ఞప్తి.. కోహినూర్ వజ్రాన్ని ఎలాగైనా భారత్‌కు పంపించాలని. అలాగే.. వలసవాదులను వలసరాజ్యంగా మార్చేసి.. పాలించబోతున్నారంటూ మరో సెటైర్ పేలుస్తున్నారు. ఇక యూకే ప్రధాని అధికారిక భవనం 10 డౌనింగ్ స్ట్రీట్ డోర్లకు దండలు, ఆ బయట చెప్పులు విడిచేసి ఉండడం, కాపలాగా వాచ్మెన్ ఉండడం.. ఇలా దేశీ టచ్‌ను మీమ్స్‌కు జత చేసి హిలేరియస్ ఫన్ను పుట్టిస్తున్నారు. మరోవైపు రిషి సునాక్ ప్రధాని అయ్యాడు కాబట్టి.. ఇడ్లీ, వడ, చట్నీ, కాఫీ.. మెనూలో చేరతాయని జోకులు పేలుస్తున్నారు. ఇక పాక్‌కు బర్నల్ పంపాల్సిన అవసరం ఉందంటూ మరొకరు ట్వీట్ చేశారు. ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి, ఆయన భార్య సుధామూర్తి గనుక అల్లుడి ఇంటికి వెళ్తే.. 10 డౌనింగ్ స్ట్రీట్ కాస్త తీన్ మూర్తి భవనం(రిషి సునాక్ భార్య అక్షతా మూర్తితో కలిపి) అవుతుందని జోకులు పేలుస్తున్నారు. Meanwhile in UK :) pic.twitter.com/nnOuU2b0FQ — Switty (@Switty2020) October 25, 2022 If NRN and Sudha move into Dus Number, perhaps it can be called Teen Murti Bhavan — Abhishek Singhvi (@DrAMSinghvi) October 24, 2022 Our first mission is to bring back our ' Kohinoor '. let's goo #Sunak #Kohinoor pic.twitter.com/UvEwXp6cjt — Teju (@tejasflyingmac) October 24, 2022 As #RishiSunak is about become UK PM ,India to send trucks full of Burnol to Pakistan pic.twitter.com/GSm3qbI3O3 — 𝒮𝒽𝒶𝒾𝓁𝑒𝓈𝒽_𝐼𝒩𝒟 भारत🇮🇳 (@Shailesh__IND) October 24, 2022 Meanwhile in UK 😀 pic.twitter.com/JxYC7Qz14k — Porinju Veliyath (@porinju) October 25, 2022 Congratulations Rishi Sunak! The new PM of Britain pic.twitter.com/JWhLJVTwMA — Syed Zain Raza (@SydZainRaza) October 25, 2022 -
‘కోహినూర్’పై బకింగ్‌హామ్ ప్యాలెస్ సమీక్ష.. భారత్‌కు అప్పగిస్తారా?
లండన్: బ్రిటన్ మహారాణి ధరించే కిరీటంపై ఉండే 105 క్యారెట్ల కోహినూర్ వజ్రాన్ని తిరిగి భారత్‌కు అప్పగించాలని ఎప్పటి నుంచో డిమాండ్లు ఉన్నాయి. క్వీన్ ఎలిజబెత్ 2 మరణానంతరం ఆ డిమాండ్లు మరింత పెరిగాయి. ఈ క్రమంలోనే క్వీన్ కెమెల్లా పార్కర్ బౌల్స్, కింగ్ ఛార్లెస్ 3 పట్టాభిషేకంపై ప్రధానంగా చర్చ జరుగుతోంది. అయితే, కోహినూర్ డైమండ్‌ను ధరించటం ద్వారా వలస పాలన కాలం నాటి చేదు జ్ఞాపకాలను గుర్తు చేసినట్లవుతుందని బీజేపీ హెచ్చరికల నేపథ్యంలో బకింగ్‌హామ్ ప్యాలెస్‌లో చర్చ జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. 2023, మే 6న జరగనున్న పట్టాభిషేకంలో క్వీన్ కామెల్లా.. కోహినూర్ వజ్రం ఉన్న కిరీటాన్ని ధరించాలా వద్దా అనే అంశంపై బకింగ్‌హామ్ ప్యాలెస్ అధికారులు పునఃసమీక్షిస్తున్నట్లు వార్తా సంస్థ టెలిగ్రాఫ్ పేర్కొంది. అత్యంత విలువైన కోహినూర్ వజ్రం భారత్‌కు చెందిందని, దానిని వినియోగించటాన్ని బీజేపీ వ్యతిరేకిస్తూ వస్తోంది. ‘పట్టాభిషేకంలో రాణి కెమెల్లా కోహినూర్ డైమండ్‌ను ధరించటం ద్వారా వలస పాలన నాటి చేదు జ్ఞాపకాలు గుర్తుకువస్తాయి. గత పాలన జ్ఞాపకాలను భారతీయులు ఇప్పుడిప్పుడే చెరిపివేస్తున్నారు. ఐదు శతాబ్దాలకుపైగా 5-6 తరాల భారతీయులు విదేశీ పాలనలో మగ్గిపోయారు. ఇటీవలి సందర్భాలైన క్వీన్ ఎలిజబెత్ 2 మరణం, క్వీన్ కెమెల్లా పట్టాభిషేకంలో కోహినూర్ పై చర్చ జరిగి బ్రిటీష్ పాలనలోకి భారతీయులను తీసుకెళ్లింది.’ అని బీజేపీ అధికార ప్రతినిధి ఒకరు టెలిగ్రాఫ్ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. మరోవైపు.. రాణి కిరీటం నుంచి కోహినూర్ వజ్రాన్ని తొలగించి దాని స్థానంలో మరో వజ్రాన్ని ఏర్పాటు చేసి ఉపయోగించాలని భావిస్తున్నట్లు వాదనలు వినిపిస్తున్నాయి. బ్రిటన్‌లోని ప్రవాస భారతీయుల వీసా అంశంపై యూకే హోంశాఖ మంత్రి బ్రేవర్‌మ్యాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన క్రమంలో భారత్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. భారత్-యూకే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం(ఎఫ్టీఐ)పైనా నీలినీడలు కమ్ముకున్నాయి. ఇదీ చదవండి: రాజుగా చార్లెస్ ప్రమాణం -
క్వీన్ ఎలిజబెత్–2 మృతి.. కోహినూర్ అంశం మళ్లీ తెరపైకి.. హక్కుదారు ఎవరు?
న్యూఢిల్లీ: క్వీన్ ఎలిజబెత్–2 మరణంతో కోహినూర్ అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. 105 క్యారెట్ల అత్యంత విలువైన ఈ వజ్రాన్ని వెనక్కి ఇచ్చేయాలంటూ భారత్‌లో పెద్ద ఎత్తున డిమాండ్లు వినిపిస్తున్నాయి. కోహినూర్‌ను ఇకనైనా స్వదేశానికి అప్పగించాలంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. కోహినూర్ అంటే వెలుగుల కొండ అని అర్థం. 14 శతాబ్దం ఆరంభంలో దక్షిణ భారతదేశంలో తవ్వకాల్లో లభించినట్లు చరిత్రలో నమోదయ్యింది. తర్వాత పలువురు రాజులు, చక్రవర్తుల చేతులు మారుతూ వచ్చింది. చివరకు బ్రిటిష్ రాణి కిరీటంలోకి చేరింది. కోహినూర్ తమదేనంటూ భారత్, పాకిస్తాన్, ఇరాన్, అఫ్గానిస్తాన్ దేశాలు వాదిస్తున్నాయి. వజ్రానికి అసలు హక్కుదారులు ఎవరన్నదానిపై శతాబ్దాలుగా వివాదం కొనసాగుతోంది. ఇప్పుడు బ్రిటన్ రాణి మృతిచెందారంటూ కాబట్టి కోహినూర్‌ను భారత్‌కు అప్పగించాలని ట్విట్టర్లో జనం డిమాండ్ చేస్తున్నారు. బ్రిటన్ నూతన రాజుగా చార్లెస్ సింహాసనాన్ని అధిష్టించబోతున్నారు. కోహినూర్ వజ్రం పొదిగిన కిరీటాన్ని రాణి హోదాలో ఆయన భార్య కెమిల్లా పార్కర్ ధరిస్తారు. కోహినూర్ వెనక్కి రప్పించడానికి ప్రయత్నిస్తామని కేంద్రం గతంలో ప్రకటించింది. -
'అంచనాలకు మించి.. అదే చేత్తో కోహినూర్ వజ్రాన్ని'
