
కోహినూర్ పిటిషన్ స్వీకరించిన పాక్ కోర్టు
లాహోర్: కోహినూర్ వజ్రంపై పిటిషన్‌ను పాకిస్తాన్ కోర్టు విచారణకు స్వీకరించింది. ఈ వజ్రాన్ని బ్రిటిన్ నుంచి తిరిగి తెప్పించే విషయమై పాక్ ప్రభుత్వాన్ని ఆదేశించేందుకు అంగీకరించింది. బ్రిటన్ రాణి ఎలిజిబెత్-2 కిరీటంలో ఉన్న కోహినూర్‌ను పాకు తేవాలని జావెద్ ఇక్బాల్ అనే న్యాయవాది వేసిన పిటిషన్‌ను లాహోర్ హైకోర్టు విచారించింది.