కామన్వెల్త్ గేమ్స్ 2022లో భారత క్రీడాకారులు అంచనాలు మించి రాణిస్తున్నారు. ఇంతకముందు మనకు ఎన్నడూ రాని విభాగాల్లోనూ పతకాలు కొల్లగొడుతున్న ఆటగాళ్లు.. అచ్చొచ్చిన క్రీడల్లో స్వర్ణ పతకాలతో చెలరేగుతున్నారు. తొమ్మిది రోజులు ముగిసేసరికి భారత్ ఖాతాలో 40 పతకాలు ఉండగా.. అందులో 13 స్వర్ణాలు, 11 రజతాలు, 16 కాంస్యాలు ఉన్నాయి. కాగా ఇందులో 22 పతకాలు కేవలం రెండు క్రీడల్లోనే రావడం విశేషం. రెజ్లింగ్‌లో 12 పతకాలు రాగా.. వెయిట్‌లిఫ్టింగ్ విభాగంలో 10 పతకాలు వచ్చి చేరాయి. ఇంకో విశేషమేమిటంటే.. రెజ్లింగ్ విభాగంలో మనవాళ్లు 12 మంది పోటీ పడితే.. 12 మంది పతకాలు తేవడం విశేషం. అందులో భజరంగ్ పూనియా, రవి దహియా, వినేష్ పొగాట్, దీపక్ పూనియాలు స్వర్ణాలు గెలిచారు. ఇక పదోరోజు కూడా భారత్ ఖాతాలో దండిగానే పతకాలు వచ్చి చేరనున్నాయి. మరి సోమవారంతో ముగియనున్న కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ ఎన్ని పతకాలు కొల్లగొడుతుందనేది వేచి చూడాలి. కాగా కామన్వెల్త్లో భారత క్రీడాకారుల ప్రదర్శనపై మాజీ ఆటగాళ్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. పతకాల కోసం పోటీ పడడం ఆనందాన్ని కలిగిస్తుందంటూ కామెంట్స్ చేశారు. ఈ నేపథ్యంలోనే టీమిండియా మాజీ క్రికెటర్ వసీం జాఫర్ చేసిన ఒక ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ''కామన్వెల్త్ గేమ్స్‌లో భారత అథ్లెట్లు అద్బుత ప్రదర్శన కనబరుస్తున్నారు. అంచనాలకు మంచి రాణిస్తూ పతకాల పంట పండిస్తున్నారు. అదే చేత్తో బ్రిటీష్ వాళ్లు పట్టుకెళ్లిన మన కోహినూర్ వజ్రాన్ని కూడా తీసుకురండి'' అంటూ కామెంట్ చేశాడు. కామన్వెల్త్ గేమ్స్‌తో పాటు వెస్టిండీస్ గడ్డపై రోహిత్ సేన టి20 సిరీస్ గెలవడంపై కూడా జాఫర్ ట్వీట్ చేశాడు.''విదేశీ గడ్డపై మరో సిరీస్ గెలిచినందుకు రోహిత్ సేనకు కంగ్రాట్స్. జట్టులో ఆటగాళ్లందరు ఒకరినొకరు సహకరించుకుంటూ బ్యాట్, బంతితో ఆల్‌రౌండ్ ప్రదర్శన చేసి ఆకట్టుకున్నారు. వెల్డన్'' అంటూ ట్వీట్ చేశాడు. ఇక టీమిండియా ఇవాళ విండీస్‌తో చివరి టి20 మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్‌ను విజయంతో ముగించి సిరీస్‌ను 4-1తో కైవసం చేసుకోవాలనే యోచనలో ఉంది. Indian athletes are doing so well at the Commonwealth Games that at this rate they might even bring the Kohinoor back 😄 #CWG2022 #IndiaAt75 — Wasim Jaffer (@WasimJaffer14) August 6, 2022 Congratulations @ImRo45 and Team India on another series win 👏🏽 Total team effort with both bat and ball with almost everyone contributing. #WIvIND — Wasim Jaffer (@WasimJaffer14) August 6, 2022 DISTINGUISHED WRESTLER VINESH🥇 Watch moments from the medal ceremony. Our champ @Phogat_Vinesh Looked fantastic with 🥇 Proud of you Girl! #Cheer4India#India4CWG2022@PMOIndia @ianuragthakur @NisithPramanik @CGI_Bghm @ddsportschannel @SonySportsNetwk @IndiaSports pic.twitter.com/8mocOYGxj9 — SAI Media (@Media_SAI) August 7, 2022 🇮🇳's Dhakad youth wrestler Naveen' s confidence is worth the applaud 👏 Watch moments from his medal🥇 ceremony 👇 Congratulations 👏 #Cheer4India#India4CWG2022@PMOIndia @ianuragthakur @NisithPramanik @IndiaSports @YASMinistry @CGI_Bghm pic.twitter.com/44XpKWcXYk — SAI Media (@Media_SAI) August 7, 2022 PLAYING FOR G🥇LD!!#Tokyo2020 Olympian and Gold🥇 Medalist at #B2022, @ravidahiya60 steals the show🤩 Watch his winning moment🏅 from yesterday's match👇#Cheer4India🇮🇳#India4CWG2022 🤟@PMOIndia @ianuragthakur @NisithPramanik @CGI_Bghm @IndiaSports @YASMinistry pic.twitter.com/oaZK41S6zr — SAI Media (@Media_SAI) August 7, 2022 చదవండి: చరిత్రకు అడుగుదూరంలో.. ఫైనల్లో తలపడనున్న భారత్, ఆస్ట్రేలియా CWG 2022: స్వర్ణంతో మెరిసిన భవీనాబెన్ పటేల్ -
కోహ్లి కోహినూర్ తీసుకురావా!
లండన్ : ప్రపంచకప్ ఆరంభానికి ముందు యునైటెడ్ కింగ్డమ్(యూకే) క్వీన్ ఎలిజబెత్‌ను టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి మర్యాదపూర్వకంగా కలిశారు. బకింగ్‌హామ్ ప్యాలెస్‌లో గురువారం జరిగిన ఈ ప్రత్యేక కార్యక్రమంలో కోహ్లితో పాటు ఇతర జట్ల కెప్టెన్లు క్వీన్ ఎలిజబెత్‌ను కలిసారు. వారందరికీ ఆమె ‘బెస్ట్ విషెస్’ చెప్పారు. ప్రిన్స్ హ్యారీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ భేటీ విషయాన్ని తెలియజేస్తూ సంబంధించిన ఫొటోలను రాయల్ ప్యాలెస్, బీసీసీఐలు ట్విటర్లో అభిమానులతో పంచుకున్నాయి. అయితే ఎలిజబెత్‌ను కోహ్లి కలవడంపై భారత అభిమానులు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. ‘కోహ్లి ఎలిజబెత్‌ను కలిస్తే కలిసావు.. కానీ మన కోహినూర్ వజ్రం వారి దగ్గరే ఉంది. అది తీసుకురా’ అంటూ సెటైర్లేస్తున్నారు. ఇక ఎలిజబెత్, కోహ్లి మధ్య జరిగిన సంభాషణలను హాస్యంగా మలుస్తూ మీమ్స్ ట్రెండ్ చేస్తున్నారు. ‘ ఎలిజబెత్: బేటా ఏం కావాలి నీకు? కోహ్లి: కోహినూర్ కావాలి’ అనే క్యాప్షన్స్తో కామెంట్ చేస్తున్నారు. ప్రపంచంలోనే అత్యంత విలువైన వజ్రంగా పేరుగాంచిన కోహినూర్ వజ్రం భారత్‌కు చెందినది. కాకతీయుళు ఈ వజ్రాన్ని చేయించారని చరిత్ర చెబుతోంది. దీన్ని బ్రీటీష్ వాళ్లు తీసుకుపోవడంతో ప్రస్తుతం ఇది రాణి కిరిటంలో ఒదిగి ఉంది. దీన్ని సొంతం చేసుకున్న రాజులంతా రాజ్యాలు కోల్పోయారని, రాణులు మాత్రం తమ రాజ్యాలను విస్తరింపజేశారనే ప్రచారం ఉంది. ఈ కారణంగా కోహినూర్ వజ్రం ఆడవారికి అదృష్టం, మగవారికి అరిష్టమనే ప్రచారం సాగుతుంది. ప్రపంచంలోని వజ్రాలలోకెల్లా కాంతివంతమైన కోహినూర్‌ను తిరిగి ఇవ్వాల్సిందిగా భారత ప్రభుత్వం విజ్ఞప్తి చేసినప్పటికీ ఫలితం కనిపించలేదు. ప్రపంచకప్ సమరం గురువారం ఇంగ్లండ్-దక్షిణాఫ్రికాతో ఆరంభం కాగా.. భారత్ జూన్ 5న అదే దక్షిణాఫ్రికాతో సౌతాంప్టన్ వేదికగా తొలి మ్యాచ్ ఆడనుంది. ఇప్పటికే రెండు సార్లు(1983, 2011) ఈ మెగా టైటిల్ సొంతం చేసుకున్న టీమిండియా.. మూడోసారి కప్పును ముద్దాడాలని ఉవ్విళ్లూరుతోంది. -
కోహినూర్ వజ్రం మనకు దక్కేనా?
మన చరిత్ర, సంస్కృతి కాపాడుకోవడంలో మన ఘనత ఏమిటి? మన తాతలు తాగిన నేతుల కథలు చెప్పి మూతుల వాసన చూడమంటున్నామే గాని, ఆ ఘనత చాటే సాక్ష్యాలను దోచుకుపోతుంటే ఏమీ చేయలేకపోతున్నామా? అని ఓ పౌరుడు ఆర్టీఐలో ప్రశ్నించాడు. కోహినూర్ వజ్రం, సుల్తాన్‌గంజ్ బుద్ధుడు, నాసాక్ వజ్రం, టిప్పు సుల్తాన్ ఖడ్గం, ఉంగరం, మహారాజా రంజీత్ సింగ్ బంగారు సింహాసనం, షాజహాన్ మద్యపాత్ర, అమరావతి నిర్మాణ వస్తువులు, వాగ్దేవి చలువరాతి బొమ్మ, టిప్పు సుల్తాన్ దాచుకున్న యాంత్రిక పులి బొమ్మ వంటి విలువైన వస్తువులను విదేశీ పాలకులు మన దేశం నుంచి తరలించుకుపోయారని, వాటిని రప్పించే ప్రయత్నాలు ఎంతవరకు సత్ఫలితాలు ఇచ్చాయో తెలపాలని ప్రధానమంత్రి కార్యాలయాన్ని కోరుతూ రాజమండ్రికి చెందిన బీకే ఎస్ఆర్ అయ్యంగార్ ఆర్టీఐ దరఖాస్తు దాఖలు చేశారు. ప్రధాని కార్యాలయం ఆ పత్రాన్ని వెంటనే పురావస్తు శాఖకు బదిలీ చేసింది. కళాఖండాల ఖజానా చట్టం ప్రకారం 1972 తరువాత దేశం నుంచి తస్కరించిన పురాతన వస్తువులను తెప్పించేందుకు చర్యలు తీసుకోవలసి ఉంటుంది గాని అంతకుముందు స్మగ్లింగ్ అయిన వస్తువులు, వాటి తరలింపుపై తాము ఏ చర్యలూ తీసుకోలేమని ఏఎస్ఐసీపీఐఓ తెలిపారు. దేశం నుంచి తరలించుకుపోయిన 25 ప్రాచీన వస్తు వులను తిరిగి రప్పించగలిగామని, దరఖాస్తుదా రుడు అడిగిన కోహినూర్ వంటి అత్యంత విలువైన వస్తువుల గురించి తామే చర్యలు తీసుకోలేమని జవాబు ఇచ్చారు. తనకు కావలసిన సమాచారం ఇవ్వలేదని కమిషన్ ముందు రెండో అప్పీలు దాఖలు చేశారు. స్వాతంత్య్రానికి ముందే తరలి పోయిన కోహి నూర్ వజ్రం, టిప్పు ఖడ్గం వంటి చారిత్రక వార సత్వ చిహ్నా లను స్వదేశం రప్పించే అధికారం, వన రులు ఏఎస్ఐ శాఖలకు లేవని తనకు తెలుసనీ, అందుకే ప్రధాని కార్యాల యాన్ని సమాచారం అడిగానని, దానికి సమాధానం చెప్పకుండా, అధికారాలు లేని పురావస్తు శాఖకు బదిలీ చేయడం అన్యాయమని అయ్యంగార్ విమర్శించారు. కోహి నూర్ వజ్రం తిరిగి తెప్పించాలని కోరుతూ అఖిల భారత మానవ హక్కులు, సాంఘిక న్యాయం ఫ్రంట్ ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టులో దాఖలు చేసింది. తమకు ప్రజల భావాలు తెలుసనీ, కనుక కోహినూర్ వజ్రాన్ని సాధించడానికి భారత విదేశాంగ శాఖ ప్రయత్నిస్తోందని, బ్రిటన్ ప్రభు త్వంతో సంప్రదింపులను కొనసాగిస్తుందని సుప్రీం కోర్టుకు సర్కారు విన్నవించింది. సుప్రీంకోర్టులో హామీ ఇచ్చి రెండు రోజులు దాటకముందే ప్రభు త్వం మాట మార్చింది. బ్రిటిష్ రాణికి బహుమతిగా ఇచ్చిన కోహినూర్ వజ్రాన్ని తిరిగి ఇవ్వాలని అడ గడం సాధ్యం కాదని తెలిపింది. గత ప్రభుత్వాల వాదన ప్రకారం కోహినూర్ విదేశీ పాలకులు దొంగి లించిన వస్తువు కాదని 1956లో ప్రధాని నెహ్రూ వజ్రాన్ని తిరిగి ఇమ్మని కోరడానికి ఏ ఆధారాలూ లేవని, అయినా డిమాండ్ చేయడం వల్ల అనేక ఇబ్బందులు తలెత్తుతాయని అన్నారని ప్రభుత్వ పక్షాన లాయర్లు వాదించారు. వాటిని వెనక్కి రప్పిం చడానికి ఏ చర్యలు తీసుకున్నారో చెప్పాలని దాఖ లైన ఆర్టీఐ దరఖాస్తును పురావస్తు శాఖకు బదిలీ చేయడానికి బదులు ప్రధాన మంత్రి కార్యాలయమే జవాబు ఇవ్వాలని కేంద్ర సమాచార కమి షనర్ కోరారు. దేశం నుంచి తరలిపోయిన పదో శతాబ్దపు దుర్గా మాత విగ్రహాన్ని జర్మన్ చాన్స్‌లర్ ఏంజెలా మెర్కెల్ సంపాదించి 2015లో ప్రధాని నరేంద్రమో దీకి బహూ కరించారు. 900 ఏళ్ల పురాతన కీరవాణి సాలభంజిక సంపాదించి 2015 ఏప్రి ల్లో కెనడా ప్రధాని ఇచ్చారు. ఆస్ట్రేలియా ప్రధాని టోనీ ఆబట్ 2014లో భారత పర్యటనకు వచ్చినపుడు తమ దేశపు ఆర్ట్ గ్యాలరీల్లో ఉన్న హిందూ దేవతామూర్తులను మన ప్రధానికి అంద జేశారు. టవర్ ఆఫ్ లండన్‌లో ఉన్న కోహినూర్ వజ్రాన్ని రప్పించడానికి తీసుకోవలసిన చర్యల గురించి ప్రధానమంత్రి 2016లో ఉన్నతాధికారు లతో సమావేశం నిర్వహించారని వార్తలువచ్చాయి. ఈ సమాచారం ప్రధాని కార్యాలయంలో ఉంటుంది కానీ పురావస్తు సర్వే సంస్థ దగ్గర ఉండదు. ముందుగా ప్రధాని కార్యాల యాన్ని ఈ సమాచారం కోరితే, వాటిని రప్పించే అధికారం లేదని తెలిసి కూడా వారు ఈ దరఖాస్తును పురావస్తుశాఖకు బదిలీ చేయడం సమంజసం కాదు. హోం మంత్రిత్వ శాఖ లేదా విదేశాంగశాఖ ఈ విషయమై తీసుకున్న చర్యలు, వాటి ఫలితాల గురించి ప్రధాని కార్యాల యమే తెలపాలని కమిషన్ భావించింది. ఈ విధంగా దరఖాస్తులు బదిలీ చేసే ముందు కాస్త ఆలోచించాలి. (బీకేఎస్‌ఆర్ అయ్యంగార్ వర్సెస్ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా కేసులో 2018 ఆగస్టు 20న సీసీఐ ఇచ్చిన ఆదేశం ఆధారంగా). మాడభూషి శ్రీధర్ వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్ professorsridhar@gmail.com -
ఆ కలర్ వెనుక ఓ కథ
హోప్ డైమండ్.. అత్యంత అరుదైన నీలి రంగు వజ్రం!! భూమ్మీద ఉన్న కోటీ 38 లక్షల వజ్రాల్లో ఇలాంటివి 0.02 శాతమే ఉన్నాయి! ఆంధ్ర, తెలంగాణ సరిహద్దుల్లో పుట్టి.. ఎన్నో చేతులు మారి అమెరికా చేరిన ఈ వజ్రం.. ఓ అద్భుతం.. అపురూపం కూడా! వజ్రాలు ఎలా ఏర్పడతాయో మీకు తెలుసా? మొక్కలు నేలలో పెరిగితే.. వజ్రాలు రాళ్లలో పెరుగుతాయి! భూమి లోతుల్లోంచి బయటకొచ్చిన కొన్ని కర్బన స్ఫటికాలు అక్కడి ఒత్తిడి, పీడనాల కారణంగా వజ్రాలుగా రూపుదిద్దుకుంటాయి. ఇప్పటివరకూ దొరికిన వజ్రాల్లో అత్యధికం తెల్ల రంగువే. కొన్ని ఇతర రంగుల వజ్రాలు ఉన్నా.. నీలం రంగుతో కూడినవి అత్యంత అరుదైనవని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భూమి లోపల సుమారు 660 కిలోమీటర్ల లోతులో మాత్రమే ఇవి ఏర్పడే అవకాశం ఉందని నేచర్ పత్రికలో ప్రచురితమైన తాజా పరిశోధన వ్యాసం తెలియజేస్తోంది. ఇంకోలా చెప్పాలంటే తెల్ల వజ్రాలతో పోలిస్తే నాలుగు రెట్లు ఎక్కువ తవ్వితేగానీ నీలి రంగు వజ్రాలు దొరకవన్నమాట! ఇంకో విషయం.. వజ్రాలకు నీలి రంగు ఎలా అబ్బుతోందన్న విషయం ఈ పరిశోధన వెలువడేంత వరకూ ఎవరికీ తెలియదు! నీలి రంగు వచ్చేదిలా... వజ్రాలు రాళ్లల్లో పెరిగే క్రమంలో తమ పరిసరాల్లోని కొన్ని ఖనిజాలను తమలోకి కలిపేసుకుంటాయి. నీలి వజ్రాల విషయంలో ఖనిజం ‘బోరాన్’! చిత్రమైన విషయం ఏమిటంటే.. బోరాన్ భూమి ఉపరితలంపై, సముద్రపు నీటిలో మాత్రమే లభిస్తుంది. మరి భూమిలోతుల్లో పుట్టే వజ్రాలకు బోరాన్ ఎలా అంటిందన్న అంశంపై అమెరికన్ జెమలాజికల్ సొసైటీ శాస్త్రవేత్త ఇవాన్ ఎం.స్మిత్ పరిశోధనలు ప్రారంభించారు. హోప్ డైమండ్ లాంటి 46 నీలి వజ్రాలను పరిశీలించారు. ఈ క్రమంలో వీటిల్లో బోరాన్తోపాటు కాల్షియం సిలికేట్ వంటి కొన్ని ఇతర ఖనిజాలు కూడా ఉన్నట్లు స్పష్టమైంది. ఇవన్నీ అత్యధిక పీడనం ఉండే ప్రాంతాల్లో మాత్రమే ఏర్పడేందుకు అవకాశమున్నవి కావడం గమనార్హం. భూమిలోపలి నుంచి వజ్రాలు ఉపరితలానికి వచ్చే క్రమంలో కాల్షియం సిలికేట్ వంటి ఖనిజాలు పేలిపోయేంత స్థాయిలో అస్థిరమయ్యాయని స్మిత్ తెలిపారు. వీటన్నింటినీ పరిశీలించినప్పుడు... ఈ రకమైన ఖనిజాలు భూమి పొరల మధ్య మాత్రమే ఏర్పడగలవని స్మిత్ అంచనా వేశారు. సముద్ర అడుగుభాగం.. భూమి లోపలి పొర (మాంటెల్) కలిసే చోటే నీలి రంగు వజ్రాలు ఏర్పడేందుకు అవకాశముందన్నమాట! కాలక్రమంలో ఇవి భూకంపాలు, అగ్ని పర్వతాల పేలుళ్ల కారణంగా పైపొరల్లోకి చేరి ఉంటాయని, సముద్రపు నీటిలోని బోరాన్ చేరడంతో వజ్రాలకు నీలి రంగు వచ్చి ఉంటుందని స్మిత్ అంచనా. కొల్లూరు గని వజ్రం.. ‘హోప్’ హోప్ డైమండ్ కొల్లూరు గనుల్లో పుట్టిందని చరిత్ర చెబుతోంది. క్రీస్తు శకం 16–19వ శతాబ్దాల మధ్య ఇక్కడ తవ్వకాలు పెద్ద ఎత్తున జరిగాయి. ప్రపంచ ప్రఖ్యాత కోహినూర్ వజ్రం కూడా ఈ గనుల్లోనే దొరికిందని అంచనా. ప్రస్తుతం నిర్మాణమవుతున్న పులిచింతల ప్రాజెక్టు ముంపు ప్రాంతంలో 50 అడుగుల లోతులో ఉండేవి ఈ గనులు. అప్పట్లో గోల్కొండ నవాబుల అధీనంలో ఉన్న కొల్లూరు గనుల్లో ఒకదశలో ముప్ఫై వేల మంది పనిచేసేవారు. అయితే నవాబులు ఈ గనులను వజ్రాల వ్యాపారులు, విశ్వకర్మల కుటుంబాలకు లీజుకిచ్చేశారు. వజ్రాల అమ్మకాల్లో 2 శాతం కమిషన్, పది క్యారెట్ల కంటే ఎక్కువ బరువు ఉన్న వజ్రాలు తమకే చెందాలన్నది నవాబులు విధించిన లీజు షరతు! అలా నవాబుల చేతికి చిక్కిన భారీ వజ్రం ఒకదాన్ని 1666 సంవత్సరంలో ఫ్రాన్స్ వజ్రాల వ్యాపారి జీన్ బాప్టీస్ ట్రావెర్నర్ కొనుగోలు చేసి తన పేరు పెట్టుకున్నాడు. ట్రావెర్నర్ ఈ వజ్రానికి సానబెట్టే ప్రయత్నం చేసినప్పుడు దాంట్లోని నీలి రంగు వెలుగు చూసిందని చరిత్ర చెబుతోంది. 1668 సంవత్సరంలో ట్రావెర్నర్ ఈ నీలి వజ్రాన్ని కింగ్ లూయిస్‌కు అమ్మేశాడు. కొంత కాలం తరువాత ఇది గల్లంతైంది. 1791లో దీన్ని మళ్లీ ముక్కలు చేశారు. అతిపెద్ద ముక్కకు ‘హోప్’అని పేరు పెట్టారు. 1839లో హోప్ పేరున్న బ్రిటీష్ బ్యాంకింగ్ కుటుంబం తమ వద్ద ఉన్న విలువైన వజ్రాల జాబితాలోకి దీన్ని చేర్చింది. హోప్ కుటుంబం నుంచి ఇది చాలాసార్లు చేతులు మారింది. 1958 సంవత్సరంలో హ్యారీ విన్స్టన్ అనే అమెరికన్ వ్యాపారి దీన్ని వాషింగ్టన్ నేషనల్ మ్యూజియం ఆఫ్ నేచురల్ హిస్టరీకి దానమిచ్చారు. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
కోహినూర్ తెచ్చేందుకు ఏం చేశారు?
సాక్షి, న్యూఢిల్లీ: ప్రఖ్యాత పురాతన, అమూల్యమైన వస్తువులను తిరిగి భారత్‌కు తెప్పించే విషయమై తీసుకున్న చర్యలేమిటో తెలపాలంటూ ప్రధాన మంత్రి కార్యాలయం (పీఎంవో), విదేశాంగశాఖను కేంద్ర సమాచార కమిషన్ (సీఐసీ) ఆదేశించింది. ప్రపంచ ప్రసిద్ధి గాంచిన కోహినూర్ వజ్రం, సుల్తాన్‌గంజ్ బుద్ధ, నాసక్ వజ్రం, టిప్పు సుల్తాన్ ఖడ్గం, ఉంగరం, పులి బొమ్మ, మహారాజా రంజిత్‌సింగ్ బంగారు సింహాసనం, షాజహాన్ వినియోగించిన మరకత గ్లాసు, సరస్వతి విగ్రహం తదితరాలను భారత్‌కు తిరిగి తెప్పించేందుకు తీసుకున్న చర్యలేంటో చెప్పాలని సమాచార హక్కు చట్టం కార్యకర్త బీకేఎస్‌ఆర్ అయ్యంగార్ దరఖాస్తు చేశారు. దీన్ని భారత పురావస్తు శాఖ (ఏఎస్ఐ)కు బదిలీ చేశారు. స్పందించిన ఏఎస్ఐ.. విలువైన వస్తువులను తిరిగి తెప్పించే అంశం తమ పరిధిలోనిది కాదని బదులిచ్చింది. అక్రమ మార్గాల్లో విదేశాలకు తరలించిన అమూల్యమైన వస్తువులను మాత్రమే తిరిగి స్వదేశానికి తీసుకువచ్చేందుకు తమ శాఖ కృషి చేస్తుందని, బ్రిటిష్ కాలంలో తరలిపోయిన వస్తువులను తిరిగి తెచ్చే అధికారం తమకు లేదని సమాధానమిచ్చింది. ఈ విషయం తెలిసి కూడా పీఎంవో, విదేశాంగ శాఖ.. ఆర్టీఐ దరఖాస్తును ఏఎస్ఐకి ప్రతిపాదించడంపై సీఐసీ కమిషనర్ మాడభూషి శ్రీధర్ ఆచార్యులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజల మనోభావాలతో ముడిపడి ఉన్న వారసత్వ సంపదను తిరిగి తీసుకురావాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందన్నారు. -
కోహినూర్ వజ్రం రక్తచరిత్ర
ఇంగ్లండ్ : కోహినూర్ వజ్రం గురించి మనం తరతరాలుగా వింటున్నాం. వాస్తవానికి ‘కో–హి–నూర్’ అనే పేరు పర్షియన్ పేరు. దీని అర్థం కాంతి శిఖరం అని. 105 క్యారెట్లు, అంటే 21 గ్రాముల బరువు కలిగిన ఈ వజ్రం ప్రస్తుతం బ్రిటీష్ రాణి ఎలిజబెత్–2 ఆధ్వర్యంలో లండన్ టవర్‌లో భద్రంగా ఉంది. దక్షిణ భారత దేశం నుంచి ఇంగ్లండ్ వెల్లిన ఈ వజ్రం మాదంటే మాదంటూ భారత్, పాకిస్తాన్, అఫ్ఘానిస్తాన్, చివరకు తాలిబన్లు కూడా వాదిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు దగ్గరి ఖిల్లా నుంచి, కాదు హైదరాబాద్‌లోని గోల్కొండ ఖిల్లా నుంచి కోహినూర్ వజ్రం ఇంగ్లండ్‌కు చేరిందనే వాదనలు కూడా బలంగానే ఉన్నాయి. రాజసానికి, దర్పాణికి ప్రతీకగా నిలిచిన ఈ వజ్రం చరిత్ర సమస్తం రణరంగ రక్తసిక్తమే. ఈ వజ్రం ధరించడం వల్ల మంచి జరిగిన సందర్భాలు కనిపించవుగానీ చెడు జరిగిన సందర్భాలే చరిత్రలో ఎక్కువగా ఉన్నాయి. కోహినూర్ వజ్రాన్ని ఇంగ్లండ్‌కు నౌకలో తీసుకొస్తుండగా, ఆ నౌకలో కలరా వ్యాపించింది. ఆ నౌకను రోగులతో సహా సముద్రం ఒడ్డులో వదిలేశారు. కోహినూర్ వజ్రాన్ని కలిగి ఉన్న బ్రిటీష్ అధికారి, మరికొందరు సిబ్బంది క్షేమంగా ఇంగ్లండ్‌కు చేరుకున్నారు. కోహినూర్ ఇంగ్లండ్ గడ్డపైకి వచ్చిన రోజునే రాణి విక్టోరియాపై హత్యాయత్నం జరిగింది. ఆమె తలపై బలమైన గాయం అయింది. అప్పటి ప్రధాన మంత్రి రాబర్ట్ పీల్ ప్రమాదవశాత్తు గుర్రం మీది నుంచి కింద పడి మరణించారు. చరిత్రలో కోహినూర్ ఎక్కడ పుట్టిందో తెలియజేసే ఆధారాలు ఇప్పటికీ లభించలేదు. దక్షిణ భారత దేశంలోని ఓ గుడిలోని దేవత కంటిలో ఈ కోహినూర్ వజ్రం ఉండేదని, ఆ కంటిలో నుంచి తీసుకరావడం వల్లనే కోహినూర్ వజ్రం వల్ల చెడు జరుగుతుందన్న వాదనలు ఉన్నాయి. అయితే వాటికి చారిత్రక ఆధారాలు లేవు. క్రీస్తు పూర్వం ఆసియాలో రాజులు, సంస్థానదీషుల వద్దనే కాకుండా కులీనవర్గ ప్రజలకు ఎక్కువగా వజ్రాలను ఉంగరాల్లో ధరించే అలవాటు ఉండేది. కోహినూర్ గురించి తొలి ప్రస్థావన క్రీస్తు శకం 1547లో ఉంది. షాజహాన్ వద్దకు.... తాజ్‌మహల్‌ను నిర్మించిన షాజహాన్ వద్దకు కోహినూర్ వజ్రం 1656లో చేరింది. ఆయన మగ నెమలి సింహాసనాన్ని తయారు చేయించి అందులో దీన్ని అమర్చారు. ఎవరు ఎత్తుకుపోకుండా ఆ సింహాసనానికి నపుంసకుల రక్షణ పెట్టారు. ఆ తర్వాత ఆయన్ని కుమారులే బంధించి కారాగారంలో పెట్టారు. ఆ కారాగారంలోనే ఆయన మరణించారు. ఆ తర్వాత సింహాసనాన్ని అధిష్టించిన ఆయన కుమారులు కూడా అధోగతి పాలయ్యారు. 1739లో ఢిల్లీపై పర్షియన్ రాజులు దండయాత్రలు జరిపారు. అప్పుడు రొడ్లవెంట రక్తం ఏరులై పారింది. 700 ఏనుగులు, 4000 ఒంటెలు, 12000 గుర్రాలపై మొఘల్ రాజుల సంపదనను ఇరాన్‌లోని టెహరాన్‌కు పర్షియన్ రాజులు తరలించారు. నాదర్ షా వద్దకు... ఈ యుద్ధంలో ఓడిపోయిన మొఘల్ చక్రవర్తి మొహమ్మద్ షా నుంచి పర్షియన్ రాజు నాదర్ షా వద్దకు కోహినూర్ వజ్రం వచ్చి చేరింది. ఆయన దాన్ని తన కిరీటంలో పెట్టుకున్నారు. ఆయన బతికుండగానే ఆయన కుమారుడి రెండు కళ్లను పీకి వాటిని పళ్లెంలో పెట్టి శత్రువులు నాదర్ షాకు పంపించారు. ఆ తర్వాత నాదర్ షా హత్యకు గురయ్యారు. కోహినూర్ వజ్రం చేతులుమారి అఫ్ఘానిస్తాన్‌లోని కాందహార్‌కు చేరుకుంది. నాదర్ షా మనమడు ఆ వజ్రాన్ని తిరిగి సాధించే ప్రయత్నంలో ప్రాణాలు కోల్పోయారు. మొఘల్ చక్రవర్తి అహ్మద్ షా వద్దకు... ముఘల్ చక్రవర్తి అహ్మద్ షా వద్దకు 1750వ దశకంలో కోహినూర్ వజ్రం చేరింది. ఆయనకు కొంతకాలానికే ముఖంపైనా క్యాన్సర్ పుండు వచ్చింది. 1772 ప్రాంతంలో ఆయన శత్రువుల చేతుల్లో మరణించారు. అదే సమయంలో ఆయన ఈ వజ్రాన్ని ఓ గోడ సందులో దాచారట. అది ఓ అఫ్ఘాన్ అంగరక్షకుడి ద్వారా కాబూల్‌కు వెళ్లింది. అక్కడ ఓ వజ్రాల హారం ద్వారా కోహినూర్ వజ్రం మహారాజ రంజిత్ సింగ్ వద్దకు 1839లో చేరింది. కొన్ని రోజులకే ఆయన హత్యకు గురయ్యారు. బ్రిటీష్ పాలకుల చేతుల్లోకి... ఆ తర్వాత పదేళ్లకు బ్రిటీషర్లు పంజాబ్‌పై దాడిచేసి దాన్ని స్వాధీనం చేసుకున్నారు. అప్పుడు కోహినూర్ వజ్రం చాలా విలువైందనే ప్రచారం ఉండింది. అప్పుడు బ్రిటీష్ రాణి విక్టోరియాకు ప్రాతినిధ్యం వహిస్తున్న డల్హౌజ్కు చెందిన బ్రిటిష్ అధికారి చేతికి చేరింది. ఆయన దాన్ని ఇంగ్లండ్ తీసుకెళ్లారు. అక్కడ బ్రిటీష్ మ్యూజియంలో దీన్ని 1851లో ప్రదర్శించారు. అప్పటికీ కోహినూర్ వజ్రం వన్నె చాలా తగ్గిపోయింది. దాంతో విక్టోరియా రాణి దానికి సానపట్టించారు. ఫలితంగా వజ్రం అసలు బరువులో 42 శాతం తరగుపోయింది. ఆమె తన పారిస్ పర్యటన సందర్భంతో మొదటిసారి దీన్ని ధరించారు. ఆ తర్వాత పలు సందర్భాల్లో ధరించారు. ఆమె మరణించే ముందు కింగ్ చార్లెస్ ప్రమాణ స్వీకారం సందర్భంగా వారి భార్యలైన రాణులు మాత్రమే దీన్ని ధరించాలని వీలునామా రాశారు. ఎలిజబెత్ రాణి వ్యక్తిగతంగా ఇంతవరకు దీన్ని ధరించిన సందర్భాలు కనిపించలేదు. అందుకనే ఆమె ఇంతకాలం బతికి ఉన్నారనే వాదన ఉంది. ఇక ఎలజబెత్ కుమారుడు కింగ్ చార్లెస్‌కు త్వరలో పట్టాభిషేకం జరుగుతుందని, ఈ సందర్భంగా ఆయన రెండో భార్య కమెల్లా ఈ కోహినూర్ వజ్రపు కిరీటాన్ని ధరిస్తారన్న ప్రచారం ఉంది. ఈ ర క్త చరిత్ర వెలుగులోకి వచ్చాక కూడా ఆమె దీన్ని ధరించేందుకు సాహసిస్తారా లేదా చూడాలి. (గమనిక: కోహినూర్ వజ్రం ప్రస్తావన ఉన్న వివిధ చరిత్ర పుస్తకాలు, పత్రాలను పరిశీలించి రచయితలు విలియం డాల్రింపుల్. అనితా ఆనంద్ రాసిన ‘కోహినూర్–ది హిస్టరీ ఆఫ్ ది వరల్డ్ మోస్ట్ ఇన్‌ఫేమస్ డైమండ్ పుస్తకంలోని అంశాల ఆధారంగా ఈ వార్తాకథనం. ఈ పుస్తకం 17 పౌండ్లకు అంతర్జాతీయ మార్కెట్లో లభిస్తోంది). -
కోహినూర్‌ను వెనక్కి తెమ్మనలేం
ప్రఖ్యాతిగాంచిన కోహినూర్ వజ్రాన్ని బ్రిటన్ నుంచి వెనక్కి తెమ్మని, దాన్ని వేలం వేయకుండా ఆపాలని తాము ఆదేశాలు జారీ చేయలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. విదేశాల్లోని ఆస్తులకు సంబంధించి తాము ఆదేశాలివ్వలేమంది. కోహినూర్ వజ్రాన్ని వెనక్కు తెచ్చేలా ఆదేశాలు జారీ చేయాలంటూ దాఖలైన పిటిషన్‌ను చీఫ్ జస్టిస్ జేఎస్ ఖేహర్ నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం కొట్టివేసింది. ఈ పిటిషన్‌ను ఓ ఎన్జీవో సంస్థ గత ఏడాది దాఖలు చేసింది. విచారణ సందర్భంగా.. అమెరికా, యూకేల్లోని ఆస్తులపై వ్యాజ్యాలు దాఖలు చేయడమేమిటో అంటూ ధర్మాసనం ఆశ్చర్యం వ్యక్తం చేసింది. కేంద్రం సమర్పించిన అఫిడవిట్‌ను ప్రస్తావిస్తూ కోహినూర్ విషయంలో భారత ప్రభుత్వం ప్రయత్నాలు కొనసాగిస్తోందని తెలిపింది. -
‘కోహినూర్ వజ్రం’ పిల్ తిరస్కరణ
న్యూఢిల్లీ : ప్రపంచ ప్రఖ్యాత కోహినూర్ వజ్రాన్ని బ్రిటన్ నుంచి తీసుకు వచ్చేలా కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు శుక్రవారం తోసిపుచ్చింది. కోహినూర్‌ను తిరిగి దేశానికి తెప్పించాల్సిన బాధ్యత తమది కాదని న్యాయస్థానం అభిప్రాయపడింది. ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాల విషయంలో తాము ఎలాంటి జోక్యం చేసుకోమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అంతేకాకుండా కోహినూర్ వజ్రాన్ని తిరిగి ఇచ్చేయాలని తాము ఆ దేశాన్ని ఆదేశించలేమని తెలిపింది. కాగా కోహినూర్ తోపాటు టిప్పుసుల్తాన్ ఉంగరం, కత్తి వంటి అమూల్యమైన వారసత్వ సంపదను తిరిగి భారత్‌కు రప్పించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని ఆలిండియా హ్యూమన్ రైట్స్, సోషల్ జస్టిస్ ఫ్రంట్ సంస్థలు ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు వేశాయి. దీనిని విచారణకు చేపట్టిన న్యాయస్థానం గతంలో కేంద్రం సమాధానం కోరిన సంగతి తెలిసిందే. దీనిపై కేంద్ర ప్రభుత్వం గతంలో కూడా కోహినూర్ వజ్రాన్ని భారత్ కు తిరిగి ఇవ్వాల్సిందిగా యునైటెడ్ కింగ్డమ్ను బలవంతపెట్టలేమని, ఆ వజ్రాన్ని బ్రిటన్ దొంగలించడం కానీ, బలవంతంగా తీసుకుపోవడంగానీ చేయలేదని, ఆ దేశానికి కానుకగా ఇచ్చామని న్యాయస్థానానికి విన్నవించింది. అయితే కోహినూర్ వజ్రాన్ని తీసుకు వచ్చేలా ఆదేశించాలంటూ మరోసారి దాఖలైన ఈ పిటిషన్‌ను చీఫ్ జస్టిస్ జేఎస్ ఖేహర్ బెంచ్ ఇవాళ తిరస్కరించింది. -
అమ్మ ఒక వజ్రం
అమ్మ (జయలలిత) ఒక వజ్రం అని సూపర్‌స్టార్ రజనీకాంత్ కొనియాడారు. దివంగత ముఖ్యమంత్రి ఇక లేరన్న వార్త తమిళప్రజల గుండెల్ని గాయపరచింది.సినీలోకాన్ని అంతగా గుండెల్ని పిండింది. అమ్మ భౌతికకాయానికి జాతి, మతం, తన పర భేదాల్లేకుండా దేశ ప్రజలందరూ నివాళులర్పించారు. అమ్మ మళ్లీ తిరిగి రావాలని గుండెలోతుల్లోంచి ఆకాంక్షించారు. కాగా దక్షిణ భారత నటీనటుల సంఘం ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం స్థానిక కోడంబాక్కంలోని శ్రీరాఘవేంద్ర కల్యాణ మండపంలో నిర్వహించిన సంతాప సభలో చిత్ర పరిశ్రమ అంతా కన్నీటి అంజలి తెలిపింది. సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో సహా పలువురు ప్రముఖులు అమ్మతో తమ అనుబంధాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఎన్నికల్లో అమ్మకు వ్యతిరేకించాను అమ్మకు అంజలి ఘటించిన అనంతరం రజనీకాంత్ మాట్లాడుతూ 1996 శాసనసభ ఎన్నికల్లో తాను జయలలితకు వ్యతిరేకంగా నిలిచానన్నారు. ఆ విషయం తనను ఇప్పటికీ వెక్కిరిస్తూనే ఉందన్నారు. ఆ తరువాత తన కూతురు ఐశ్వర్య తన వివాహాన్ని పోయస్గార్డెన్లోనే జరుపుకోవాలని కోరుకుందన్నారు. దీంతో పొరుగునే ఉన్న జయలలితను పెళ్లికి ఆహ్వానించకుండా ఎలాగని భావించి ఆమెను కలవడానికి అనుమతి కోరగా వెంటనే అనుమతించారన్నారు.తాము పెళ్లి పత్రికను అందించి ఆహ్వానించి మీ సమక్షంలో వివాహం జరగాలని కోరామన్నారు. అదే తేదీన పార్టీ సమావేశం ఉందని.. అయినా దాన్ని వాయిదా వేయించి పెళ్లికి వస్తాననీ హామీ ఇచ్చారన్నారు. చెప్పినట్లుగానే జయలలిత ఐశ్వర్య పెళ్లికి వచ్చారనీ గుర్తు చేసుకున్నారు. పురుషాధిక్యాన్ని ఎదురొడ్డి తన సొంత ప్రయత్నాలతోనే అమ్మ పోరాడి గెలిచారనీ పేర్కొన్నారు. ఈత,ఎదురీత జయలలిత నుంచే నేర్చుకోవాలని సూచించారు. నటిగానూ, రాజకీయంగానూ తన గురువు, ఆరాధ్యదైవం ఎంజీఆర్ కంటే సాధికురాలు జయలలిత అని పేర్కొన్నారు. తమిళనాట పురట్చితలైవిగా ఎదిగి ప్రజల గుండెల్లో అమ్మగా స్థిరస్థాయిగా నిలిపోయారన్నారు. ఇప్పుడు కోహినూర్ వజ్రంగా మెరీనా తీరంలో నిక్షిప్తమయ్యారనీ ఆయన పేర్కొన్నారు. నడిగర్‌సంఘం అధ్యక్షుడు నాజర్, విశాల్, కార్తీ, శివకుమార్, వడివేలు, మోహన్, కార్తీక్, రాజేశ్, ఆర్వీ.ఉదయకుమార్, జీవా, నటి సచ్చు, సంగీత, గీత, రాధ, అంబిక, రాజశేఖర్, జీవిత, రోహిణితో పాటు పలువురు చిత్ర ప్రముఖులు పాల్గొన్నారు. -
కోహినూర్‌పై వివరాలు అందించలేం: కేంద్రం
న్యూఢిల్లీ: కోహినూర్ వజ్రాన్ని తిరిగి తీసుకురావడానికి తీసుకుంటున్న చర్యల సమాచారాన్ని అందించలేమని కేంద్రం పేర్కొంది. లండన్‌లోని బ్రిటన్ రాణి కిరీటంలో ఉన్న వజ్రాన్ని భారత్‌కు తిరిగి తీసుకురావడంలో కేంద్రం చేస్తున్న ప్రయత్నాలపై సమాచార హక్కు చట్టం కింద వచ్చిన ఓ దరఖాస్తుపై ప్రభుత్వం ఈ అభిప్రాయం వెల్లడించింది. ఈ అంశం సుప్రీం కోర్టు పరిధిలో ఉన్నందున ఎటువంటి సమాచారాన్ని అందించలేమని పురావస్తు శాఖ పేర్కొంది. -
కోహినూర్ దేనికి ప్రతీక?!
యాదృచ్ఛికమే కావొచ్చుగానీ...బ్రిటన్ రాణి ఎలిజెబిత్ 90వ పుట్టినరోజు జరుపు కుంటున్న సమయంలోనే అత్యంత విలువైన, అపురూపమైన కోహినూర్ వజ్రంపై మన దేశంలో పెను దుమారం మొదలైంది. ప్రస్తుతం బ్రిటన్ అధీనంలో ఉన్న ఆ వజ్రాన్ని వెనక్కు ఇవ్వమని అడగటం సాధ్యం కాదని సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభు త్వం తెలియజేయడం ఈ దుమారానికి మూలం. ‘బ్రిటన్ పాలకులు దాన్ని బలవం తంగా గానీ, దొంగిలించిగానీ తీసుకెళ్లలేదు. బహుమతిగా పొందారు. కనుక తిరిగి వ్వాలని అడగలేం’అని కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ చెప్పింది. ఈ విషయంలో వెల్లువెత్తిన ఆగ్రహావేశాలను గమనించి 24 గంటలు గడవక ముందే కేంద్రం తన వైఖరిని మార్చుకుంది. ‘సామరస్య ధోరణి’లో దాన్ని తెచ్చేందుకు అన్ని ప్రయత్నాలూ చేస్తామని తెలిపింది. ఆ వజ్రం పొదిగివున్న బ్రిటన్ మహారాణి కిరీటం ప్రస్తుతం లండన్ మ్యూజియంలో కొలువై ఉంది. అదొక్కటే కాదు...500 కిలోల బరువుతో 2.3 మీటర్ల ఎత్తుతో ఉండే సుల్తాన్‌గంజ్ బుద్ధ విగ్రహం సైతం బ్రిటన్ అధీనంలోనే ఉంది. అలాంటివి ఇంకా అనేకం ఉన్నాయి. చరిత్రను మనకిష్టం వచ్చినట్టు మార్చలేం. మన అభిప్రాయాలకు తగ్గట్టు మల చలేం. అయితే చరిత్రలో జరిగిన తప్పుల్ని తప్పులుగా అంగీకరించడం ద్వారా, క్షమాపణ కోరడంద్వారా ...తగిన పరిహారం చెల్లించడం ద్వారా కొంతవరకూ సరి చేసుకోవచ్చు. అలా చేస్తే ఆ తప్పుల పర్యవసానంగా బాధితులైనవారి వారసులకు సాంత్వన లభిస్తుంది. స్వీయ తప్పిదాలను గుర్తించడం, సరిచేసుకోవడం పరిణతి చెందిన వ్యక్తిత్వానికి, మనస్తత్వానికి చిహ్నం. అలాంటి వారిని మన్నించడమైనా అంతే...ఉన్నత వ్యక్తిత్వానికి నిదర్శనం. న్యూజిలాండ్‌లోని ఆదిమజాతులపై 1840లో సాగించిన దౌష్ట్యానికి బ్రిటన్ రాణి 1995లో క్షమాపణ కోరారు. చైనాలో సాగించిన అరాచకాలపై, నరమేథంపై జపాన్ చక్రవర్తి, ప్రధాని చైనా ప్రజలకు క్షమాపణ చెప్పారు. 200 ఏళ్లపాటు సాగించిన వలస పాలనలో ప్రజలను ఉక్కు పాదాలకింద అణచి ఉంచి, ఇక్కడి సంపదను సర్వస్వం దోచుకుపోయిన బ్రిటన్ మనకు మాత్రం ఇంతవరకూ క్షమాపణ చెప్పలేదు. ఎందరో వీరుల్ని ఉరికంబం ఎక్కించినందుకూ, ఎన్కౌంటర్ల పేరుతో కాల్చిచంపినందుకూ, లక్షలాదిమందిని జైళ్లపాలు చేసినందుకూ అది పశ్చాత్తాపం ప్రకటించలేదు. కనీసం కోహినూర్ లాంటి అపురూపమైన వస్తువుల్ని తిరిగివ్వడానికైనా అది ముందుకు రావడం లేదు. కోహినూర్ ఈ దేశ ప్రజల భావోద్వేగాలతో ముడిపడి ఉన్న అనేకానేక అం శాల్లో ఒకటి. అది ఇక్కడి తరగని సంపదలకూ, విలువైన వనరులకూ ప్రతీక మాత్రమే కాదు... రెండు శతాబ్దాలపాటు అడ్డూ ఆపూ లేకుండా సాగిన వలస దోపి డీకి కూడా చిహ్నం. పర్షియన్ భాషలో కోహినూర్ అంటే ‘కాంతి శిఖరం’ అని అర్ధం. దాని వేయేళ్ల చరిత్రను గమనిస్తే ఆ పేరు దానికి అన్ని విధాలా సరిపోతుం దనిపిస్తుంది. మన పురాణగాధల్లోని శమంతకమణి కథకు ఉన్న మలుపులన్నీ కోహినూర్‌కు కూడా ఉన్నాయి. కాకతీయుల ఏలుబడి కొనసాగుతున్న దశలో ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణాజిల్లా పరిటాల దగ్గర లభ్యమైన ఆ వజ్రం ఎందరెం దరో చేతులు మారింది. మహమ్మద్ బీన్ తుగ్లక్ సేనలు వరంగల్‌ను ముట్టడించి నప్పుడు 793 క్యారట్ల(158.6 గ్రాముల) ఆ వజ్రం ఢిల్లీకి చేరింది. ఆ తర్వాత నాదిర్ షా నెమలి సింహాసనంతోపాటు దాన్ని కూడా ఎత్తుకెళ్లాడు(నెమలి సింహా సనం ప్రస్తుతం ఇరాన్ దగ్గరుంది). అఫ్ఘానిస్తాన్‌పై దండెత్తి లాహోర్ కేంద్రంగా పం జాబ్‌ను పాలించిన రంజిత్‌సింగ్ కోహినూర్‌ను తన అధీనంలోకి తెచ్చుకున్నాడు. తన మరణానంతరం పూరీలోని జగన్నాథాలయానికి అప్పగించమని వీలునామా కూడా రాశాడు. 1843లో ఆయన మరణించాక కుమారుడు అయిదేళ్ల దలీప్ సింగ్‌ను రాజుగా ఉంచి తల్లి పాలనా బాధ్యతలు నిర్వహించిన కొన్నాళ్లకు రాజ్యంలో కల్లోల పరిస్థితులు ఏర్పడ్డాయి. దాన్ని చక్కదిద్దే సాకుతో ఈస్టిండియా కంపెనీ రంగ ప్రవేశం చేసి, సిక్కుల తిరుగుబాటును అణిచి ఆ రాజ్యాన్ని స్వాధీనం చేసుకుంది. దలీప్ పదమూడేళ్ల బాలుడిగా ఉండగా ఈస్టిండియా కంపెనీ ప్రతి నిధులు అతన్ని ఇంగ్లండ్‌కు వలస తీసుకుపోయి అతనితోనే బ్రిటిష్ రాణికి కోహినూర్ వజ్రాన్ని బహుకరించే ఏర్పాటు చేశారు. సుప్రీంకోర్టు ముందు అది ‘బహుమతి’ అని కేంద్రం చెప్పింది ఈ కారణంతోనే! బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడం ఇద్దరు సమాన స్థాయి వ్యక్తులు లేదా స్వతంత్ర వ్యక్తుల మధ్య మాత్రమే ఉంటుంది. ఆ ఇద్దరిలో స్వీకరించేవారు యజ మానిగా లేదా అజమాయిషీ చెలాయించేవారిగా...‘ఇచ్చేవారు’ బానిసగా ఉన్న ప్పుడు దాన్ని ‘బహుమతి’ అనరు. అందుకు దోపిడీ, దొంగతనంలాంటి వేరే పేర్లు న్నాయి. వలస పాలకుల వారసుల పరిభాష వేరే ఉండొచ్చు. వలస దోపిడీకి గురైన వారిగా మనం ఏం మాట్లాడాలో...ఏం మాట్లాడుతున్నామోనన్న స్పృహ కలిగి ఉం డాలి. సొలిసిటర్ జనరల్ రంజిత్‌కుమార్‌కు ఈ విషయంలో సూచనలిచ్చిన మహా నుభావులకు ఆ స్పృహ లోపించినట్టు కనబడుతోంది. బ్రిటన్‌ది ఈ విషయంలో ఒకే వాదన. ‘అలా తిరిగివ్వడానికి మా చట్టాలు అంగీకరించవ’న్నదే ఆ వాదన సారాం శం. 1963లో ఆ దేశం బ్రిటిష్ మ్యూజియం చట్టం పేరిట ఒక శాసనాన్ని తెచ్చింది. దాని ప్రకారం జాతీయ మ్యూజియంలో కొలువై ఉన్న వస్తువుల్ని తిరిగిచ్చేందుకు వీలుకావడం లేదని బ్రిటన్ వాదిస్తోంది. ఈ బాపతువాదాన్ని మర్కట తర్కం అం టారు. దొంగిలించిన వస్తువులన్నిటినీ బాహాటంగా ఓ మ్యూజియంలో పెట్టుకోవ డమే సిగ్గుమాలినతనం. వాటిని ఇచ్చేది లేదంటూ చట్టం తెచ్చుకోవడం ఆ సిగ్గుమా లినతనానికి పరాకాష్ట. ఇవ్వడానికి అది అడ్డంకిగా మారిందంటూ చెప్పడం వం చన. మన దేశం 1948 నుంచీ ఈ కోహినూర్ వజ్రాన్ని తిరిగివ్వాలని అడుగుతోంది. మరికొన్ని ఇతర దేశాలు కూడా వారి వారి వస్తువులు తిరిగివ్వాలని కోరారు. వీట న్నిటినీ దృష్టిలో పెట్టుకునే 1963లో మ్యూజియం చట్టం తీసుకొచ్చారన్నది దాచేస్తే దాగని సత్యం. కోహినూర్‌తో మన పేదరికం పోతుందా... మన సమస్యలన్నీ తీరి పోతాయా...దానికోసం ఎందుకంత రాద్ధాంతమని కొందరు తర్కం లేవదీస్తు న్నారు. అలాంటి సమస్యల పరిష్కార సాధనలో కావలసిన సొంత వ్యక్తిత్వానికీ, రాజీపడని తత్వానికీ కోహినూర్ తిరిగి పొందడమన్నది ఒక చిహ్నం. అందుకోసం కావాలి మనకు కోహినూర్! ఈ విషయంలో వైఖరి మార్చుకోవడమే కాదు...దాన్ని సాధించేదాకా అన్ని స్థాయిల్లోనూ ఎన్డీఏ ప్రభుత్వం పోరాడుతుందని ఆశిద్దాం. -
కోహినూర్‌ను గిఫ్ట్‌గా ఇచ్చారు
వజ్రాన్ని తిరిగి తీసుకురాలేమని కేంద్రం సంకేతం ♦ ఆనాటి పంజాబ్ పాలకులు బ్రిటన్‌కు బహుమతిగా ఇచ్చారు ♦ అది కావాలంటే.. మన దగ్గరున్న విదేశీ చారిత్రక సంపదను తిరిగి ఇవ్వాల్సి రావొచ్చన్న సాంస్కృతిక శాఖ ♦ వజ్రాన్ని తీసుకురావాలన్న పిటిషన్‌ను కొట్టేయలేమన్న సుప్రీం న్యూఢిల్లీ: ప్రపంచ ప్రఖ్యాత కోహినూర్ వజ్రాన్ని యునెటైడ్ కింగ్డమ్ (బ్రిటన్) నుంచి భారత్‌కు తిరిగి తీసుకురావాలంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్‌ను) కొట్టివేయటానికి సుముఖంగా లేమని సుప్రీంకోర్టు పేర్కొంది. అలా చేస్తే కోహినూర్ వజ్రంపై భారతదేశపు న్యాయమైన హక్కును బ్రిటన్ నిరాకరించటానికి దారితీయొచ్చని, భవిష్యత్తులో దాన్ని వెనక్కితెచ్చే ప్రయత్నాలకు అవరోధంగా మారే అవకాశముందని పేర్కొంది. కోహినూర్ తోపాటు టిప్పుసుల్తాన్ ఉంగరం, కత్తి వంటి అమూల్యమైన వారసత్వ సంపదను తిరిగి భారత్‌కు రప్పించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని ఆలిండియా హ్యూమన్ రైట్స్, సోషల్ జస్టిస్ ఫ్రంట్ సంస్థలు పిల్ వేయడం తెలిసిందే. దానిని విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు.. స్పందన తెలపాల్సిందిగా ఇంతకుముందే కేంద్రాన్ని ఆదేశించింది. తాజాగా సోమవారం దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టి.ఎస్.ఠాకూర్, యు.యు.లలిత్‌లతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ తరఫున సొలిసిటర్ జనరల్ రంజిత్‌కుమార్ వివరణ ఇచ్చారు. ‘‘కోహినూర్ బలవంతంగా తీసుకెళ్లారనో, దొంగతనానికి గురైందనో చెప్పలేం. సిక్కు యుద్ధాల్లో తమకు సహకరించినందుకు 1849లో మహరాజా రంజిత్‌సింగ్ వారసులు ఈస్ట్ ఇండియా కంపెనీకి ఆ వజ్రాన్ని ఇచ్చారు. ఆ వజ్రాన్ని వెనక్కి తీసుకురావాలని పార్లమెంటులోనూ, బయటా చాలా సార్లు డిమాండ్లు వచ్చాయి. కానీ కోహినూర్ లాంటి సంపదను వెనక్కివ్వాలని మనం కోరితే.. మన దేశంలోని మ్యూజియాల్లో ఉన్న విదేశీ చారిత్రక సంపద, కళాఖండాలను తిరిగి ఇచ్చేయాల్సిందిగా ఆయా దేశాలు కోరతాయి. అప్పుడు మన మ్యూజియాల్లో ఏమీ మిగలవు’’ అని చెప్పారు. తద్వారా ఆ వజ్రాన్ని వెనక్కు తీసుకురాలేమని సంకేతాలిచ్చారు. దీనిపై ధర్మాసనం పై విధంగా స్పందించింది. తాము ఈ పిల్‌ను కొట్టివేసినట్లయితే.. భవిష్యత్తులో భారత్ ఆ వజ్రాన్ని అడిగినప్పుడు ‘మీ సుప్రీంకోర్టు పిల్‌ను కొట్టివేసింది’ అన్న కారణం చూపుతూ నిరాకరించేందుకు అవకాశం ఉంది’ అని పేర్కొంది. ఈ అంశంలో విదేశాంగశాఖ ఇంకా తన అభిప్రాయాన్ని, వివరణను సమర్పించాల్సి ఉండటంతో.. కోహినూర్‌పై హక్కు విషయంలో ప్రభుత్వ వైఖరిపై సమగ్రమైన అఫిడవిట్‌ను దాఖలు చేయాలని నిర్దేశిస్తూ విచారణను ఆరు వారాలకు వాయిదా వేసింది. ఇదిలావుంటే.. కోహినూర్‌ను వెనక్కి తీసుకొచ్చే అంశంలో కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఎలాంటి చర్యలూ చేపట్టబోదని ఆ శాఖ మంత్రి మహేశ్‌శర్మ చెప్పారు. అది దౌత్యపరమైన అంశమని.. దానిపై కేంద్ర, విదేశాంగశాఖలు నిర్ణయం తీసుకుంటాయన్నారు. గుంటూరు నుంచి బ్రిటన్ వరకూ..! ప్రపంచంలోని అత్యంత విలువైన వజ్రాల్లో కోహినూర్ ఒకటి. వంద శాతం స్వచ్ఛత గల ఈ వజ్రం బరువు 108 క్యారెట్లు. దీని విలువ రూ.6,600 కోట్ల పైమాటేనని అంచనా. అసలు కోహినూర్ అంటే పర్షియన్ భాషలో ‘కాంతి శిఖరం’ అని అర్థం. 14వ శతాబ్దంలో గుంటూరు సమీపంలో ఈ వజ్రం దొరికినట్లు ప్రచారంలో ఉంది. అప్పట్లో ఏకంగా 793 క్యారెట్ల బరువుతో ప్రపంచంలోనే అతిపెద్ద వజ్రం అది. ఔరంగజేబు హయాంలో దానికి మెరుగుపెట్టించే ప్రయత్నంలో.. 186 క్యారట్లకు తగ్గిపోయింది. బ్రిటిషర్ల వద్ద మరింత చిక్కిపోయింది. తొలుత కాకతీయుల చేతిలో ఉన్న ఈ వజ్రం ఆ తర్వాత ఎన్నో చేతులు మారింది. మొఘలుల చేతిలో నుంచి నాదిర్షా దండయాత్ర సమయంలో పర్షియాకు మారింది. అనంతరం క్రమంగా పంజాబ్ పాలకుడు మహరాజా రంజిత్‌సింగ్ వద్దకు చేరింది. సిక్కు యుద్ధాల సమయంలో ఈస్ట్ ఇండియా కంపెనీ రంజిత్‌సింగ్ వారసులకు సహాయపడడంతో.. వారు బ్రిటిష్ వారికి అప్పగించారు. అలా ఆ వజ్రం చివరికి బ్రిటన్ మహారాణి కిరీటంలోకి చేరింది. ఈ వజ్రం తమదంటే తమదని భారత్‌తోపాటు పాకిస్తాన్, ఇరాన్, అఫ్ఘానిస్తాన్‌లు కూడా వాదిస్తున్నాయి. కోహినూర్ వజ్రం పురుషులెవరికీ కలసి రాదనే నమ్మకం ఉంది. బ్రిటిష్ రాచకుటుంబంలోనూ ఆ నమ్మకం కొనసాగి.. క్వీన్ విక్టోరియా కిరీటంలో భాగమైంది. -
కోహినూర్ ఇక ఎప్పటికీ భారత్‌కు తిరిగి రాదా?
న్యూఢిల్లీ: ప్రపంచంలోనే ప్రఖ్యాత వజ్రమైన కోహినూర్ ఇక ఎప్పటికీ భారత్‌కు దక్కకపోవచ్చు. మన చారిత్రక సంపద అయిన ఈ వజ్రాన్ని తిరిగి భారత్‌కు తీసుకొచ్చే విషయమై సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సమాధానం ఇదే సంకేతాలను ఇచ్చింది. కోహినూర్ వజ్రాన్ని భారత్ కు తిరిగి ఇవ్వాల్సిందిగా యునైటెడ్ కింగ్డమ్ను బలవంతపెట్టలేమని, ఎందుకంటే ఈ వజ్రాన్ని బ్రిటన్ దొంగలించడం కానీ, బలవంతంగా తీసుకుపోవడంగానీ చేయలేదని, ఆ దేశానికి కానుకగా ఇచ్చామని కేంద్రం న్యాయస్థానానికి విన్నవించింది. స్వాతంత్ర్యానికి పూర్వం దేశం ఆవలకు తరలిపోయిన ప్రాచీన సంపదను ప్రభుత్వం తీసుకురాకూడదంటూ 43 ఏళ్ల కిందట తీసుకొచ్చిన చట్టాన్ని ఉటంకిస్తూ కేంద్రం తరఫున సోలిసిటర్ జనరల్ రంజిత్‌కుమార్ సోమవారం వాదనలు వినిపించారు. 1849నాటి సిక్కు యుద్ధంలో ఓడిపోయిన నేపథ్యంలో మహారాజా రంజిత్ సింగ్ 105.602 క్యారెట్ల కోహినూర్ వజ్రాన్ని ఈస్టిండియా కంపెనీకి అందజేశారని ఆయన సుప్రీంకోర్టుకు నివేదించారు. ఆంటిక్విటీస్ అండ్ ఆర్ట్ ట్రెజరీ చట్టం 1972 ప్రకారం దేశం నుంచి అక్రమంగా తరలిపోయిన ప్రాచీన సంపదను మాత్రమే ఆర్కియాలిజీ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) తిరిగి తీసుకొచ్చే అవకాశముంటుందని తెలిపారు. కోహినూర్ వజ్రంతోపాటు భారత్ నుంచి తీసుకుపోయిన ప్రాచీన సంపదను తిరిగి తీసుకురావాల్సిందిగా బ్రిటన్‌లోని భారత హైకమిషనర్‌కు ఆదేశాలు ఇవ్వాలంటూ అఖిల భారత మానవ హక్కులు, సామాజిక న్యాయం సంస్థ సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసింది. దీనిని విచారణకు చేపట్టిన న్యాయస్థానం గతంలో కేంద్రం సమాధానం కోరిన సంగతి తెలిసిందే. -
కోహినూర్ పిటిషన్ స్వీకరించిన పాక్ కోర్టు
లాహోర్: కోహినూర్ వజ్రంపై పిటిషన్‌ను పాకిస్తాన్ కోర్టు విచారణకు స్వీకరించింది. ఈ వజ్రాన్ని బ్రిటిన్ నుంచి తిరిగి తెప్పించే విషయమై పాక్ ప్రభుత్వాన్ని ఆదేశించేందుకు అంగీకరించింది. బ్రిటన్ రాణి ఎలిజిబెత్-2 కిరీటంలో ఉన్న కోహినూర్‌ను పాకు తేవాలని జావెద్ ఇక్బాల్ అనే న్యాయవాది వేసిన పిటిషన్‌ను లాహోర్ హైకోర్టు విచారించింది. -
'కోహినూర్ ను పాకిస్థాన్ కు తెప్పించండి'
లాహోర్ : తెలుగువారి అమూల్య సంపదగా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కోహినూర్ వజ్రాన్ని ఇంగ్లండ్ (యూకే) నుంచి వెనక్కి తెప్పించాలని పాక్ ప్రభుత్వాన్ని కోరుతూ అక్కడ కోర్టులో పిటిషన్ దాఖలైంది. జావెద్ ఇక్బాల్ జఫ్రీ అనే న్యాయవాది లాహోర్ హైకోర్టులో గురువారం ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. మహారాజా రంజిత్‌సింగ్ మనవడు దిలీప్‌సింగ్ నుంచి కోహినూర్ వజ్రాన్ని లాక్కుని బ్రిటన్‌కు తీసుకెళ్లినట్లు ఆయన పేర్కొన్నారు. న్యాయవాది జావెద్ తన పిటిషన్లో .. 1953లో రాణీ ఎలిజబెత్-II కిరీటంలో పొదగబడిన కోహినూర్ వజ్రం మీద ఆమెకు ఎటువంటి హక్కు లేదని పేర్కొన్నారు. 105 క్యారెట్లు ఉన్న ఈ వజ్రం విలువ బిలియన్లలో ఉంటుందని, నిజానికి కోహినూర్ వజ్రం పంజాబ్ ప్రావిన్స్ సాంస్కృతిక వారసత్వ సంపద అని చెప్పారు. 1849లో పంజాబ్.. బ్రిటీషర్ల దురాక్రమణకు గురైన నేపథ్యంలో సిక్కు చక్రవర్తుల ఆస్తుల జప్తులో భాగంగా పాకిస్థాన్‌లోని లాహోర్ నుంచి ఈ కోహినూర్ వజ్రం బ్రిటీష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి చేరిందని జావెద్ పిటిషన్లో చెప్పుకొచ్చారు. అలా లాహోర్ నుంచి చేతులు మారిన వజ్రాన్ని బ్రిటిష్ ప్రభుత్వం నుంచి తిరిగి పాకిస్థాన్‌కు తీసుకురావాల్సిందిగా ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలని ఆయన కోర్టును కోరారు. కొన్ని వందల ఏళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా కొల్లూరు గనులలో ఈ కోహినూర్ వజ్రం బయటపడింది. మాల్వా రాజు మహలక్ దేవ్ దీని తొలి యజమానిగా కొందరు చరిత్రకారులు భావిస్తారు. తర్వాతికాలంలో కాకతీయుల సామ్రాజ్యానికి చేరింది. ఆ తర్వాత మొఘల్ రాజుల పరమయ్యింది. కోహినూర్ కు ఆ పేరు (కోహ్-ఇ-నూర్ అంటే కాంతి శిఖరం) పెట్టింది కూడా మొఘలులే. అక్కడి నుంచి చేతులు మారి ఆంగ్లేయుల వశమైన ఈ వజ్రం ప్రస్తుతం లండన్‌లోని ఓ మ్యూజియంలో ఉంది. దాన్ని తిరిగివ్వాల్సిందిగా భారత ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు ఏవీ ఫలించలేదు. ఈ క్రమంలో కోహినూర్ వజ్రం మాదేనంటూ, తిరిగి పాకిస్థాన్‌కు తెప్పించాలంటూ.. కొత్తగా పాక్ కోర్టులో పిటిషన్ దాఖలు కావడం గమనార్హం. -
ఆ బహుమతి అపురూపం
ఆభరణాలను ఇష్టపడని అమ్మాయిలు ఉండరు. ఏ కొంతమందో ఇందుకు మినహాయింపుగా ఉంటారు. కానీ, శ్రద్ధాకపూర్ వంటి అమ్మాయిలకు మాత్రం ఎన్ని నగలున్నా తనివి తీరదు. ‘‘నా సగం సంపాదన నగలకే పోతుంది’’ అని శ్రద్ధాకపూర్ చెబుతూ -‘‘నా చిన్నప్పుడు మా అమ్మగారు నాకో నెక్లెస్ ఇచ్చారు. అది మా అమ్మమ్మది. ఆమె గుర్తుగా మా అమ్మగారు చాలా భద్రంగా దాచుకున్నారు. తర్వాత నాకు అప్పగించారు. చాలా అందమైన నెక్లెస్ అది. అమ్మ ఇచ్చిన ఆ అపురూపమైన బహుమతిని నేను చాలా జాగ్రత్తగా దాచుకున్నా. ఇప్పటివరకూ నేను ఎన్నో నగలు కొనుకున్నా. మా అమ్మగారికి మాత్రం కోహినూర్ డైమండ్ ఇవ్వాలన్నది నా ఆకాంక్ష. కానీ, అది విదేశీయుల వశమైపోయింది. సో.. నా కోరిక తీరే అవకాశం లేదు. ఆ బాధ నన్నెప్పటికీ వెంటాడుతుంది’’ అని చెప్పారు. -
కోహినూర్ వజ్రం కోసం...
కోహినూర్ వజ్రం జన్మ రహస్యం ఏంటి? దాన్ని ఆంగ్లేయులు ఎలా మన నుంచి తరలించుకుపోయారు? అనే ఓ యువతి పరిశోధనే ప్రధానాంశంగా రూపొందిన చిత్రం ‘తోకచుక్క’. సందీప్‌రావ్, కుముద నాయక్ ప్రధాన పాత్రధారులు. గోపీచంద్ కాట్రగడ్డ దర్శకుడు. రజనీ కాట్రగడ్డ నిర్మాత. శనివారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరులు సమావేశంలో దర్శకుడు మాట్లాడుతూ -‘‘కాకతీయ సామ్రాజ్యానికి సంబంధించిన ఖజానాని స్వప్రయోజనాలకు కొందరు, దేశ ప్రయోజనాలకు మరికొందరు వెలికి తీయడానికి చేసే ప్రయత్నమే ఈ చిత్ర కథ. హిస్టరీ, మిస్టరీ కలగలుపుగా ఉంటుంది. రుద్రమదేవి, సమ్మక్క, సారలమ్మల గురించి కూడా ఇందులో ప్రస్తావించాం. కాకతీయులపై పీహెచ్డీ చేసే అమ్మాయిగా కుముద నటించింది. రెండేళ్ల పాటు చిత్రీకరణ జరిపాం. త్వరలో పాటల్ని, మే నెలలో సినిమాను విడుదల చేస్తాం’’ అని తెలిపారు. ఇంకా చిత్ర యూనిట్ సభ్యులు మాట్లాడారు.